MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Telangana
  • Hyderabad: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. మరో రెండు భారీ ప్రాజెక్టులు.. ఈ ప్రాంతాల రూపురేఖలు మారబోతున్నాయి !

Hyderabad: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. మరో రెండు భారీ ప్రాజెక్టులు.. ఈ ప్రాంతాల రూపురేఖలు మారబోతున్నాయి !

Hyderabad: హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు పర్మనెంట్ చెక్ పెట్టడానికి ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతోంది. రూ.5,750 కోట్లతో భాగ్యనగరంలో ఈ ప్రాంతం రూపురేఖలు మార్చబోతోంది. హెచ్ఎండీఏ చేపట్టిన 2 భారీ ఎలివేటెడ్ కారిడార్ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 05 2026, 09:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భాగ్యనగరంలో మరో మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. ఇక ఆ ఏరియాల రూపురేఖలు టోటల్‌గా ఛేంజ్
Image Credit : Getty

భాగ్యనగరంలో మరో మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. ఇక ఆ ఏరియాల రూపురేఖలు టోటల్‌గా ఛేంజ్

హైదరాబాద్ సిటీలో రోజురోజుకూ ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్, అల్వాల్, శామీర్‌పేట్ రూట్లలో పీక్ అవర్స్‌లో ప్రయాణించాలంటే నరకం కనిపిస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేటల నుండి సిటీ లోపలికి రావడానికి ఐదారు కిలోమీటర్ల దూరాన్ని గంటన్నర పాటు నరకం చూస్తూ దాటాల్సి వస్తోంది.

ఈ ట్రాఫిక్ టెన్షన్లకు పర్మనెంట్ చెక్ పెడుతూ, హైదరాబాద్ రూపురేఖలను మార్చేసేలా ప్రభుత్వం రెండు భారీ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్తోంది. ఈ ప్రాజెక్టులతో ప్రయాణ సమయం కేవలం 10-15 నిమిషాలకు తగ్గిపోనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
డెయిరీ ఫామ్ కారిడార్ అప్‌డేట్
Image Credit : Gemini

డెయిరీ ఫామ్ కారిడార్ అప్‌డేట్

ప్యారడైజ్ జంక్షన్ నుండి బోయినపల్లి మీదుగా డెయిరీఫామ్ (NH-44) వరకు 5.4 కిలోమీటర్ల మేర ఈ కారిడార్‌ను ప్లాన్ చేశారు. రూ.1,487 కోట్ల బడ్జెట్‌తో చేపట్టిన ఈ ప్రాజెక్టులో బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ రన్‌వే కింద నుండి విమానాలకు ఎలాంటి ఆటంకం లేకుండా 600 మీటర్ల మేర అత్యాధునిక భూగర్భ సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ కారిడార్ పనులు దాదాపు 45 శాతం పూర్తయ్యాయి. మొత్తం 90 పిల్లర్లకు గాను ఇప్పటికే 22 పిల్లర్ల పనులు పూర్తవడమే కాకుండా, 6 పిల్లర్లపై పియర్ క్యాప్స్, 33 గిడ్డర్ల తయారీ కూడా అయిపోయింది.

Related Articles

Related image1
IND vs ENG: చేతులారా మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌కు అప్పగించారు.. భారత్ కొంపముంచిన ఆ 5 ప్రధాన కారణాలు ఇవే !
Related image2
First Railway Station in Telangana: తెలంగాణ మొదటి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా? దీనిని ఎవరు కట్టించారు? ఎందుకు?
35
శామీర్‌పేట్ కారిడార్‌తో కొత్త లుక్
Image Credit : Gemini

శామీర్‌పేట్ కారిడార్‌తో కొత్త లుక్

ప్యారడైజ్ నుండి తిరుమలగిరి, అల్వాల్ మీదుగా శామీర్‌పేట్ ఓఆర్ఆర్ ను కనెక్ట్ చేస్తూ 18.14 కిలోమీటర్ల మేర మరో మైండ్ బ్లోయింగ్ కారిడార్‌ను నిర్మిస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం ఏకంగా రూ.4,263 కోట్లు వెచ్చిస్తోంది. ఈ రూట్‌లో టివోలీ జంక్షన్ నుండి విక్రంపురి వరకు 1.5 కిలోమీటర్ల మేర ఓపెన్ అండర్‌పాస్ రానుంది.

వర్షపు నీరు నిలిస్తే క్షణాల్లో ఖాళీ చేసేందుకు మోడ్రన్ టెక్నాలజీ పంపులను సెట్ చేస్తున్నారు. కార్ఖానా, అల్వాల్ వాసుల కోసం మూడు ర్యాంపులను, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద 450 మీటర్ల అండర్ టన్నెల్‌ను నిర్మిస్తున్నారు.

45
సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్
Image Credit : Asianet News

సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్

ఈ మెగా ప్రాజెక్టులను ఏడాదిన్నర నుండి రెండేళ్ల లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్‌లైన్ పెట్టుకుంది. ఈ కారిడార్ల రూట్ ఎక్కువ భాగం మిలటరీ భూముల గుండా వెళ్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి భూసేకరణను పర్యవేక్షిస్తున్నారు.

అవసరమైన 165.587 ఎకరాల రక్షణ భూముల్లో ఇప్పటికే 91.79 ఎకరాలను హెచ్ఎండీఏ స్వాధీనం చేసుకుంది. మిగిలిన భూముల సేకరణను ఆగస్టు నాటికి పూర్తి చేసి పనుల స్పీడ్ పెంచాలని అధికారులు ప్లాన్ చేశారు.

55
అత్యాధునిక ప్రీ కాస్టింగ్ విధానం
Image Credit : Gemini

అత్యాధునిక ప్రీ కాస్టింగ్ విధానం

నగరంలో ట్రాఫిక్‌కు డిస్టర్బెన్స్ లేకుండా ఉండేందుకు ఈ పనులను 'ప్రీ కాస్టింగ్' పద్ధతిలో చేస్తున్నారు. అంటే పిల్లర్లు, పియర్ క్యాప్స్ వంటి నిర్మాణాలను సిటీ బయట కండ్లకోయ, హకీంపేట్ యార్డులలో తయారు చేసి, నైట్ టైమ్‌లో తెచ్చి ఇక్కడ ఈజీగా ఫిక్స్ చేస్తారు.

క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా ఉండేందుకు 'ఆర్వీ కన్సల్టెన్సీ'ని నియమించి, మోడ్రన్ క్వాలిటీ ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేశారు. రీసెంట్‌గా హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ ఆదేశాలతో అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hyderabad: ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకు చల్లటి వార్త.. ఇకపై లోకల్ ట్రైన్స్ లో మెట్రో లాంటి అనుభూతి
Recommended image2
Weather Update: తీవ్రమైన ఈదురుగాలులు.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాలకు భారీ వర్షల హెచ్చరిక
Recommended image3
హైద‌రాబాదీల‌కు అల‌ర్ట్‌.. ఆదివారం ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు, పూర్తి వివరాలు
Related Stories
Recommended image1
IND vs ENG: చేతులారా మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌కు అప్పగించారు.. భారత్ కొంపముంచిన ఆ 5 ప్రధాన కారణాలు ఇవే !
Recommended image2
First Railway Station in Telangana: తెలంగాణ మొదటి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా? దీనిని ఎవరు కట్టించారు? ఎందుకు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved