MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Psychology: సైకాలజీ ప్రకారం మనిషి ఎప్పుడు ఎక్కువ ఒంటరిగా ఫీల్ అవుతాడో తెలుసా?

Psychology: సైకాలజీ ప్రకారం మనిషి ఎప్పుడు ఎక్కువ ఒంటరిగా ఫీల్ అవుతాడో తెలుసా?

Psychology: చుట్టూ ఎంతమంది ఉన్నా కొందరికి మనసులో మాత్రం ఏదో చెప్పలేని వెలితి ఉంటుంది. అందరిలో ఉన్నా తీవ్రంగా ఒంటరిగా ఫీల్ అవుతుంటారు. సైకాలజీ ప్రకారం ఒక వ్యక్తి ఎప్పుడు ఎక్కువ ఒంటరితనాన్ని అనుభవిస్తాడో మీకు తెలుసా? మరి లేటెందుకు తెలుసుకుందాం పదండి. 

2 Min read
Author : Kavitha G
Published : Jun 15 2026, 03:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మనిషి ఎక్కువ ఒంటరిగా ఎప్పుడు ఫీల్ అవుతాడు?
Image Credit : freepik

మనిషి ఎక్కువ ఒంటరిగా ఎప్పుడు ఫీల్ అవుతాడు?

ఒంటరితనం అనేది కేవలం మన చుట్టూ మనుషులు లేకపోవడం వల్ల కలిగే భావన కాదు. కొంతమంది.. ఎంతమందిలో ఉన్నా ఒంటరితనాన్ని అనుభవిస్తుంటారు. సైకాలజీ నిపుణుల ప్రకారం, ఒక వ్యక్తి జీవితంలో పెద్ద మార్పులు వచ్చినప్పుడు ఒంటరితనం ఎక్కువగా అనిపిస్తుంది. ఉద్యోగం మారడం, కొత్త సిటీకి వెళ్లడం, చదువుల కోసం ఇంటిని వదిలి వెళ్లడం, పెళ్లి తర్వాత కొత్త వాతావరణంలోకి అడుగుపెట్టడం వంటి సందర్భాల్లో మనకు తెలిసిన వ్యక్తులు, అలవాట్లు, పరిసరాలు దూరమవుతాయి. ఈ మార్పుల కారణంగా మనిషిలో ఒంటరితనం పెరుగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సంబంధాలు దెబ్బతిన్నప్పుడు..
Image Credit : our own

సంబంధాలు దెబ్బతిన్నప్పుడు..

ప్రేమించిన వ్యక్తిని కోల్పోయినప్పుడు లేదా సంబంధాలు దెబ్బతిన్నప్పుడు కూడా మనిషి తీవ్రంగా ఒంటరితనాన్ని అనుభవిస్తాడు. జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులు, స్నేహితుడు లేదా ప్రేమించిన వ్యక్తి దూరమైనప్పుడు మనసులో ఒక వెలితి ఏర్పడుతుంది. ఆ ఖాళీని భర్తీ చేయడం అంత ఈజీ కాదు. ఈ సమయంలో చాలామంది తమ బాధను ఇతరులతో పంచుకోలేక లోలోపల మౌనంగా బాధపడుతుంటారు. సైకాలజీ ప్రకారం భావోద్వేగ బంధాలు కోల్పోవడం ఒంటరితనానికి ప్రధాన కారణాల్లో ఒకటి.

Related Articles

Related image1
Psychology: సైకాలజీ ప్రకారం మనసు ఎక్కువగా ఎప్పుడు బాధపడుతుందో తెలుసా..?
Related image2
Dream Meaning: కలలో Ex లవర్ కనిపిస్తే అర్థం ఏంటి? మనసు ఇంకా వారినే కోరుకుంటున్నట్లా?
35
ఎవరు అర్థం చేసుకోనప్పుడు..
Image Credit : freepik

ఎవరు అర్థం చేసుకోనప్పుడు..

మనిషి తన భావాలను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని అనుకున్నప్పుడు కూడా ఒంటరితనం పెరుగుతుంది. కుటుంబం, స్నేహితులు లేదా సహోద్యోగులు మనతో ఉన్నప్పటికీ మన సమస్యలను, ఎమోషన్స్ ని ఎవరూ నిజంగా వినడం లేదని అనిపిస్తే మనం ఒంటరిగా ఫీల్ అవుతాం. చాలా సందర్భాల్లో ఒంటరితనం భౌతిక దూరం వల్ల కాకుండా భావోద్వేగ దూరం వల్ల వస్తుంది.

45
ఇది కూడా కారణమే..
Image Credit : freepik

ఇది కూడా కారణమే..

నిపుణుల ప్రకారం సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలను చూసి మన జీవితంతో పోల్చుకోవడం వల్ల కూడా కొంతమందిలో ఒంటరితనం, అసంతృప్తి పెరుగుతున్నాయి. బయటకు అందరూ సంతోషంగా కనిపిస్తున్నారనే భావన, తాము మాత్రమే సమస్యలతో ఉన్నామనే ఆలోచన మనసులో ఒంటరితనాన్ని మరింత బలపరుస్తుంది. అలాగే వృద్ధాప్యంలో ఒంటరితనం మరింత ఎక్కువగా కనిపిస్తుంది. పిల్లలు పనుల్లో బిజీ అయిపోవడం, స్నేహితులు దూరం కావడం లేదా ఆరోగ్య సమస్యలు పెరగడం వల్ల చాలామంది వృద్ధులు ఒంటరిగా ఫీల్ అవుతుంటారు. యువతలో కూడా ఒత్తిడి, పోటీ, ఉద్యోగ భయం, వ్యక్తిగత సంబంధాల సమస్యల కారణంగా ఒంటరితనం పెరుగుతోంది.

55
ఒంటరిగా ఫీల్ కావొద్దంటే..
Image Credit : freepik

ఒంటరిగా ఫీల్ కావొద్దంటే..

సైకాలజీ నిపుణుల ప్రకారం మన ఫీలింగ్స్ ని నమ్మకమైన వ్యక్తులతో పంచుకోవడం చాలా అవసరం. మనసులో ఉన్న బాధను దాచుకోవడం కంటే బయటకు చెప్పుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులు, స్నేహితులతో రెగ్యులర్ గా సమయం గడపాలి. అలాగే సోషల్ మీడియాపై ఎక్కువగా ఆధారపడకుండా నిజమైన సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
పాత కార్డ్‌బోర్డులతో కిచెన్‌కు కొత్త లుక్ ఇచ్చేయండి.. వాటిని ఇలా వాడేయండి
Recommended image2
Utensils: దీనితో శుభ్రం చేస్తే.. మాడిపోయిన గిన్నెలు కూడా కొత్త వాటిలా మెరిసిపోతాయి..!
Recommended image3
Coriander: ఇలా చేస్తే కొత్తిమీర ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటుంది!
Related Stories
Recommended image1
Psychology: సైకాలజీ ప్రకారం మనసు ఎక్కువగా ఎప్పుడు బాధపడుతుందో తెలుసా..?
Recommended image2
Dream Meaning: కలలో Ex లవర్ కనిపిస్తే అర్థం ఏంటి? మనసు ఇంకా వారినే కోరుకుంటున్నట్లా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved