- Home
- Andhra Pradesh
- Jobs : నెలకు రూ.1,20,000 సాలరీతో విదేశాల్లో జాబ్.. కేవలం ఇంటర్వ్యూకు అటెండ్ అయితే చాలు.. ఫుల్ డిటెయిల్స్
Jobs : నెలకు రూ.1,20,000 సాలరీతో విదేశాల్లో జాబ్.. కేవలం ఇంటర్వ్యూకు అటెండ్ అయితే చాలు.. ఫుల్ డిటెయిల్స్
Andhra Pradesh Jobs : విదేశాల్లో ఉద్యోగం… లక్షల్లో జీతం… ఉచిత రవాణా, వసతి సదుపాయం… రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించేది ప్రభుత్వమే కాబట్టి జాబ్ సెక్యూరిటీ… తెలుగు యువతకు ఇంకేం కావాలి. వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొండి… ఫారెన్ ప్లైటెక్కే జాబ్ పొందండి.

కేవలం ఇంటర్వ్యూకు హాజరైతే చాలు.. విదేశాల్లో ఉద్యోగం
Jobs : మంచి ఉద్యోగం సాధించాలని చదువుకున్న ప్రతీ యువతీయువకులు కోరుకుంటారు… విదేశాల్లో జాబ్ చాలామంది కల. ఇలాంటి తెలుగు యువతకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అద్భుత అవకాశం ఇస్తోంది. కేవలం ఇంటర్వ్యూకు హాజరయితే చాలు... విదేశాల్లో లక్షల జీతంతో ఉద్యోగాన్ని పొందే అవకాశం కల్పిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం.. కూటమి ప్రభుత్వం పేర్కొన్న అర్హతలు కలిగివుంటే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొండి, ఇంటర్వ్యూకు హాజరుకండి... మీ ఫారెన్ జాబ్ కలను సాకారం చేసుకొండి.
తెలుగు యువతకు విదేశాల్లో ఉద్యోగాలు
ఆంధ్ర ప్రదేశ్ లోని నిరుద్యోగ మైనారిటీ యువతకు రాష్ట్ర మైనారిటీ శాఖ మంచి అవకాశం కల్పిస్తోంది. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని మైనారిటీ యువతీయువకులకు ఖతార్ లో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రత్యేక రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టింది. రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్, ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (OMCAP) కి ఈ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే నిరుద్యోగ మైనారిటీ యువత నుండి దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభించింది ప్రభుత్వం. ఖతార్ లో ఉద్యోగం చేయాలనే ఆసక్తి, తగిన అర్హతలు కలిగిన మైనారిటీ యువతీయువకులు ఏపి ప్రభుత్వం నిర్వహిస్తున్న నైపుణ్యం వెబ్ సైట్ http://naipunyam.ap.gov.in/ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
విదేశాల్లో ఉద్యోగాలకు అర్హతలు
ఆంధ్ర ప్రదేశ్ మైనారిటీ యువతకు ఖతార్ లో హోమ్ కేర్ నర్స్ ఉద్యోగాలను కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమయ్యింది. కాబట్టి బిఎస్సి లేదా జి.ఎన్.ఎమ్ నర్సింగ్ పూర్తిచేసిన మైనారిటీ యువత ఈ ఉద్యోగాలకు అర్హులు. ఇప్పటికే ఉద్యోగాలు చేసిన అనుభవం ఉండాలి. ఇలాంటి యువతీయువకులకు ఆసక్తి ఉంటే ఇంటర్వ్యూకు హాజరుకావచ్చని మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూఖ్ సూచించారు.
ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు ఖతార్ లోని దోహా ప్రాంతంలో ఉద్యోగాలను కల్పిస్తారు. ప్రభుత్వమై ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపడుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగాలు పొందినవారికి ప్రభుత్వం అన్నిరకాలుగా సహాయసహకారాలు అందిస్తుందని… హాయిగా ఖతార్ లో ఉద్యోగం చేసుకోవచ్చని మైనారిటీ శాఖ మంత్రి భరోసా ఇస్తున్నారు.
విదేశీ ఉద్యోగాలకు వయోపరిమితి
ఖతార్ లో హోమ్ కేర్ నర్స్ (రిజిస్టర్డ్ నర్స్) ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ చేసుకునే అభ్యర్థుల వయసు 21 ఏళ్లకంటే ఎక్కువ ఉండాలి. అలాగే 40 ఏళ్లలోపు వయసువారు అర్హులు. ఈ వయసు కలిగిన మైనారిటీ యువత మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి... వారికే హోమ్ కేర్ నర్స్ అవకాశం కల్పిస్తారు.
రిజిస్ట్రేషన్, ఇంటర్వ్యూ ప్రక్రియ
ఖతార్ లో హోమ్ కేర్ నర్స్ ఉద్యోగాలపై ఆసక్తిచూపే యువతీయువకులకు అక్టోబర్ 12 వరకు రిజిస్ట్రేషన్ అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. నైపుణ్య పోర్టల్ లో రిజిస్ట్రేషన్ పూర్తిచేసినవారు అక్టోబర్ 13న జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. విజయవాడ రమేష్ ఆసుపత్రి రోడ్డులో గల గవర్నమెంట్ ఐ.టి.ఐ. క్యాపస్, ఓఎంసిఏపి కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
అయితే వివిధ కారణాలతో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయిన యువత నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఇలాంటివారు ముందుగానే అంటే అక్టోబర్ 13న ఉదయం 10 గంటలవరకు ఓఎంసిఏపి కార్యాలయానికి చేరుకుని నేరుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
కూటమి ప్రభుత్వ నేతృత్వంలో మైనారిటీ వర్గాల అభివృద్ది కోసం అందిస్తున్న ఈ అవకాశాన్ని యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఫరూఖ్ సూచించారు. బి.ఎస్సీ, జి.ఎన్. ఎమ్ నర్సింగ్ అర్హత కలిగిన మైనారిటీ యువత వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంత్రి సూచించారు.
పూర్తి వివరాల కోసం ఈ నెంబర్లను సంప్రదించండి
ఖతార్ లో హోమ్ కేర్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం 9988853335, 8712655686, 8790118349, 8790117279 ఫోన్ చేయవచ్చు. ఈ ఫోన్ నెంబర్లను సంప్రదించడం ద్వారా మైనారిటీ యువతీయువకులు ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చని ఆంధ్ర ప్రదేశ్ మైనారిటీ శాఖమంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.