- Home
- Jobs
- నెలకు రూ.21,700 - 1,51,100 జీతంతో 11,324 ఉద్యోగాల భర్తీ.. తెలుగు యువతకు సూపర్ ఛాన్స్, వెంటనే అప్లై చేయండి
నెలకు రూ.21,700 - 1,51,100 జీతంతో 11,324 ఉద్యోగాల భర్తీ.. తెలుగు యువతకు సూపర్ ఛాన్స్, వెంటనే అప్లై చేయండి
భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఆగస్ట్ 2025 తో కొన్ని ఉద్యోగాలకు దరఖాస్తు అవకాశం ముగుస్తుంది. ఆ ఉద్యోగాలేంటో నిరుద్యోగ యువత ఇక్కడ తెలుసుకోవచ్చు… వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ నెలలో దరఖాస్తు చేసుకోవాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలు
Government Jobs : ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్దమయ్యే నిరుద్యోగ యువతకు అద్భుత అవకాశం. ఇప్పటికే పలు ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి... ఈ నెలలో (ఆగస్ట్ 2025) కొన్ని ఉద్యోగాల దరఖాస్తుకు చివరితేదీ. ఇలా ఈ పదిరోజుల్లో (ఆగస్ట్ 21 నుండి 31 వరకు) ఏఏ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ముగుస్తుందో ఇక్కడ తెలుసుకుందాం. ఈ సమాచారం నిరుద్యోగులను అలర్ట్ చేసేందుకు, సమయం ముగిసేలోపు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా అందిస్తున్నాం.
KNOW
1. EPFO లో 230 పోస్టులు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC) ఎంప్లాయింట్ మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. జులై 29, 2025 మొత్తం 230 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది... ఇందులో 156 ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, అకౌంట్ ఆఫీసర్ పోస్టులుండగా మరో 74 అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమీషనర్ పోస్టులున్నాయి. వీటికోసం అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు చివరితేదీ ఆగస్ట్ 22, 2025. దరఖాస్తు తర్వాత కరెక్షన్స్ కు ఆగస్ట్ 23 నుండి 25 వరకు సమయం ఇచ్చారు.
విద్యార్హతలు : గ్రాడ్యుయేషన్ డిగ్రీ
వయోపరిమితి : 35 ఏళ్లలోపు వయసు
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
సాలరీ : రూ.47,600 నుండి రూ.1,51,100 వరకు
2. BSF (బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్) ఉద్యోగాలు
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) లో 3,588 కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాల భర్తీకి నోటీఫికేషన్ వెలువడింది. 26 జులై 2025 లో నోటిఫికేషన్ వెలువడి అప్లికేషన్స్ స్వీకరణ ప్రారంభించారు.
దరఖాస్తుకు చివరితేదీ : ఆగస్ట్ 23, 2025
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబిసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100.
ఎస్సి, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు
వయోపరిమితి : 18 నుండి 25 ఏళ్లలోపు వయసుండాలి
విద్యార్హతలు : 10వ తరగతి లేదా ఇందుకు సమానమమైన విద్యార్హత
సాలరీ : రూ.21,700 నుండి రూ.69,100 వరకు
3. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో ఉద్యోగాలు
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బిఐలో 6,589 క్లరికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తుల స్వీకరణ ఆగస్ట్ 6, 2025 నుండి ప్రారంభమయ్యింది.
దరఖాస్తుకు చివరితేదీ : ఆగస్ట్ 26, 2025
పోస్టుల వివరాలు : జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్, సేల్స్)
ఎంపిక విధానం : ప్రిలిమ్స్, మెయిన్స్, లాంగ్వేజ్ ప్రొఫెషన్సీ టెస్ట్
విద్యార్హతలు : గ్రాడ్యుయేషన్ డిగ్రీ
వయోపరిమితి : 21 నుండి 28 ఏళ్లలోపు వయసుండాలి
సాలరీ : రూ.46,000
ఏపీలో 310, తెలంగాణలో 250 పోస్టులు ఉన్నాయి.
4. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాల భర్తీ
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 417 సేల్స్ మేనేజర్, అగ్రికల్చర్ సేల్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.
దరఖాస్తుకు చివరితేదీ : ఆగస్ట్ 26, 2025
వయోపరిమితి : సేల్స్ మేనేజర్ 24 నుండి 36 ఏళ్ళలోపు వయసు
అగ్రికల్చర్ సెల్స్ మేనేజర్ 26 నుడి 42 ఏళ్లలోపు వయసుండాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబిసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850
ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు రూ.175
విద్యార్హతలు : గ్రాడ్యుయేషన్ డిగ్రీ
సాలరీ : రూ.48,480 నుండి రూ.64,820 లోపు
5. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాల భర్తీ
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 500 జనరల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.
దరఖాస్తుకు చివరితేదీ : ఆగస్ట్ 30, 2025
విద్యార్హతలు : జనరల్ డిగ్రీ (జనరల్ అభ్యర్థులు 60శాతం మార్కులతో, ఎస్సి, ఎస్టీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో పూర్తిచేసివుండాలి)
వయోపరిమితి : 22 నుండి 35 ఏళ్లలోపు వయసు
సాలరీ : రూ.64,820 నుండి రూ.93,960 వరకు
దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్థులు రూ.1,180
ఎస్సి, ఎస్టీలకు రూ.118

