- Home
- International
- డిసెంబర్ 10 తర్వాత ఇన్‌స్టా, ఫేస్‌బుక్ అకౌంట్లు క్లోజ్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
డిసెంబర్ 10 తర్వాత ఇన్‌స్టా, ఫేస్‌బుక్ అకౌంట్లు క్లోజ్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
Social Media: సోషల్ మీడియాతో మంచితో పాటు చెడు కూడా ఉందని తెలిసిందే. ముఖ్యంగా టీనేజర్లు సోషల్ మీడియాకు చాలా ప్రభావితమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

డిసెంబర్ 10 నుంచి అండర్‌ఏజ్ అకౌంట్ల సస్పెన్షన్
ఆస్ట్రేలియాలో కొత్త ఆన్‌లైన్ భద్రతా చట్టం ప్రకారం, 16 సంవత్సరాల లోపు పిల్లలు తల్లిదండ్రుల అనుమతి లేకుండా సోషల్ మీడియా వాడకూడదని నిర్ణయించారు. ఈ చట్టం ప్రకారం, మెటా ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, టిక్‌టాక్‌తో పాటు టిక్‌టాక్, స్నాప్‌టాచ్ ప్లాట్‌ఫామ్‌లు 16 ఏళ్ల లోపు యూజర్ల అకౌంట్లను డిసెంబర్ 10 నుంచి నిలిపివేయనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొదటిసారిగా ఒక దేశం చిన్న పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించడం ఇదే తొలిసారి.
యూజర్లకు ముందుగానే హెచ్చరిక
అకౌంట్ తొలగింపునకు ముందు ఆ యూజర్లకు నోటిఫికేషన్ వస్తుంది. అందులో మూడు ఆప్షన్లు ఉంటాయి.
* తమ డేటాను డౌన్‌లోడ్ చేసుకోవడం
* ప్రొఫైల్‌ను తాత్కాలికంగా ఫ్రీజ్ చేయడం
* లేదా పూర్తిగా యాక్సెస్ కోల్పోవడం
ఈ విధంగా ప్లాట్‌ఫామ్‌లు యూజర్లకు ముందుగా సమయం ఇస్తాయని తెలుస్తోంది.
పిల్లల మానసిక ఆరోగ్య రక్షణ లక్ష్యం
ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని Online Safety Act కింద ప్రవేశపెట్టింది. దీని ప్రధాన ఉద్దేశ్యం — సోషల్ మీడియా వల్ల పిల్లల్లో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలను అరికట్టడం. ఈ చట్టాన్ని ఉల్లంఘించే కంపెనీలకు A$49.5 మిలియన్ (సుమారు రూ. 270 కోట్లు) వరకు జరిమానా విధిస్తారు.
వయసు నిర్ధారణకు AI టెక్నాలజీ వినియోగం
యూజర్లు తమ గుర్తింపు పత్రాలను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. దానికి బదులుగా Meta, TikTok, Snapchat వంటి కంపెనీలు యూజర్ల ఆన్‌లైన్ ప్రవర్తన లైక్‌లు, కామెంట్లు, ఎంత సమయం ఆన్‌లైన్‌లో ఉంటున్నారు లాంటి వివరాల ఆధారంగా వయస్సును అంచనా వేయడానికి AI ఆధారిత సిస్టమ్స్ వినియోగిస్తాయి. యూజర్ తనను తప్పుగా అండర్‌ఏజ్‌గా గుర్తించారని భావిస్తే, సెల్ఫీ ఆధారంగా వయస్సు నిర్ధారించే యాప్‌ల ద్వారా అపిల్ చేసుకోవచ్చు. ఇలాంటి సేవలను అందించే కంపెనీ Yoti, “మొదటి రెండు మూడు వారాల్లో కొంత గందరగోళం ఉంటుందని, కానీ తర్వాత యూజర్లు దీనికివ అలవాటు పడతారని” తెలిపింది.
ప్రపంచానికి ఆదర్శం కానున్న ఆస్ట్రేలియా
ఈ చట్టం ద్వారా ఆస్ట్రేలియా ప్రపంచంలో తొలి దేశంగా సోషల్ మీడియా యాక్సెస్‌పై వయస్సు పరిమితి విధించింది. TikTok సంస్థ ప్రకారం, 13–15 ఏళ్ల మధ్య ఉన్న సుమారు 2 లక్షల యూజర్లు ఆస్ట్రేలియాలో ఉన్నారని, వీరిపై కూడా చర్యలు తీసుకునేందుకు కొత్త టూల్స్ రూపొందిస్తున్నామని తెలిపింది. ఇక లైవ్‌స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ Kick కూడా ఈ చట్టానికి అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ప్రస్తుతం 20 మిలియన్ల ఆస్ట్రేలియన్ యూజర్లలో ఎక్కువ మందిపై ఈ మార్పు తక్షణ ప్రభావం చూపకపోయినా, నిపుణులు దీని ప్రభావం గ్లోబల్‌గా ఉంటుందని చెబుతున్నారు. 2026 నాటికి మరికొన్ని దేశాలు కూడా ఇదే విధానాన్ని అనుసరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.