- Home
- International
- భారత్‌కు అత్యంత మిత్రుడైన జపాన్ మాజీ పీఎం షింజో అబే గురించిన ప్రత్యేక విషయాలు ఇవే..
భారత్‌కు అత్యంత మిత్రుడైన జపాన్ మాజీ పీఎం షింజో అబే గురించిన ప్రత్యేక విషయాలు ఇవే..
Shinzo Abe: జపాన్‌కు అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగడంతో పాటు అనేక విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన నాయకుడిగా షింజో అబే పేరుగాంచారు. భారత్ కు అత్యంత మిత్రుడైన నాయకునిగా ఆయనకు పేరుంది.

Japanese PM Shinzo Abe: జపాన్‌లో అత్యంత ప్రభావవంతమైన ప్రధానమంత్రి (జపాన్ మాజీ ప్రధాని) 67 ఏళ్ల షింజో అబే.. ఒక బహిరంగ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా, ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘటన జపాన్ కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో నారా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆదివారం జరగనున్న ఎగువ సభ ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా ఆ దేశ మాజీ నేవీ అధికారి వెనుక నుంచి ఈ కాల్పులు జరిపాడు.
షింజో అబేపై కాల్పులు జరిపిన వ్యక్తిని జపాన్ నేవీలో మాజీ అధికారి టెత్సుయా యమగామిగా గుర్తించారు. మాజీ ప్రధానిపై రెండు రౌండ్లలో దాడి చేశాడు. బుల్లెట్లు ఛాతీ ఎడమ వైపుకు తగిలి తీవ్ర రక్త స్రావమైంది. అనంతరం అబేకు గుండెపోటు వచ్చి అక్కడికక్కడే కుప్పకూలినట్లు జపాన్ మీడియా పేర్కొంది. కదలలేని స్థితిలో ఉన్న అతడిని మెడికల్ హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు.
జపాన్‌కు ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రిగా షింజో అబే రికార్డులకెక్కారు. అతను ప్రతిష్టాత్మక ఆర్థిక సంస్కరణలను అనుసరిస్తూ.. అంతర్జాతీయ దౌత్య సంబంధాలను ఏర్పర్చిన వ్యక్తిగా పేరొందారు.
జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబే దక్షిణ జపాన్‌లోని నాగాటోలో జన్మించారు. అతను 1977 లో రాజధాని టోక్యో సమీపంలోని సీకేయ్ విశ్వవిద్యాలయంలో విద్యాను కొనసాగించారు. పాలిటిక్స్ లో తన చదువును పూర్తి చేసి.. ఉన్నత చదువుల కోసం USA వెళ్లి దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చేరాడు. తన ఉన్నత విద్యను పూర్తి చేసిన తర్వాత, షింజో అబే 1979లో ఒక స్మెల్టర్‌లో పనిచేశాడు.
షింజో అబే 1982లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 1993లో తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసిన షింజో అబే లిబరల్ డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు. తరువాత, అతను 2005 ఎన్నికలలో పోటీ చేసాడు. అప్పటి ప్రధాన మంత్రిచే చీఫ్ క్యాబినెట్ సెక్రటరీగా నియమితులయ్యారు.
2006లో జరిగిన ప్రధాని ఎన్నికల్లో గెలిచిన షింజో అబే జపాన్ 90వ ప్రధానిగా, తొలి యువ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2020 వరకు రెండోసారి ప్రధానిగా కొనసాగిన షింజో అబే.. సుదీర్ఘకాలం జపాన్ ప్రధానిగా పనిచేసిన ఏకైక వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
షింజో అబే తన ఆరోగ్యం క్షీణించడంతో 2020లో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏడాది తర్వాత షింజో అబే తన అనారోగ్యం దేశ ప్రయోజనాలకు హాని కలిగించకూడదని పేర్కొంటూ ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
శుక్రవారం నారాలో జరిగిన ఓ పబ్లిక్ ఈవెంట్‌కు షింజో అబే హాజరయ్యారు. వేదికపై మాట్లాడుతున్న ఆయనపై దుండగుడు కాల్పులు జరిపాడు. బుల్లెట్ దూసుకెళ్లడంతో షింజో అబే రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జన్మించిన మొదటి జపాన్ ప్రధాని షింజో అబే. అతను సెప్టెంబర్ 21, 1954న టోక్యోలో జన్మించాడు. షింజో అబే అకీ అబేను వివాహం చేసుకున్నాడు. అయితే, వారికి ఇంకా పిల్లలు లేరు.
షింజో అబే భారతదేశానికి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సన్నిహిత మిత్రుడుగా గుర్తింపు పొందారు. మోడీ ప్రధానిగా ఉన్న సమయంలో షింజో అబే నేతృత్వంలోని ప్రభుత్వం భారత్‌లో అనేక పెట్టుబడులు పెట్టింది. దేశంలోని వివిధ నగరాల్లో ముంబై, అహ్మదాబాద్ బుల్లెట్ రైలు, మెట్రో రైళ్ల నిర్మాణంలో జపాన్ భాగస్వామ్యం కావడానికి అబే, మోడీల ఒప్పందమే కారణం.
2018లో, నరేంద్ర మోడీ-షింజో అబే భారతదేశ పర్యటన సందర్భంగా గంగానది ఒడ్డున గంగా హారతిలో పాల్గొన్న ఫోటో వైరల్ అయింది. ఈ సమయంలో భారతదేశంలో అబే రోడ్ షో కూడా జరిగింది.