- Home
- Life
- Life Destroying Habits : చెక్ చేసుకొండి... ఈ పది అంశాల్లో ఏ మూడు మీ జీవితంలో ఉన్నా దేవుడు కూడా రక్షించలేడు
Life Destroying Habits : చెక్ చేసుకొండి... ఈ పది అంశాల్లో ఏ మూడు మీ జీవితంలో ఉన్నా దేవుడు కూడా రక్షించలేడు
Life Destroying Habits కొన్ని అలవాట్లు మనిషి జీవితాన్పి నాశనం చేస్తాయి. అలాంటి 10 అలవాట్లు ఏమిటో ఇక్కడ తెలుసుకొండి… మీ జీవితంలో అవి ఉన్నాయేమో చెక్ చేసుకొండి.

టెస్ట్ చేసుకొండి..
సంక్రాంతి సంబరాలు ముగిసాయి..!
1. మెజారిటీ ప్రజలు తమ కుటుంబ సభ్యులతో బంధువులతో గడిపారు. వారి వారి బడ్జెట్ .. అభిరుచి బట్టి గ్రామంలో లేదా ఏదైనా టూరిస్ట్ ప్లేస్ లో.
2. కొంతమంది మాత్రం కోడి పందాల్లో .. సోషల్ మీడియాలో కులం, ప్రాంతం, లింగం పేరుతొ దూషణల్లో ..!
ఒకటో కేటగిరీ వారిలో ఇప్పుడు ఎంత హ్యాపీ హార్మోన్స్ వచ్చాయి..
రెండో కేటగిరీ వారిలో ఎంత కార్తిజాల్ హార్మోన్ వచ్చింది..
టెస్ట్ చేస్తే సమాజానికి కనువిప్పు కలుగుతుంది.
ఈ అలవాట్లు మీకు ఉన్నాయా..?
1 . నలుగురితో పోలిక, ఆత్మన్యూనతా భావం. విలాసాలకు అలవాటు పడిపోవడం. స్తోమతకు మించి ఖర్చులు. ఈజీ మనీ కోసం పాకులాట.
2 . ఈజీ మనీ కోసం వలపు వల విసరడం. ఒక్కసారైనా మొఖాన్ని అద్దంలో చూసుకోకుండా ఎవరో తెలియని ఒక మహిళ సోషల్ మీడియా లో "హాయ్" అనగానే తాను మన్మధుడు అని భావించి వలపు వలకు చిక్కి ఇల్లు ఒళ్ళు గుల్లచేసుకోవడం.
3 . ఓటీటీ సినిమాలు, నెట్ లో నీలి చిత్రాలు చూడడం
4 . సోషల్ మిడియాలో కావాలనే వివాదం సృష్టించేలా పోస్ట్ లు పెట్టడం.. ఆ వివాదం లో చిక్కి పరస్పర దూషణలు... ప్రతి దానిలో నెగెటివ్ వెదకడం
5 . అతిగా తాగడం .. అది కిక్ ఇవ్వకపోవడంతో గంజాయి మొదలు రకరకాల మాధకద్రవ్యాలు వైపుకు మళ్లడం.
మీ జీవితాన్ని నాశనం చేసే అలవాట్లు..
6. మొహమాటానికి పోయి అప్పులు ఇవ్వడం.. షూరిటీ ఇవ్వడం, అపాత్ర దానం.. డబ్బులు రెట్టింపు కావాలని బోగస్ స్కీమ్స్ ను నమ్మడం.. శక్తికి మించి అప్పులు చెయ్యడం.. పొదుపు లేకపోవడం
7 . చీటికిమాటికి డయాగ్నస్టిక్ టెస్ట్ లు చేసుకోవడం .. అయినదానికీ కానిదానికి మందులు.. సర్జరీలు. ఫార్మాసురుల వలలో చిక్కడ.. మెడికల్ ఇన్సూరెన్స్ వుందికదా అని ఒంటిని మందుల డంపింగ్ యార్డ్ గా మార్చడం
8. ఎవరేమి చెప్పినా గుడ్డిగా నమ్మేయడం.. మంచిమాటలు కూడా నమ్మకపోవడం.
9 . సంచలన వార్తలకు అలవాటు పడడం... జస్ట్ హెడ్ లైన్స్ చదవడం .. అవగాహన కలిగించేవి ఏవో తప్పుదారి పట్టించేవి ఏవో తెలుసుకోలేక పోవడం.. చదివే ఓపిక లేకపోవడం .. ఆలోచించే తత్వాన్ని కోల్పోవడం .
10 . అన్ని రకాల సమస్యలకు మూల కారణం అయిన మొబైల్ పరికరాలకు బానిస కావడం..
దేవుడు కూడాా వీరిని రక్షించలేడు..
ఈ పదింటిలో కనీసం మూడు విషయాలు ఎవరికైతే వర్తిస్తాయో వారి బతుకుల్లో సమ్ కాంతి కూడా ఉండదు.
మరో రెండు మూడు సంక్రాంతి పండుగలకల్లా వీరి బతుకులు చీకటి మయం అయిపోతాయి.
దేవుడు కూడా వారిని రక్షించలేడు.
చేసుకొన్న వారికి చేసుకున్నంత .
నాన్నా..! డిజిటల్ యుగం లో ట్రెండ్ ఫాలో అయ్యే గొర్రెగా మారకు. సైబర్ స్మార్ట్ నెస్ అలవరుచుకో.
ఆగండి.
ఆలోచించండి..
స్మార్ట్ లైఫ్ స్టైల్ అలవరుచుకోండి.

