MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Jobs
  • Viral News : ఏమిటీ.. రూ.72 లక్షల జీతంతో ఉద్యోగం ఇస్తామంటే వద్దన్నాడా..! కారణమేంటో తెలిస్తే షాక్

Viral News : ఏమిటీ.. రూ.72 లక్షల జీతంతో ఉద్యోగం ఇస్తామంటే వద్దన్నాడా..! కారణమేంటో తెలిస్తే షాక్

సాధారణంగా రూ.5-10 లక్షల యానువల్ ప్యాకేజీతో ఉద్యోగం వస్తేనే చాలామంది సంబరపడిపోతుంటారు. కానీ ఓ వ్యక్తి ఏకంగా రూ.75 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం ఇస్తామంటే సింపుల్ గా రిజెక్ట్ చేశాడు. కారణమేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Jun 01 2026, 05:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కళ్లు చెదిరే ప్యాకేజీ జాబ్ వదులుకున్న టెకీ..
Image Credit : X

కళ్లు చెదిరే ప్యాకేజీ జాబ్ వదులుకున్న టెకీ..

Viral News : ఏకంగ 72 లక్షల రూపాయల జీతమిచ్చి ఉద్యోగం ఇస్తామంటే ఎవరు వద్దంటారు. ఇలాంటి జాబ్ ఆఫర్ వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ ఓ సాఫ్ట్‌వేర్ డెవలపర్ మాత్రం ఈ భారీ ఆఫర్‌ను వద్దనుకున్నాడు. ఈ రోజుల్లో ఉద్యోగులకు కేవలం జీతం మాత్రమే ముఖ్యం కాదని… వర్క్ కల్చర్, ఇతర సౌకర్యాలు కూడా ఎంత ముఖ్యమో ఈ సంఘటన తెలియజేస్తోంది. కళ్లు చెదిరే ప్యాకేజీల కన్నా ఇవే ముఖ్యమని కొందరు నిపుణులు భావిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇలాంటి ఉద్యోగం వద్దట..
Image Credit : Gemini AI

ఇలాంటి ఉద్యోగం వద్దట..

రాగిణి పాండే అనే సాఫ్ట్‌వేర్ డెవలపర్ 'X' (గతంలో ట్విట్టర్)లో ఒక స్క్రీన్‌షాట్‌ను షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె స్నేహితుడు రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ మొత్తం పూర్తి చేసి, రూ.72 లక్షల వార్షిక వేతనంతో కూడిన ఆఫర్‌ను తిరస్కరించినట్లు ఆమె తెలిపారు. ఆ స్క్రీన్‌షాట్‌లో, మనీష్ అనే రిక్రూటర్... ఆఫర్‌ను అంగీకరించమని, మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేద్దామని కోరడం కనిపిస్తుంది. కానీ ఉద్యోగ నియమ నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఆ డెవలపర్ ఈ ఆఫర్‌ను వద్దనుకున్నాడు.

My friend just rejected a 72 LPA offer.

Reasons:
• 5 days strict WFO
• No leave policy
• Zero relocation support

What shocked me the most? He had zero sense of loss.

It’s fascinating that people like these exist who are willing to let so much money go because of work life… pic.twitter.com/GtSOLEi4S3

— Ragini Pandey (@pandeyragini24) May 31, 2026

34
రూ.75 LPA జాబ్ వద్దనడానికి కారణమిదే..?
Image Credit : Gemini

రూ.75 LPA జాబ్ వద్దనడానికి కారణమిదే..?

ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను కూడా ఆ డెవలపర్ వివరించాడు. సరైన లీవ్ పాలసీ లేకపోవడం, ప్రస్తుత జీతంతో పోలిస్తే తక్కువ హైక్ ఉండటం, వేరే ప్రాంతానికి మారడానికి ఎలాంటి సపోర్ట్ ఇవ్వకపోవడం వంటి అనేక అంశాలను అతను ప్రస్తావించాడు. ''ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అనుకూలంగా లేదు, అందుకే ఈ అవకాశాన్ని వదులుకోవాల్సి వస్తోంది" అని అతను స్పష్టంగా చెప్పాడు. రూ.72 లక్షల ప్యాకేజీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, తన వృత్తిపరమైన, వ్యక్తిగత ప్రాధాన్యాలకు ఇది సరిపోదని ఆ డెవలపర్ నొక్కి చెప్పాడు.

"జీవన వ్యయం, రిలోకేషన్ బోనస్ లేకపోవడం, లీవ్ పాలసీ లేకపోవడం, కేవలం 25% హైక్ వంటివన్నీ పరిగణనలోకి తీసుకుంటే, ఈ ఆఫర్ నాకు సరైనది కాదు" అని అతను పేర్కొన్నాడు. కెరీర్ ప్రారంభంలో ఉంటే బహుశా తాను ఈ ఆఫర్‌ను అంగీకరించేవాడినని అతను అన్నాడు. "అయితే ఇప్పుడు మాత్రం ఈ కాంట్రాక్ట్ ఇరుపక్షాలకు సమంగా కాకుండా, కేవలం కంపెనీకే అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తోంది" అని అతను జోడించాడు.

44
వైరల్ పోస్ట్ పై ఆన్లైన్ లో చర్చ
Image Credit : Getty

వైరల్ పోస్ట్ పై ఆన్లైన్ లో చర్చ

ఈ వైరల్ పోస్ట్ ఆన్‌లైన్‌లో పెద్ద చర్చకు దారితీసింది. చాలా మంది ప్రొఫెషనల్స్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంచి ఉద్యోగం అంటే కేవలం జీతం మాత్రమే కాదని వారు అంటున్నారు. ఈ రోజుల్లో ఉద్యోగులు వర్క్ ఫ్లెక్సిబిలిటీ, లీవ్ పాలసీలు, రిలోకేషన్ సహాయం, వర్క్-లైఫ్ బ్యాలెన్స్, కంపెనీ కల్చర్ వంటి వాటిని కూడా చూశాకే కెరీర్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
పెళ్లైన మహిళలు ఎయిర్ హోస్టెస్ అవ్వొచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..
Recommended image2
Police Recruitment: కొలువుల జాతర.. 2050 పోలీస్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. నోటిఫికేషన్ ఫుల్ డిటైల్స్ ఇవే
Recommended image3
Government Jobs : కేవలం డిప్లొమా, ఐటీఐ చదివితే చాలు.. నెలకు రూ.1.15 లక్షల శాలరీ జాబ్ పొందండి
Related Stories
Recommended image1
Government Jobs : ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1.80 లక్షల జీతంతో ప్రభుత్వ ఉద్యోగం.. ఫుల్ డిటెయిల్స్
Recommended image2
Jobs : AI జమానాలోనూ ఎంత సేఫ్ జాబ్స్..! ఏవో తెలుసా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved