MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Parenting: పేరెంట్స్ చేసే ఈ 5 తప్పులే పిల్లలను లేజీగా మార్చుతాయి.. జాగ్రత్త!

Parenting: పేరెంట్స్ చేసే ఈ 5 తప్పులే పిల్లలను లేజీగా మార్చుతాయి.. జాగ్రత్త!

Parenting: పిల్లలు సోమరిపోతులుగా మారడానికి వారి స్వభావం ఒక్కటే కారణం కాదు. తల్లిదండ్రుల పెంపకం కూడా కారణం కావచ్చు. ముఖ్యంగా పేరెంట్స్ చేసే కొన్ని తప్పులు పిల్లలను లేజీగా మార్చుతాయంటున్నారు నిపుణులు. ఆ తప్పులేంటో, వాటిని ఎలా నివారించాలో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Jul 16 2026, 02:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పేరెంట్స్ చేయకూడని 5 తప్పులు
Image Credit : AI

పేరెంట్స్ చేయకూడని 5 తప్పులు

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చక్కగా ఎదగాలని, బాధ్యతగా ఉండాలని కోరుకుంటారు. అయితే తెలియకుండానే పేరెంట్స్ చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు పిల్లల వ్యక్తిత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా కొన్ని అలవాట్లు నేర్పించకపోతే పిల్లల్లో బద్ధకం, బాధ్యతారాహిత్యం, ఇతరులపై ఆధారపడే స్వభావం పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లలు సోమరిపోతులుగా మారడానికి వారి స్వభావం మాత్రమే కారణం కాదు. ఇంట్లో ఉండే వాతావరణం, తల్లిదండ్రుల పెంపకం తీరు కూడా కారణం కావచ్చు. అందుకే పేరెంట్స్ ఈ 5 తప్పులు అస్సలు చేయద్దు అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పిల్లల పనులు తల్లిదండ్రులే చేయడం
Image Credit : Getty

పిల్లల పనులు తల్లిదండ్రులే చేయడం

కొంతమంది తల్లిదండ్రులు ప్రేమతో పిల్లలు చెప్పిన ప్రతి పని చేస్తుంటారు. పిల్లలు చేసుకోగలిగిన పనులు కూడా పేరెంట్సే చేస్తుంటారు. స్కూల్ బ్యాగ్ సర్దడం నుంచి బట్టలు మడత పెట్టడం, గది శుభ్రం చేయడం వరకు అన్నీ తల్లిదండ్రులే చూసుకుంటారు. దీంతో పిల్లలకు బాధ్యత అనే భావన పెరగదు. "నేను చేయకపోయినా ఎవరో ఒకరు చేస్తారులే" అనే అలవాటు ఏర్పడుతుంది. చిన్న చిన్న పనులను పిల్లలే చేసుకునేలా ప్రోత్సహిస్తే వారిలో ఆత్మవిశ్వాసంతో పాటు క్రమశిక్షణ కూడా పెరుగుతుంది.

Related Articles

Related image1
Psychology: సైకాలజీ ప్రకారం భార్యాభర్తలు ఒకరితో ఒకరు చెప్పకూడని 5 మాటలు ఇవే!
Related image2
Telugu Saying: వడ్డించేవాడు మనవాడైతే వెనుక బంతిలో కూర్చున్నా పర్వాలేదు.. ఈ కాలానికి తగ్గ సామెత!
36
ఎక్కువగా గారాబం చేయడం
Image Credit : Getty

ఎక్కువగా గారాబం చేయడం

ఏదైనా పని చేస్తే వెంటనే చాక్లెట్, మొబైల్ లేదా డబ్బులు ఇవ్వడం వల్ల పిల్లలు ప్రతి పనికి ప్రతిఫలం ఆశించే అలవాటు పెంచుకుంటారు. అలాగే ఏ పని చేయకపోయినా వారి కోరికలన్నీ వెంటనే తీర్చేస్తే కష్టపడాల్సిన అవసరం వారికి కనిపించదు. జీవితంలో ప్రతి విజయానికి శ్రమ అవసరమనే విషయాన్ని పిల్లలు అర్థం చేసుకునేలా చేయాలి.

46
స్క్రీన్ అలవాటు చేయడం
Image Credit : Getty

స్క్రీన్ అలవాటు చేయడం

ప్రస్తుతం చాలా ఇళ్లలో పిల్లలు గంటల తరబడి మొబైల్ స్క్రీన్ ముందు గడుపుతున్నారు. దీనివల్ల శారీరక కదలికలు తగ్గిపోవడమే కాకుండా చదువుపై, ఇతర పనులపై ఆసక్తి కూడా తగ్గుతుంది. క్రమంగా పిల్లలు ఏ పని చేయాలన్నా బద్ధకంగా భావిస్తారు. స్క్రీన్ టైమ్‌కు పరిమితులు పెట్టి, ఆటలు, పుస్తకాలు చదవడం, బయట ఆడుకోవడం వంటి మంచి అలవాట్లను ప్రోత్సహించడం అవసరం.

56
తప్పులు సరిదిద్దకపోవడం
Image Credit : Freepik

తప్పులు సరిదిద్దకపోవడం

కొంతమంది తల్లిదండ్రులు పిల్లల ప్రతి తప్పును కప్పిపుచ్చుతూ వారిని ఎప్పుడూ కాపాడాలని చూస్తారు. దీంతో పిల్లలకు తమ పనుల ఫలితాలను అర్థం చేసుకునే అవకాశం ఉండదు. చిన్న తప్పుల నుంచే వారు నేర్చుకుంటారు. కాబట్టి ప్రతి సమస్య నుంచి వారిని బయటకు తీసుకురావడం కంటే, ఆ సమస్యకు పరిష్కారం ఎలా కనుగొనాలో నేర్పించడం మంచిది.

66
తల్లిదండ్రులే ఆదర్శంగా లేకపోవడం
Image Credit : Getty

తల్లిదండ్రులే ఆదర్శంగా లేకపోవడం

పిల్లలు చెప్పిన మాటల కంటే చూసిన విషయాలనే ఎక్కువగా అనుసరిస్తారు. ఇంట్లో తల్లిదండ్రులు రోజంతా మొబైల్‌లో గడిపినా, పనులను వాయిదా వేస్తూ ఉన్నా, క్రమశిక్షణ పాటించకపోయినా పిల్లలు కూడా అదే అలవాట్లను నేర్చుకుంటారు. కాబట్టి ముందు తల్లిదండ్రులు ఆదర్శంగా ఉండాలి. అప్పుడు పిల్లలు కూడా సహజంగానే పేరెంట్స్ ని చూసి మంచి విషయాలు నేర్చుకుంటారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిన్నారుల సంరక్షణ
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chopping Board: కూరగాయలు కట్ చేయడానికి ఏ చాపింగ్ బోర్డు వాడుతున్నారు? స్టీల్, వుడ్ రెండిటిలో ఏది బెస్ట్?
Recommended image2
Period Diet: పీరియడ్స్ టైంలో ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది!
Recommended image3
భారతీయులు ఎంజాయ్ చేయడానికి బ్యాంకాక్‌కు ఎందుకు వెళ్తారు?
Related Stories
Recommended image1
Psychology: సైకాలజీ ప్రకారం భార్యాభర్తలు ఒకరితో ఒకరు చెప్పకూడని 5 మాటలు ఇవే!
Recommended image2
Telugu Saying: వడ్డించేవాడు మనవాడైతే వెనుక బంతిలో కూర్చున్నా పర్వాలేదు.. ఈ కాలానికి తగ్గ సామెత!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved