- Home
- Telangana
- TGSRTC Jobs : మీరు పదో తరగతి పాసైతే చాలు, రూ.60,000 సాలరీతో గవర్నమెంట్ జాబ్, వెంటనే అప్లై చేసుకొండి
TGSRTC Jobs : మీరు పదో తరగతి పాసైతే చాలు, రూ.60,000 సాలరీతో గవర్నమెంట్ జాబ్, వెంటనే అప్లై చేసుకొండి
TGSRTC Jobs : తెలంగాణ యువత తక్కువ విద్యార్హతలతో మంచి సాలరీ కలిగిన ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందవచ్చు. బుధవారమే (అక్టోబర్ 8న) దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యింది… కాబట్టి వెంటనే అప్లై చేసుకొండి. ఇక్కడ ఫుల్ డిటెయిల్స్ అందిస్తున్నాం…

తెలంగాణ యువతకు సూపర్ ఛాన్స్
TGSRTC Jobs : తెలుగు యువతకు గుడ్ న్యూస్. పెద్దగా విద్యార్హతలు లేకపోయినా ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాన్ని పొందే అద్భుత అవకాశం వచ్చింది. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో ఏకంగా 1,743 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా ఆర్టిసిలో డ్రైవర్, శ్రామిక్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
తెలంగాణ ఆర్టిసి ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్
గత సెప్టెంబర్ లోనే TSLPRB (Telangana State Level Police Recruitment Board) ఆర్టిసి డ్రైవర్, శ్రామిక్ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలతో నోటిఫికేషన్ జారీచేసింది. కానీ దరఖాస్తు ప్రక్రియమాత్రం నేటినుండి (అక్టోబర్ 08, బుధవారం) ప్రారంభం అయ్యింది. ఆర్టిసిలో ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉండి అన్ని అర్హతలు కలిగినవారు అధికారిక వెబ్ సైట్ www.tgprb.in ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగాలవారిగా ఖాళీలు
1. ఆర్టిసి బస్ డ్రైవర్లు ఉద్యోగాలు - 1000 ఖాళీలు
2. తెలంగాణ ఆర్టిసి శ్రామిక్స్ - 743 ఉద్యోగాలు
మొత్తంగా తెలంగాణ ఆర్టిసిలో 1,743 ఖాళీల భర్తీ
దరఖాస్తు ప్రక్రియ
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : అక్టోబర్ 8, 2025 (ఉదయం 8AM నుండి)
దరఖాస్తు స్వీకరణకు చివరితేదీ : అక్టోబర్ 28, 2025 (సాయంత్రం 5PM వరకు)
దరఖాస్తు ఫీజు :
స్థానిక ఎస్సి, ఎస్టి అభ్యర్థులు :
డ్రైవర్ పోస్టుకు దరఖాస్తు ఫీజు రూ.300
శ్రామిక్ పోస్టుకు దరఖాస్తు ఫీజు రూ.200
ఇతరులకు :
డ్రైవర్ పోస్టుకు దరఖాస్తు ఫీజు రూ.600
శ్రామిక్ పోస్టుకు దరఖాస్తు ఫీజు రూ.400
ఈ దరఖాస్తు ఫీజు కేవలం ఆన్లైన లోనే చెల్లించాల్సి ఉంటుంది.
డ్రైవర్ పోస్టులకు విద్యా, ఇతర అర్హతలు
కేవలం పురుషులే కాదు మహిళలు కూడా ఈ ఆర్టిసి డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు అర్హులు. డ్రైవర్ ఉద్యోగాల కోసం దరఖాస్తుచేసుకునేవారు తప్పకుండా ప్రభుత్వ గుర్తింపుపొందిన విద్యాసంస్థ నుండి పదో తరగతి (SSC) లేదా అందుకు సమానమైన విద్యార్హతలు కలిగివుండాలి (జూలై 1, 2025 లోపు ఈ అర్హతలుండాలి).
తప్పకుండా హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికిల్ (HPMV) డైవింగ్ లైసెన్స్ కలిగివుండాలి. హెవీ గూడ్స్ వెహికిల్ (HGV) లేదా ట్రాన్స్ పోర్ట్ వెహికిల్ కంటిన్యూగా 18 నెలలకంటే ఎక్కువకాలం నడిపిన అనుభవం ఉండాలి.
వయో పరిమితి :
22 నుండి 35 ఏళ్లలోపు వయసుగలవారు అర్హులు (జూలై 1, 2025 వరకు వయసును పరిగణలోకి తీసుకుంటారు).
ఎస్సి, ఎస్టి, బిసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది.
ఎక్స్ సర్వీస్ మెన్స్ (ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో పనిచేసినవారి) కి సర్వీస్ ఆధారంగా 3 ఏళ్ల సడలింపు ఉంటుంది.
ఆర్టిసి శ్రామిక్స్ ఉద్యోగాలకు విద్యా, ఇతర అర్హతలు
తప్పకుండా ప్రభుత్వ గుర్తింపు కలిగిన విద్యాసంస్థనుండి ఐటిఐ మెకానిక్ (డీజిల్, మోటార్ వెహికిల్) లేదా షీట్ మెటల్/ఎంవిబిబి లేదా ఫిట్టర్ లేదా ఎలక్ట్రీషియన్ లేదా పెయింటర్ లేదా వెల్డర్ లేదా కటింగ్ ఆండ్ సీవింగ్/అప్ హోల్స్టర్ లేదా మిల్ల్ రైటర్ మెకానిక్ వంటి ట్రేడ్స్ కలిగినవారు అర్హులు.
వయోపరిమితి :
18 నుండి 30 ఏళ్లలోపువారు అర్హులు. (జూలై 1, 2025 వరకు)
ఎస్సి, ఎస్టి, బిసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు
ఎక్స్ సర్వీస్ మెన్స్ - 3 ఏళ్ల సడలింపు ఉంటుంది.
సాలరీ
ఆర్టిసి డ్రైవర్ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు రూ.20,960 నుండి రూ. 60,080 వరకు సాలరీ లభిస్తుంది.
ఆర్టిసి శ్రామిక్ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థులకు రూ.16,550 నుండి రూ.45,030 వరకు సాలరీ లభిస్తుంది.