MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • International
  • Viral News: పాపం పాకిస్థాన్‌.. హోట‌ల్ బిల్లు కూడా క‌ట్ట‌లేని దుస్థితిలో ఉందా. నెట్టింట ట్రోలింగ్

Viral News: పాపం పాకిస్థాన్‌.. హోట‌ల్ బిల్లు కూడా క‌ట్ట‌లేని దుస్థితిలో ఉందా. నెట్టింట ట్రోలింగ్

Viral News: అమెరికా–ఇరాన్ మధ్య కీలక చర్చలు ఇస్లామాబాద్ లో జరిగిన విష‌యం తెలిసిందే. ఈ సమావేశాలు అత్యంత భ‌ద్ర‌త క‌లిగిన సెరెనా హోట‌ల్ ఇస్లామాబాద్‌లో జ‌రిగాయి. ఈ చ‌ర్చ‌ల నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. 

2 Min read
Author : Narender Vaitla
Published : Apr 14 2026, 05:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సెరెనా హోటల్ ఎంపిక… భారీ ఖ‌ర్చు
Image Credit : Asianet News

సెరెనా హోటల్ ఎంపిక… భారీ ఖ‌ర్చు

ఈ చర్చల కోసం సెరెనా హోటల్‌ను ఎంపిక చేయడం వెనుక భద్రత ప్రధాన కారణం. ప్రధాని కార్యాలయం, పార్లమెంట్ సమీపంలో ఉండటం వల్ల ఇది సురక్షితంగా భావించారు. 15 ఎకరాల విస్తీర్ణం, 400కి పైగా గదులు, పెద్ద కాన్ఫరెన్స్ హాల్స్‌తో ఇది భారీ డెలిగేషన్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ లెవెల్ సదుపాయాలు ఉంటే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అందుకే సోషల్ మీడియాలో “ఇంత పెద్ద మీటింగ్… బిల్లు ఎంత వస్తుందో?” అన్న చర్చ మొదలైంది. కాగా ఈ సమావేశానికి అమెరికా నుంచి జేడీ వాన్స్‌ నేతృత్వంలో డెలిగేషన్, ఇరాన్ అధికారులు పాల్గొన్నారు. చర్చల ముందు నగరాన్ని పూర్తిగా సెక్యూరిటీ కవర్ చేశారు. రెండు రోజుల పాటు షాపులు, ఆఫీసులు మూసివేయగా, వేలాది సైనికులు రెడ్ జోన్ ప్రాంతంలో మోహరించారు. మొత్తం చూసుకుంటే… ఇది చర్చల వాతావరణం కంటే ఎమర్జెన్సీ పరిస్థితిలా కనిపించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ప‌రేష్ రావెల్ సెటైర్ కామెంట్
Image Credit : Twitter

ప‌రేష్ రావెల్ సెటైర్ కామెంట్

హోటల్ బిల్లుల గురించి ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు రవాల్ ఇచ్చిన సమాధానం వైరల్ అయింది. “బిల్లు ఎవరు చెల్లిస్తారు?” అన్న ప్రశ్నకు ఆయన ఇంట‌ర్నేష‌నల్ మానిట‌రీ ఫండ్ (International Monetary Fund) అని చెప్పడం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ఇది కేవలం జోక్ మాత్రమే కాదు, పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితిపై ఒక గట్టిగా వేసిన సెటైర్. ఎందుకంటే పాకిస్థాన్‌ చాలా కాలంగా IMF రుణాలపై ఆధారపడుతోంది.

IMF . https://t.co/7lawC16oGa

— Paresh Rawal (@SirPareshRawal) April 12, 2026

Related Articles

Related image1
OTT: జీవితానికి రీసెట్ బటన్ ఉండదు.. ఈ తరం వారి కళ్లు తెరిపించే సినిమా. ఓటీటీలో స్ట్రీమింగ్
Related image2
దీని ముందు ఐఫోన్ కూడా బ‌లాదూర్.. మైండ్ బ్లాంక్ అయ్యే ఫీచ‌ర్లు. ధ‌ర కూడా చాలా త‌క్కువ
34
21 గంటల చర్చలు… ఫలితం శూన్యం
Image Credit : Facebook/IslamabadSerenaHotel

21 గంటల చర్చలు… ఫలితం శూన్యం

అమెరికా–ఇరాన్ మధ్య 21 గంటల పాటు చర్చలు జరిగినా, చివరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదు. అమెరికా తమ ఫైనల్ ఆఫర్ ఇచ్చినా, ఇరాన్ నుంచి అణ్వస్త్రాలపై స్పష్టమైన హామీ రాలేదు. డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వం కూడా ఈ చర్చల వల్ల పెద్ద మార్పు ఉండదని సంకేతాలు ఇచ్చింది. దీంతో పాకిస్థాన్ మధ్యవర్తిగా ప్లాట్ ఫామ్ కల్పించినా, ఫలితం మాత్రం సున్నాగా మారింది.

44
పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి… సెటైర్ వెనుక నిజం
Image Credit : X

పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి… సెటైర్ వెనుక నిజం

పాకిస్థాన్ ఆర్థికంగా ఇప్పటికీ ఒత్తిడిలోనే ఉంది. IMF నుంచి వరుసగా రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. 2024లో సుమారు 7 బిలియన్ డాలర్ల సహాయం కూడా తీసుకుంది. విదేశీ మారక నిల్వలు ఒత్తిడిలో ఉండగా, అప్పులు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో భారీ అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించడం గౌరవంగా కనిపించినా, ఖర్చుల విషయంలో మాత్రం ప్రశ్నలు లేవనెత్తుతోంది. అందుకే నెటిజన్లు సెటైరిక్‌గా “హోస్ట్ పాకిస్థాన్… స్పాన్సర్ IMF!” అని కామెంట్లు చేస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ప్రపంచం
యుద్ధం

Latest Videos
Recommended Stories
Recommended image1
USA: ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సంచలన నిర్ణయం.. అమెరికా వెళ్లే భార‌తీయుల‌కు గ‌ట్టి షాక్
Recommended image2
Nepal Floods : నేపాల్ వరదల్లో చిక్కుకున్న సద్గురు టీమ్.. ఈ హీరోయిన్ సంగతేంటి?
Recommended image3
Nepal Flash Floods: కైలాస యాత్రలో ఊహించని విషాదం.. సెకన్లలో కొట్టుకుపోయిన బ్రిడ్జిలు.. 160 మందికి పైగా మృతి
Related Stories
Recommended image1
OTT: జీవితానికి రీసెట్ బటన్ ఉండదు.. ఈ తరం వారి కళ్లు తెరిపించే సినిమా. ఓటీటీలో స్ట్రీమింగ్
Recommended image2
దీని ముందు ఐఫోన్ కూడా బ‌లాదూర్.. మైండ్ బ్లాంక్ అయ్యే ఫీచ‌ర్లు. ధ‌ర కూడా చాలా త‌క్కువ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved