MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Jobs
  • Government Jobs : గట్టిగా ట్రై చేస్తే నెలకు రూ.1,27,050 జీతంతో ఓ సర్కార్ నౌకరీ మీదే.. టిజిపిఎస్సి జాబ్ నోటిఫికేషన్ ఫుల్ డిటెయిల్స్

Government Jobs : గట్టిగా ట్రై చేస్తే నెలకు రూ.1,27,050 జీతంతో ఓ సర్కార్ నౌకరీ మీదే.. టిజిపిఎస్సి జాబ్ నోటిఫికేషన్ ఫుల్ డిటెయిల్స్

తెలంగాణ యువతకు ఇదే అద్భుత అవకాశం. ప్రభుత్వ ఉద్యోగాల నియామక సంస్థ టిజిపిఎస్సి నుండి వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

3 Min read
Author : Arun Kumar P
Published : Jul 09 2026, 12:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
టిజిపిఎస్సి నుండి మరో జాబ్ నోటిఫికేషన్
Image Credit : Gemini AI

టిజిపిఎస్సి నుండి మరో జాబ్ నోటిఫికేషన్

TGPSC Jobs Notification 2026 : ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలుగంటున్న యువతీయువకులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇప్పటికే వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఉద్యోగ నియామక సంస్థ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TGPSC) నోటిఫికేషన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే... తాజాగా టౌన్ ఆండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ లో ఖాళీలను భర్తీకి ప్రకటన వెలువడింది. టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలతో నోటిఫికేషన్ విడుదల చేసింది టిజిపిఎస్సి... అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, ఖాళీలు, అర్హతలు, వయోపరిమితి, ఫీజు, పరీక్షా విధానం వంటి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ముఖ్యమైన వివరాలు..
Image Credit : Getty

టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ముఖ్యమైన వివరాలు..

నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్(TGPSC)

భర్తీచేసే పోస్టులు : టౌన్ ఆండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు

దరఖాస్తు ప్రక్రియ

టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం : 10 జూలై 2026

దరఖాస్తులకు చివరి తేదీ : 17 ఆగస్ట్ 2026

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అధికారిక వెబ్ సైట్ https://www.tgpsc.gov.in ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. నేరుగా టిజిపిఎస్సి కార్యాలయానికి దరఖాస్తు పంపించడం, ఇతర ఏ పద్దతిలోనూ దరఖాస్తు చేయరాదు.

దరఖాస్తు ఫీజు

ఓసి, బిసి అభ్యర్థులకు - రూ.1000

ఎస్సి, ఎస్టి, పిడబ్ల్యుడి - రూ.500

ప్రతి అభ్యర్థి ఎగ్జామినేషన్ ఫీజుగా 120 రూపాయలు చెల్లించాలి.

కేవలం ఆన్ లైన్ లోనే పేమెంట్ చేయాలి. ఒక్కసారి ఫీజు చెల్లించాలి తిరిగి ఇవ్వబడదు.

Related Articles

Related image1
Government Bank Jobs : డిగ్రీ చదివితే చాలు.. నెలకు రూ.85,920 జీతంతో ప్రభుత్వ బ్యాంకులో ఆఫీసర్ జాబ్స్
Related image2
Government Jobs : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. నెలకు రూ.50,000 శాలరీతో గవర్నమెంట్ ఆఫీసర్ జాబ్స్ రిక్రూట్మెంట్
37
టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ
Image Credit : Gemini AI

టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ

రాత పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

అక్టోబర్, 2026 లో రాతపరీక్ష ఉంటుంది. తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. ఎగ్జామ్ కు 7 రోజుల ముందునుండి హాల్ టికెట్స్ జారీ చేస్తారు... పరీక్షకు ముందురోజు సాయంత్రం 5 గంటల వరకు పొందవచ్చు. ఆన్లైన్ లో ఈ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి.

ఈ నగరాల్లోనే ఎగ్జామ్ సెంటర్లు..

హైదరాబాద్ (HMDA పరిధి)

కరీంనగర్

ఖమ్మం

వరంగల్

నిజామాబాద్ లలో ఎగ్జామ్ సెంటర్లు

ఎగ్జామ్ సిలబస్ 

రాత పరీక్ష రెండు పేపర్లు ఉంటుంది - మొత్తం 450 మార్కులు

పేపర్-1 : జనరల్ స్టడీస్ ఆండ్ జనరల్ ఎబిలిటీస్ - 150 ప్రశ్నలు - 150 నిమిషాల సమయం - 150 మార్కులు (ఇంగ్లీష్, తెలుగులో ఉంటుంది)

పేపర్-2 : సబ్జెక్ట్ కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. 150 ప్రశ్నలు - 150 నిమిషాల సమయం - 300 మార్కులు (కేవలం ఇంగ్లీష్ లోనే)

47
రిజర్వేషన్లవారిగా టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలు
Image Credit : Getty

రిజర్వేషన్లవారిగా టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలు

మల్టీ జోనల్ క్యాడర్ ఉద్యోగాలివి. టౌన్ ఆండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో మొత్తం 10 టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

రిజర్వేషన్ల వారిగా ఖాళీలు..

ఓసి - 6

బిసి-ఏ - 2

ఎస్సి - 2

57
టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు విద్యార్హతలు
Image Credit : Getty

టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు విద్యార్హతలు

టౌన్ ఆండ్ కంట్రీ ప్లానింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లమా తప్పనిసరిగా చేసివుండాలి. అలాగే B.Arch (బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్) లేదా B.E (బిఈ)/B.Tech(బిటెక్) లేదా B.Planning (బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్)/ B.Tech (Planning) లేదా ఎంఏ (జాగ్రఫీ) లేదా ఎమ్మెస్సీ (జాగ్రపీ) లేదా ఎమ్మెస్సీ (జియోఇన్ఫ్మేటిక్స్) పూర్తిచేసి ఉండాలి. 

ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుండి ఈ విద్యార్హతలు కలిగివుండాలి. 06/07/2026 నాటికి ఈ విద్యార్హతలు కలిగినవారే అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఉద్యోగాలకు అర్హులు.

67
టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు వయో పరిమితి
Image Credit : Gemini AI

టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు వయో పరిమితి

టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారి వయసు 18 నుండి 44 ఏళ్లలోపు ఉండాలి.

01-07-2026 వరకు గల వయసును పరిగణలోకి తీసుకుంటారు

02-07-1982 నుండి 01-07-2008 మధ్య పుట్టినవారు అర్హులు

18 ఏళ్లకంటే తక్కువ, 61 ఏళ్ల కంటే ఎక్కువ వయసు గలవారు అనర్హులు

వయో పరిమితి సడలింపు

ఎస్సి, ఎస్టి, బిసి, ఈడబ్ల్యుఎస్ - 5 ఏళ్లు

దివ్యాంగులు - 10 ఏళ్లు

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు (కార్పోరేషన్స్, మున్సిపాలిటీల ఉద్యోగులు కాకుండా) - 5 ఏళ్లు

మాజీ ఆర్మీ ఉద్యోగులు - 3 ఏళ్లు

N.C.C (ఇన్స్ట్రక్టర్ గా పనిచేసి ఉండాలి) - 3 ఏళ్లు

77
టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ శాలరీ ఎంత?
Image Credit : Gemini

టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ శాలరీ ఎంత?

టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ అనేవి రాష్ట్రస్థాయి ఉద్యోగాలు కాబట్టి ఉన్నత హోదాతో పాటు మంచి శాలరీ ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఎంపికయ్యే అభ్యర్థికి నెలకు రూ.58,850 నుండి రూ.1,27,050 జీతం ఉంటుంది. ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు లభించే అన్నిరకాల అలవెన్సులు లభిస్తాయి. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
ఉద్యోగాలు, కెరీర్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pilot Training : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్... ఇకపై ఈజీగా మీ పైలట్ కలను నిజం చేసుకోవచ్చు
Recommended image2
Bank Jobs : ప్రభుత్వ బ్యాంకులో జాబ్ సాధించాలని కలగంటున్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు
Recommended image3
TG Police Recruitment 2026: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ ఎంత? జీతం, క్వాలిఫికేషన్, నెగెటివ్ మార్కింగ్ ఫుల్ డీటైల్స్
Related Stories
Recommended image1
Government Bank Jobs : డిగ్రీ చదివితే చాలు.. నెలకు రూ.85,920 జీతంతో ప్రభుత్వ బ్యాంకులో ఆఫీసర్ జాబ్స్
Recommended image2
Government Jobs : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. నెలకు రూ.50,000 శాలరీతో గవర్నమెంట్ ఆఫీసర్ జాబ్స్ రిక్రూట్మెంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved