- Home
- Life
- Zinc Foods: జింక్ నిండుగా ఉంటే ఈ ఫుడ్స్ రోజూ తిన్నారంటే రోగనిరోధక శక్తి అమాంతం పెరిగిపోతుంది
Zinc Foods: జింక్ నిండుగా ఉంటే ఈ ఫుడ్స్ రోజూ తిన్నారంటే రోగనిరోధక శక్తి అమాంతం పెరిగిపోతుంది
Zinc Foods: రోగనిరోధక శక్తి పెరగడానికి విటమిన్ సి మాత్రమే సరిపోదు. దానికి తోడు జింక్ కూడా అవసరం. మన శరీరంలోని చాలా ముఖ్యమైన పనులకు జింక్ ఎంతో అవసరం. జింక్ నిండుగా ఉండే ఆహార పదార్థాలను ఇక్కడ ఇచ్చాము.

జింక్ అధికంగా ఉండే ఆహారాలు
మన శరీరం సొంతంగా జింక్ తయారు చేసుకోలేదు, అలాగే నిల్వ ఉంచుకోలేదు. అందుకే మనం తినే ఆహారం ద్వారానే జింక్ అందాలి. రోగనిరోధక శక్తి బలంగా ఉండాలంటే జింక్ ఎంతో అవసరం. జింక్ నిండుగా ఉండే ఆహార పదార్థాల గురించి ఇక్కడ ఇచ్చాము. వేరుశెనగ, జీడిపప్పు, బాదంలో జింక్ పుష్కలంగా ఉంటుంది. వీటిలో హెల్తీ ఫ్యాట్స్, విటమిన్లు, ఫైబర్ కూడా ఉంటాయి. అన్ని రకాల నట్స్ కంటే జీడిపప్పులో జింక్ శాతం చాలా ఎక్కువ.
పాలు, చీజ్, పెరుగు లాంటి డైరీ ప్రొడక్ట్స్ ద్వారా మనకు జింక్ బాగా అందుతుంది. వీటిలో ఉండే జింక్‌ను మన శరీరం చాలా వేగంగా, సులభంగా గ్రహిస్తుంది.
కోడిగుడ్డు, డార్క్ చాక్లెట్
గుడ్డులో జింక్‌తో పాటు ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, సెలీనియం, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. రోజూ ఒక గుడ్డు తింటే మన శరీరానికి కావాల్సిన జింక్ సులభంగా అందుతుంది.
డార్క్ చాక్లెట్లో జింక్, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, మెగ్నీషియం ఎక్కువ. ఇది మన మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే బ్లడ్ ప్రెషర్ తగ్గించడంలో కూడా బాగా పనిచేస్తుంది.
పప్పులు, ఓట్స్
పప్పు ధాన్యాల్లో ప్రోటీన్, జింక్ మెండుగా ఉంటాయి. శెనగలు, కందులు, పెసలు, బీన్స్ లాంటివి మన రోజువారీ డైట్లో చేర్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
ఓట్స్ ద్వారా మనకు జింక్ బాగా అందుతుంది. ఇందులో ఉండే ఫైబర్ వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువసేపు ఉంటుంది. ఇది గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది, బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది.





