MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Jobs
  • Railway Jobs : డిగ్రీ పాసయితే చాలు రైల్వేలో జాబ్... వెంటనే అప్లై చేసుకొండి

Railway Jobs : డిగ్రీ పాసయితే చాలు రైల్వేలో జాబ్... వెంటనే అప్లై చేసుకొండి

Railway Jobs: సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్న డిగ్రీ విద్యార్థులకు ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ఆర్ఆర్బి నోటిఫికేషన్ ఇచ్చింది. అర్హతలు, జీతం, లాస్ట్ డేట్ లాంటి పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Oct 12 2026, 08:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రైల్వేలో 3,548 ఉద్యోగాల భర్తీ
Image Credit : Gemini AI

రైల్వేలో 3,548 ఉద్యోగాల భర్తీ

గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న యువతీయువకులకు సూపర్ ఛాన్స్… ఇండియన్ రైల్వేలో భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) తాజాగా CEN 06/2026 నోటిఫికేషన్ ద్వారా 3,548 ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యింది. ఇందులో గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులు అత్యధికంగా 2,750 ఉన్నాయి. అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ (371), జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (300), చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ (127) పోస్టులు ఉన్నాయి. డిగ్రీ పూర్తయిన వాళ్లు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. నోటిఫికేషన్ పూర్తిగా చదివి మీకు సెట్ అయ్యే పోస్టుకు అప్లై చేసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం
Image Credit : Getty

డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం

ఈ ఉద్యోగాలకు ఏడో వేతన సంఘం ప్రకారం బేసిక్ శాలరీ ఫిక్స్ చేశారు. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ పోస్టుకు నెలకు రూ.35,400 బేసిక్ పే ఇస్తారు. మిగతా మూడు పోస్టులకు రూ.29,200 బేసిక్ పే ఉంటుంది. దీనికి అదనంగా అలవెన్సులు కూడా కలుస్తాయి.

అర్హతలు

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన వాళ్లు ఈ పోస్టులకు అర్హులు. 2027 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ బట్టి వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. కేవలం డిగ్రీ ఉంటే సరిపోదు, రైల్వే నిర్దేశించిన మెడికల్ ఫిట్‌నెస్ కూడా తప్పనిసరిగా ఉండాలి.

 

35
అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
Image Credit : Getty

అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

ఈ పోస్టులకు ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ 2026 అక్టోబర్ 8న మొదలైంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 6వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఫీజు కట్టడానికి నవంబర్ 8 లాస్ట్ డేట్. అప్లికేషన్‌లో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి నవంబర్ 9 నుంచి 18 వరకు టైమ్ ఇచ్చారు.

లాస్ట్ మినిట్ రష్‌ను అవాయిడ్ చేయడానికి ముందే అప్లై చేసుకోవడం బెటర్. పేరు, పుట్టిన తేదీ, కులం లాంటి వివరాలు ఎంటర్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి. ఫేక్ న్యూస్ నమ్మకుండా www.rrbapply.gov.in లేదా www.rrb.indianrailways.gov.in అఫీషియల్ వెబ్‌సైట్లలో మాత్రమే అప్లై చేయండి.

45
ఎంపిక ప్రక్రియ
Image Credit : Pixabay

ఎంపిక ప్రక్రియ

సెలెక్షన్ ప్రాసెస్‌లో భాగంగా ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT 1, CBT 2) నిర్వహిస్తారు. ఆ తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టులు ఉంటాయి. ఈ మార్కుల ఆధారంగానే ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.

ఈసారి నోటిఫికేషన్‌లో ఒక ముఖ్యమైన మార్పు చేశారు. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్, సీనియర్ క్లర్క్ పోస్టులకు టైపింగ్ టెస్ట్ తీసేశారు. కానీ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ స్కిల్స్ కచ్చితంగా ఉండాలి. ఉద్యోగంలో చేరాక వీటిని టెస్ట్ చేస్తారు. కాబట్టి టైపింగ్ టెస్ట్ లేదు కదా అని కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం లేదని అనుకోవద్దు. సిలబస్, ఎగ్జామ్ ప్యాట్రన్ చూసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి.

55
రైల్వేలో భారీగా ఖాళీలు
Image Credit : Gemini

రైల్వేలో భారీగా ఖాళీలు

రైల్వేలో డిగ్రీ స్థాయి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ 3,548 పోస్టులు నిజంగా గోల్డెన్ ఛాన్స్. ముఖ్యంగా 2,750 గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులు ఉండటంతో కాంపిటీషన్ గట్టిగానే ఉంటుంది. రూ.29,200 నుంచి రూ.35,400 వరకు బేసిక్ పే ఉండటం ఈ నోటిఫికేషన్ హైలైట్.

అప్లై చేయడానికి 2026 నవంబర్ 6 లాస్ట్ డేట్ కాబట్టి, సర్వర్ డౌన్ ఇష్యూస్ రాకముందే ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. అప్లై చేసే ముందు వయోపరిమితి, ఫీజు, మెడికల్ స్టాండర్డ్స్ లాంటి రూల్స్ అన్నీ అఫీషియల్ నోటిఫికేషన్‌లో క్లియర్‌గా చదువుకోండి. ఏవైనా అప్‌డేట్స్ కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ అఫీషియల్ వెబ్‌సైట్లను మాత్రమే ఫాలో అవ్వండి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
హైద‌రాబాద్‌లో సంద‌డి చేసిన హ్యుమ‌నాయిడ్ రోబోట్‌.. ఘ‌నంగా ఏఐ ఎడ్యుకేష‌న్ స‌మ్మిట్
Recommended image2
Government Jobs : తెలుగు యువతా బి రెడీ .. భారీ జాబ్ నోటిఫికేషన్ రాబోతోంది
Recommended image3
Government Jobs : నెలకు రూ.86,570 జీతం.. కేవలం పదో తరగతి, ఐటిఐ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు
Related Stories
Recommended image1
Government Jobs : తెలుగు యువతా బి రెడీ .. భారీ జాబ్ నోటిఫికేషన్ రాబోతోంది
Recommended image2
Government Jobs : నెలకు రూ.86,570 జీతం.. కేవలం పదో తరగతి, ఐటిఐ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved