MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Jobs
  • Army Job: భారత సైన్యంలో పెద్ద అధికారి కావాలనుందా? ఆర్మీ ఆఫీసర్ ఎలా అవ్వాలో తెలుసుకోండి?

Army Job: భారత సైన్యంలో పెద్ద అధికారి కావాలనుందా? ఆర్మీ ఆఫీసర్ ఎలా అవ్వాలో తెలుసుకోండి?

Army Job: భారత సైన్యంలో పెద్ద అధికారి కావాలని ఎంతో మంది యువత కోరుకుంటారు. కానీ సైనికుడు అయ్యేంత సులువుగా పెద్ద అధికారి అవ్వడం అంత సులువు కాదు. ఆర్మీలో పెద్ద ఆఫీసర్ అవ్వాలంటే ఎలానో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 27 2026, 09:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఆర్మీ ఆఫీసర్ కావడం ఎలా?
Image Credit : Gemini AI

ఆర్మీ ఆఫీసర్ కావడం ఎలా?

ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక బలగాల్లో భారతీయ ఆర్మీ ఒకటి. అందులో అధికారిగా చేరడం ఎంతోమంది యువతీయువకుల స్వప్నం. మువ్వన్నెల పతాకం నీడలో దేశానికి సేవలందిస్తూ ఉన్నత హోదా పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఎలా అవ్వాలో మాత్రం ఎంతో మందికి తెలియదు. అలాంటి కలలు కనే యువత కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏటా రెండుసార్లు ఎన్‌డీఏ, సీడీఎస్ పరీక్షలు నిర్వహింస్తుంది. ఇంటర్మీడియట్ చదువుతున్న లేదా పూర్తి చేసిన 16 నుంచి 20 ఏళ్ల లోపు అవివాహితులు నేషనల్ డిఫెన్స్ అకాడమీ పరీక్షకు అర్హులు. అలాగే ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన 19 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించారు. సైన్యంలో పర్మనెంట్ కమిషన్ లేదా షార్ట్ సర్వీస్ కమిషన్ విధానాల్లో దేశసేవ చేయాలనుకునే యువతకు ఈ పరీక్షలు ప్రవేశాన్ని కల్పిస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎలాంటి పరీక్షలు ఉంటాయి?
Image Credit : Pixabay

ఎలాంటి పరీక్షలు ఉంటాయి?

ఈ నియామక ప్రక్రియలో రాతపరీక్షతో పాటు సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు నిర్వహించే ఐదు రోజుల వ్యక్తిత్వ పరీక్ష ఉంటుంది. ఎన్‌డీఏ ప్రవేశ పరీక్షలో గణితం, జనరల్ ఎబిలిటీలపై రాతపరీక్షలు ఉంటాయి. సీడీఎస్ విభాగంలో ఆంగ్లం, సాధారణ పరిజ్ఞానం, ప్రాథమిక గణిత అంశాలను పరీక్షిస్తారు. వీటిలో ప్రతిభ చూపిన అభ్యర్థులను ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఆర్మీ ఎప్పుడూ కేవలం క్లాస్‌రూమ్ టాపర్ల కోసం చూడదు, సంక్షోభ సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకునే బాధ్యత గల సమర్థవంతమైన నాయకులకు ప్రాధాన్యత ఇస్తుంది. సైకాలజీ పరీక్షలు, క్షేత్రస్థాయి గ్రూప్ టాస్కులు, ముఖాముఖి ద్వారా అభ్యర్థుల్లోని నైతిక విలువలు, శారీరక దృఢత్వం, ఆలోచనా తీరును క్షుణ్ణంగా అంచనా వేస్తారు.

33
ఎంపికయ్యాక నెలకు జీతం?
Image Credit : Pixabay

ఎంపికయ్యాక నెలకు జీతం?

ఎంపికైన క్యాడెట్లకు పుణెలోని ఖడక్‌వస్లా ఎన్‌డీఏ కేంద్రంలో మూడేళ్ల పాటు ఉచితంగా ఉన్నత స్థాయి శిక్షణ లభిస్తుంది. ఆ తరువాత నేవీ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీల్లో మరో ఏడాది శిక్షణ ఇస్తారు. అవి పూర్తయ్యాక జేఎన్‌యూ డిగ్రీతో పాటు గౌరవప్రదమైన అధికారి హోదా దక్కుతుంది. సీడీఎస్ ద్వారా ఎంపికైన వారు డెహ్రాడూన్‌లోని ఐఎంఏ లేదా చెన్నైలోని ఓటీఏ వంటి అకాడమీలలో ప్రత్యేక శిక్షణ పొందుతారు. శిక్షణ కాలంలో నెలకు దాదాపు యాభై ఆరు వేల రూపాయల స్టైపెండ్ లభిస్తుంది. సాధారణ ప్రవేశాలతో పాటు పీసీఎం చదివిన వారికి టెక్నికల్ ఎంట్రీ, న్యాయశాస్త్ర పట్టభద్రులకు జేఏజీ మార్గాల ద్వారానూ సైన్యాధికారి అయ్యే అవకాశాలున్నాయి. చదువుతో పాటూ క్రీడల్లో పాల్గొంటూ తమ నాయకత్వ లక్షణాలను మెరుగుపరుచుకుంటే సైనిక దళాల్లో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలంగాణలో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. ఎవ‌రు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి?
Recommended image2
Free Digital Skills: పైసా ఖర్చు లేకుండా నేర్చుకోగలిగే 5 బెస్ట్ డిజిటల్ స్కిల్స్ ఇవే!
Recommended image3
Railway Jobs : డిగ్రీ పాసయితే చాలు రైల్వేలో జాబ్... వెంటనే అప్లై చేసుకొండి
Related Stories
Recommended image1
Cyclone Arnab: తుపానులకు పేర్లు ఎవరు పెడతారు? ఎందుకు పెడతారు?
Recommended image2
Vizag Beach: విశాఖపట్నం వెళితే ఈ బీచ్ చూడకుండా రాకండి.. కొండలు, కొబ్బరితోటలతో నిండిన గంగవరం బీచ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved