MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Jobs
  • Railway Jobs : తెలుగు యువతకు బంపరాఫర్.. డిగ్రీ పాసైతే చాలు సికింద్రాబాద్ లో రైల్వే జాబ్

Railway Jobs : తెలుగు యువతకు బంపరాఫర్.. డిగ్రీ పాసైతే చాలు సికింద్రాబాద్ లో రైల్వే జాబ్

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) దేశవ్యాప్తంగా 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ పాసైన అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. సికింద్రాబాద్ లో కూడా పోస్టులున్నాయి.

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 16 2026, 02:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రైల్వే జాబ్స్ భర్తీకి ఆర్ఆర్బి నోటిఫికేషన్
Image Credit : Gemini AI

రైల్వే జాబ్స్ భర్తీకి ఆర్ఆర్బి నోటిఫికేషన్

Indian Railway Jobs : ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది చాలామంది యువతీయువకుల కల.. ఇందుకోసం రాత్రింభవళ్లు కష్టపడుతుంటారు. ఇలాంటి తెలుగు యువతకు ఇండియన్ రైల్వేస్ బంపరాఫర్ ఇచ్చింది... రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న సెక్షన్ కంట్రోలర్ (Section Controller - CEN No.03/2026) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ పాసైన వాళ్లు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రైల్వే ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక తేదీలు...
Image Credit : Getty

రైల్వే ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక తేదీలు...

ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం : జూలై 15, 2026.

అప్లై చేయడానికి చివరి తేదీ : ఆగస్టు 14, 2026.

ఫీజు చెల్లించడానికి చివరి తేదీ : ఆగస్టు 16, 2026.

అప్లికేషన్ కరెక్షన్ విండో : 2026 ఆగస్టు 17 నుంచి 26 వరకు.

స్క్రైబ్ (Scribe) వివరాలు ఇవ్వడానికి : 2026 ఆగస్టు 27 నుంచి 31

CBT పరీక్షతో పాటు రిక్రూట్మెంట్ కు సంబంధించిన వివరాల కోసం RRB వెబ్ సైట్ ను తరచూ పరిశీలిస్తూ ఉండాలి.

దరఖాస్తు ఫీజు :

జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: రూ. 500.

ఎస్సీ/ఎస్టీ/మహిళలు/ట్రాన్స్‌జెండర్/మాజీ సైనికులు/దివ్యాంగులకు: రూ. 250.

Related Articles

Related image1
Government Jobs : గట్టిగా ట్రై చేస్తే నెలకు రూ.1,27,050 జీతంతో ఓ సర్కార్ నౌకరీ మీదే.. టిజిపిఎస్సి జాబ్ నోటిఫికేషన్ ఫుల్ డిటెయిల్స్
Related image2
Government Jobs : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. నెలకు రూ.50,000 శాలరీతో గవర్నమెంట్ ఆఫీసర్ జాబ్స్ రిక్రూట్మెంట్
35
జోన్లవారిగా ఖాళీలు..
Image Credit : Getty

జోన్లవారిగా ఖాళీలు..

దేశవ్యాప్తంగా మొత్తం 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. వివిధ రైల్వే జోన్ల (Zones) వారీగా ఖాళీల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

సికింద్రాబాద్ : 05 పోస్టులు

బెంగళూరు : 08 పోస్టులు

చెన్నై : 09 పోస్టులు

అహ్మదాబాద్ : 11 పోస్టులు

అజ్మీర్ : 01 పోస్టు

భోపాల్ : 06 పోస్టులు

భువనేశ్వర్ : 06 పోస్టులు

బిలాస్‌పుర్ : 04 పోస్టులు

చండీగఢ్ : 06 పోస్టులు

గౌహతి: 01 పోస్టు

జమ్మూ & శ్రీనగర్ : 10 పోస్టులు

కోల్‌కతా : 08 పోస్టులు

మాల్డా : 07 పోస్టులు

ముంబై : 06 పోస్టులు

ముజఫర్‌పుర్ : 03 పోస్టులు

పాట్నా : 06 పోస్టులు

ప్రయాగ్‌రాజ్ : 04 పోస్టులు

రాంచీ : 14 పోస్టులు

సిలిగురి : 05 పోస్టులు

గోరఖ్‌పుర్ : 05 పోస్టులు

తిరువనంతపురం : 04 పోస్టులు

45
రైల్వే ఉద్యోగాలకు అర్హతలు...
Image Credit : iSTOCK

రైల్వే ఉద్యోగాలకు అర్హతలు...

విద్యార్హతలు :

అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా సబ్జెక్టులో డిగ్రీ (Graduate Degree) పాసై ఉండాలి.

వయోపరిమితి :

అభ్యర్థుల వయసు కనీసం 20 ఏళ్లు, గరిష్ఠంగా 33 ఏళ్ల లోపు ఉండాలి. జూలై 1, 2026 నాటి వయసును పరిగణలోకి తీసుకుంటారు.

ఓబిసి (నాన్ క్రిమిలేయర్ (NCL) - 3 ఏళ్లు సడలింపు ఉంటుంది.

ఎస్సి, ఎస్టి - 5 ఏళ్లు

మాజీ సైనికులు (కనీసం 6 నెలలు ఆర్మీలో పనిచేసివుండాలి) - రిజర్వేషన్ ను బట్టి 3 ఏళ్ల నుండి 8 ఏళ్లు

దివ్యాంగులు - రిజర్వేషన్ ను బట్టి 10 నుండి 15 ఏళ్లు సడలింపు ఇస్తారు.

వితంతువులు, విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్న మహిళలకు కూడా ప్రత్యేకంగా వయోపరిమితి సడలింపు కల్పించారు.

55
సెలెక్షన్ ప్రాసెస్, శాలరీ
Image Credit : Getty

సెలెక్షన్ ప్రాసెస్, శాలరీ

ఎంపిక విధానం

రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలను మొత్తం నాలుగు దశల్లో ఎంపిక చేస్తారు.  

సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)

కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT)

డాక్యుమెంట్ వెరిఫికేషన్ (Document Verification)

మెడికల్ ఎగ్జామినేషన్ (Medical Examination)

శాలరీ :

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35,400 ప్రారంభ జీతం ఉంటుంది… ఇతర రైల్వే ఉద్యోగుల మాదిరిగానే అలవెన్సులు వర్తిస్తాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి క్రమంగా శాలరీ ఇంక్రిమెంట్, ప్రమోషన్లు ఉంటాయి. 

ఈ రైల్వే సెక్షన్ కంట్రోల్ ఉద్యోగాలపై ఆసక్తి కలిగివుండి, అన్ని అర్హత ఉన్న అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Jobs : రాతపరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూతోనే బ్యాంక్ జాబ్.. ఒకటిరెండు కాదు 2049 పోస్టులు
Recommended image2
Jio IPO: అంబానీ మెగా ప్లాన్.. డబ్బులు రెడీ చేసుకోండి.. దసరాకో దీపావళికో బంపర్ ఆఫర్
Recommended image3
Layoffs: ప్ర‌శ్నార్థ‌కంగా ఐటీ ఉద్యోగుల భ‌విత‌వ్యం.. ల‌క్ష‌ల ఉద్యోగాలు మ‌టాష్
Related Stories
Recommended image1
Government Jobs : గట్టిగా ట్రై చేస్తే నెలకు రూ.1,27,050 జీతంతో ఓ సర్కార్ నౌకరీ మీదే.. టిజిపిఎస్సి జాబ్ నోటిఫికేషన్ ఫుల్ డిటెయిల్స్
Recommended image2
Government Jobs : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. నెలకు రూ.50,000 శాలరీతో గవర్నమెంట్ ఆఫీసర్ జాబ్స్ రిక్రూట్మెంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved