- Home
- Telangana
- Telangana Jobs : ప్రభుత్వ స్కూల్స్ లో 4900 టీచర్ పోస్టులు.. బిఈడి, టిటిసి కాదు ఇంటర్ అర్హతతోనేనా?
Telangana Jobs : ప్రభుత్వ స్కూల్స్ లో 4900 టీచర్ పోస్టులు.. బిఈడి, టిటిసి కాదు ఇంటర్ అర్హతతోనేనా?
Government Teacher Jobs : తెలంగాణ విద్యాశాఖ తీసుకున్న ఓ నిర్ణయం వేలాది ఉద్యోగాలను సృష్టించేలా ఉంది. ఈ నిర్ణయమేంటి… దాని వల్ల వచ్చే ఉద్యాగాలెన్ని? ఇక్కడ తెలుసుకుందాం.

నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్..
Telangana Jobs : ప్రైవేట్ విద్యాసంస్థలకు పోటీగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే విద్యావ్యవస్థలో అనేక మార్కులకు శ్రీకారం చుట్టింది... ఇవి పలితాలను కూడా ఇస్తున్నాయని విద్యాశాఖ చెబుతోంది. ఇలా ప్రయోగాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరి విద్యను ప్రారంభించారు.. ఇది సక్సెస్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్దమవుతోంది రేవంత్ సర్కార్. దీంతో చిన్నారులకు చదువే కాదు యువతకు భారీగా ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి.
గవర్నమెంట్ స్కూల్స్ లో UKG తరగతుల పెంపు
వచ్చే విద్యాసంవత్పరం (2026-27) నుండి ప్రీప్రైమరీ తరగతులను మరింత విస్తరించాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే వెయ్యి స్కూళ్లలో UKG (Upper Kindergarten) ను ప్రారంభించారు... నాలుగేళ్లు నిండిన చిన్నారులకు ఇందులో ప్రవేశం కల్పిస్తున్నారు. ఈ ప్రీప్రైమరి తరగతులను మరిన్ని పాఠశాలల్లో ప్రారంభించేందుకు విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది.
2026-27 ఎడ్యుకేషన్ ఇయర్ లో రాష్ట్రంలోని 4900 పాఠశాలల్లో యూకేజి తరగతులు ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఏ అడ్డంకులు లేకుండా అన్ని సక్రమంగా జరిగితే వచ్చేేఏడాది ఈ ప్రీప్రైమరి తరగతులు ప్రారంభం అవుతాయి. ఈ నిర్ణయం నిరుపేద చిన్నారుల కుటుంబాల్లో విద్యా అవకాశాలనే కాదు నిరుద్యోగ యువతలో జాబ్ ఆశలను చిగురింపజేస్తోంది.
భారీగా టీచర్ పోస్టుల భర్తీ
ఇప్పటికే యూకేజీ తరగతులు కొనసాగుతున్న పాఠశాలల్లో ప్రత్యేకంగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. UKG తరగతి నిర్వహణ కో'సం ఓ టీచర్ తో పాటు ఆయాను పనిచేస్తున్నారు. అంటే వచ్చే విద్యాసంవత్సరంలో 4,900 గవర్నమెంట్ స్కూల్స్ లో UKG తరగతులు ప్రారంభిస్తే 9,800 మంది సిబ్బంది అవసరం అవుతారు. మరి వీరిని శాశ్వర పద్దతిలో భర్తీచేస్తారా లేక తాత్కాలిక పద్దతిలో నియమిస్తారా..? అన్నది విద్యాశాఖ నిర్ణయిస్తుంది. ఏలాగైనా విద్యాశాఖలో నియామకాలు జరగడం పక్కాగా కనిపిస్తోంది.
టీచర్, ఆయా ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలివేనా?
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న UKG తరగతుల టీచర్లను తాత్కాలిక పద్దతిలో నియమించారు. 18 నుండి 40 ఏళ్లలోపు వయసు కలిగివుండి... ఇంటర్మీడియట్ పూర్తిచేసినవారిని ఎంపిక చేశారు. స్థానికంగా నివాసం ఉండేవారికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక ఆయా పోస్టులకు కనీసం ఏడో తరగతి చదివిన మహిళలను ఎంపిక చేశారు.
అయితే వచ్చే విద్యాసంవత్సరంలో ప్రారంభించే UKG తరగతుల టీచర్లు, ఆయాలను కూడా ఇవే అర్హతలతో నియమిస్తారా లేదంటే మారుస్తారా? అన్నదానికి క్లారిటీ లేదు. శాశ్వత పద్దతిలో పోటీ పరీక్ష నిర్వహించి నియామకాలు చేపడితే విద్యార్హతల్లో మార్పులు ఉంటాయి.. తాత్కాలిక పద్దతిలో అయితే ఇవే అర్హతలను కొనసాగించే అవకాశాలున్నాయి.
తెలంగాణలో డిఎస్సి ఎప్పుడు?
గతేడాది తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేసింది ప్రభుత్వం. స్కూల్ అసిస్టెంట్ 2629, బాషా పండితులు 727, ఎస్జిటి 6508, పిఈటి 182 పోస్టులను భర్తీచేశారు. అలాగే స్పెషల్ కేటగిరీ కింద 220 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జిటి పోస్టులను భర్తీ చేశారు. ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముగింసింది... స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. దీంతో ప్రస్తుతం మరో డిఎస్సి కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు... ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.