మహిళలు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ 4 పోషకాలు ఎంతో అవసరం..
Essential Nutrients : కుటుంబమంతా ఆరోగ్యంగా ఉండేందుకు మహిళలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ వాళ్ల ఆరోగ్యం గురించి మాత్రం అస్సలు పట్టించుకోరు. వారు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బాగుంటుంది. కాబట్టి వారిని ఆరోగ్యంగా ఉంచే ఈ ఈ నాలుగు పోషకాలు మహిళలు తమ రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం ఎంతో అవసరం.

Essential Nutrients : పురుషుల జీవన విధానానికి మహిళల జీవన విధానానికి చాలా తేడా ఉంటుంది. ఆడవారి విభిన్న జీవన విధానం, శరీరాలను కలిగి ఉండటంతో వీరు తీసుకునే ఫుడ్ కూడా భిన్నంగానే ఉంటుంది. అందుకే వారికి తగ్గట్టుగా పోషకాహారం తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
ముఖ్యంగా మహిళలు తమ రోజు వారి ఆహారంలో ఎన్నో పోషకాలను తీసుకోవాల్సి ఉంటుంది. వీరి ఆరోగ్యం బాగుండాలన్నా, రోగాల బారిన పడకుండా ఉండాలన్నా కొన్ని రకాల పోషకాలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందుకోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐరన్: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆడవారు పోషకాహార లోపం, రక్తహీనతో బాధపడుతున్నారు. రక్తహీనత నుంచి బయటపడటానికి ఇనుము ఎంతో అవసరం. కాబట్టి ఐరన్ ఉన్న ఆహార పదార్థాలను ప్రతిరోజూ తీసుకోవాలి. ఇందుకోసం డార్క్ చాక్లెట్, , తృణధాన్యాలు, ఆకు కూరలు, చికెన్, టోపు వంటి వాటిని తినాలి. ఒకవేళ బాడీలో ఐరన్ స్థాయిలు తగ్గితే రక్తహీనత సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే గర్భిణులకు ఐరన్ ఎంతో అవసరం. కాబట్టి వారు ఐరన్ ఎక్కువుగా ఉండే ఆహార పదార్థాలను తినాలి.
అయోడిన్: అయోడిన్ మహిళల మెరుగైన ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇది లోపిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సంతానోత్పతి సమస్య , నిరాశ, వెయిట్ పెరగడం, పాలిచ్చే తల్లులు కూడా అకస్మత్తుగా బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చిక్కుళ్లు, స్ట్రాబెర్రీలు, ఆర్గానిక్ చీజ్ వంటి ఆహారాల్లో అయోడిన్ ఎక్కువగా ఉంటుంది.
కోలిన్: మహిళలకు అత్యవసరమైనన పోషకాలలో కోలిన్ ఒకటి. మహిళలు ఆరోగ్యంగా ఉండేందుకు కోలిన్ తప్పకుండా తీసుకోవాలి. మెదడు నాడీ వ్యవస్థ, మానసిక స్థితి, కండరాల నియంత్రణ, Memory మెరుగ్గా పనిచేయాలంటే కోలిన్ ఎంతో అవసరం. ఇది Body cells చుట్టూరా ఉండేం పొరలను ఏర్పాటుకు ఎంతో సహాయపడుతుంది. కానీ ఇది ఎక్కువ మంది ఆడవారిలో తగినంతగా ఉండదు. ఇది గర్భిణీ స్త్రీలకు ఎంతో అవసరం. దీనివల్ల కడుపులో పెరుగుతున్న బిడ ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుంది. చేపలు, గుడ్లు, ఫౌల్ట్రీ, పాల ఉత్పత్తులు, మాంసం లో కోలిన్ పుష్కలంగా ఉంటుంది.
జింక్: మహిళలు ఆరోగ్యంగా ఉండేందుకు జింక్ ఎంతో అవసరం. ఇది మన శరీరానికి కొద్ది మొత్తంలోనే అవసరం. రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపచడానికి, గాయాలు తొందరగా తగ్గడానికి, కణాలు పెరగడానికి జింక్ ఎంతో అవసరం. కాబూలీ చనా, వాల్ నట్స్, గుమ్మడికాయ గింజలు, పుట్టగొడుగులు, జీడిపప్పు, పొద్దుతిరుగుడు విత్తనాలు, రాగుల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది.