- Home
- Jobs
- గవర్నమెంట్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ .. మీకు ఈ అర్హతలుంటే అప్లై చేసుకొండి, ఉద్యోగం పక్కా..!
గవర్నమెంట్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ .. మీకు ఈ అర్హతలుంటే అప్లై చేసుకొండి, ఉద్యోగం పక్కా..!
NABARD Jobs : మంచి సాలరీతో ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగావకాశం… మీకు ఈ అర్హతలుంటే వెంటనే అప్లై చేసుకొండి. కొద్దిగా కష్టపడితే చాలు ఓ ఉద్యోగాన్ని ఈజీగా పొందవచ్చు.

తెలుగు యువతకు లక్కీ ఛాన్స్
Government Bank Jobs : నిరుద్యోగ యువతకు అద్భుత అవకాశం. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD)లో అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ A) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 91 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకొండి... అన్ని అర్హతలుంటే వెంటనే దరఖాస్తు చేసుకొండి.
పోస్టులవారిగా ఖాళీలు... రిజర్వేషన్లు
- అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ A (రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్ (RDBS) : మొత్తం 91 పోస్టులు
- జనరల్ : మొత్తం 48 ఖాళీలు (అన్ రిజర్వుడ్ 20, ఎస్సి 7, ఎస్టి 4, ఓబిసి 13, ఈడబ్ల్యుఎస్ 4)
- చార్టర్డ్ అకౌంటెంట్ (CA) : మొత్తం 4 (అన్ రిజర్వుడ్ 2, ఎస్సి 1, ఓబిసి 1)
- కంపనీ సెక్రటరీ (CS) : మొత్తం 2 (అన్ రిజర్వుడ్ 1, ఓబిసి 1)
- ఫైనాన్స్ : మొత్తం 5 (అన్ రిజర్వుడ్ 2, ఎస్సి 1, ఎస్టి 1, ఓబిసి 1)
- కంప్యూటర్ ఆండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ : మొత్తం 10 ఖాళీలు (అన్ రిజర్వుడ్ 4, ఎస్సి 2, ఎస్టి 1, ఓబిసి 2, ఈడబ్ల్యుఎస్ 1)
- అగ్రికల్చర్ ఇంజనీర్ : మొత్తం 1 పోస్టులు (అన్ రిజర్వుడ్)
- ప్లాంటేషన్ ఆండ్ హార్టికల్చర్ : మొత్తం 2 పొస్టులు (అన్ రిజర్వుడ్ 1, ఓబిసి 1)
- ఫిషరీస్ : మొత్తం 2 పోస్టులు ( అన్ రిజర్వుడ్ 1, ఎస్టి 1)
- ఫుడ్ ప్రాసెసింగ్ : మొత్తం 2 పోస్టులు ( ఎస్సి 1, ఈడబ్ల్యుఎస్ 1)
- ల్యాండ్ డెవలప్మెంట్ ఇండ్ సాయిల్ సైన్స్ : మొత్తం 2 పోస్టులు (అన్ రిజర్వుడ్ 1, ఓబిసి 1)
- సివిల్ ఇంజనీరింగ్ : మొత్తం 2 పోస్టులు ( ఎస్సి 1, ఎస్టి 1)
- ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ : మొత్తం 2 పోస్టులు (అన్ రిజర్వుడ్ 1, ఈడబ్ల్యుఎస్ 1)
- మీడియా స్పెషలిస్ట్ : మొత్తం 1 (అన్ రిజర్వుడ్)
- ఎకనమిక్స్ : మొత్తం 2 పోస్టులు ( ఎస్సి 1, ఈడబ్ల్యుఎస్ 1)
2. అసిస్టెంట్ మేనేజర్ (లీగల్) :
మొత్తం 2 ఖాళీలు (అన్ని అన్ రిజర్వుడ్)
3. అసిస్టెంట్ మేనేజర్ (ప్రోటోకాల్ ఆండ్ సెక్యూరిటీ) :
మొత్తం 4 పోస్టులు ( అన్ రిజర్వుడ్ 3, ఎస్టి 1)
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 08 నవంబర్ 2025
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : 30 నవంబర్ 2025
ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహణ తేదీ : 20 డిసెంబర్ 2025
మెయిన్ ఎగ్జామ్ నిర్వహణ తేదీ : 25 జనవరి 2026
అధికారిక వెబ్‌సైట్ www.nabard.org ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.800 దరఖాస్తు ఫీజు, మరో రూ.150 ఇంటిమేషన్ ఛార్జెస్... మొత్తంగా రూ.850 చెల్లించాలి.
ఎస్సి, ఎస్టి, దివ్యాంగులు కేవలం ఇంటిమేషన్ ఫీజు రూ.150 చెల్లిస్తే సరిపోతుంది.
విద్యా అర్హత
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జనరల్ కేటగిరీ పోస్టులకు కనీసం 60% మార్కులు అవసరం. పీజీ డిగ్రీ (MBA, PGDM వంటివి) ఉన్నవారు 55% మార్కులతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్, ఎకనామిక్స్ వంటి వివిధ విభాగాలకు సంబంధించిన విద్యా అర్హతలు వేరువేరుగా పేర్కొన్నారు.
వయోపరిమితి
దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థి వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి... నవంబర్ 1, 2025 వరకు వయసును పరిగణలోకి తీసుకుంటారు. అంటే అభ్యర్థెలు 02-11-1995 కు ముందు... 01-11-2004 తర్వాత పుట్టి ఉండకూడదు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీల వారికి వయసులో సడలింపు ఉంటుంది. ఎస్సి, ఎస్టిలకు 5, ఓబిసిలకు 3, వికలాంగులకు గరిష్టంగా 15 ఏళ్ల సడలింపు ఉంటుంది.
అసిస్టెంట్ మేనేజర్ (ప్రోటోకాల్ ఆండ్ సెక్యూరిటీ) ఉద్యోగాలకు 25 నుండి 40 ఏళ్లలోపు వయసు గలవారు కూడా అర్హులే.
ఎంపిక ప్రక్రియ
మూడు దశల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది
స్టేజ్ 1 ప్రిలిమ్స్ - 200 మార్కులు - 120 నిమిషాల సమయం
స్టేజ్ 2 మెయిన్స్ - 200 మార్కులు - 210 నిమిషాల సమయం
స్టేజ్ 3 ఇంటర్వ్యూ - 50 మార్కులు
సాలరీ
ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.44,500 నుంచి రూ.89,150 వరకు జీతం పొందుతారు. దీనితో పాటు, అలవెన్సులు, ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి.
అద్భుత అవకాశం
ఈ ఉద్యోగ అవకాశం ముఖ్యంగా బ్యాంకింగ్, అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో పనిచేయాలనుకునే గ్రాడ్యుయేట్లకు ఒక సువర్ణావకాశం. మంచి విద్యా అర్హతలు, పట్టుదల ఉన్నవారు ఈ అవకాశాన్ని వదలకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. ఈ పదవి స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఆర్థిక, సాంకేతిక అభివృద్ధికి దోహదపడుతుంది. కాబట్టి ఇది నమ్మకమైన, భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఉద్యోగం అని చెప్పొచ్చు.