వాడి పడేసిన కొబ్బరి బోండాలతో కోట్లు కురుస్తాయి.. లైఫ్ సెట్ అయ్యే బిజినెస్
Business Idea: వ్యాపారం చేయాలని చాలా మందికి ఉంటుంది. కానీ సరైన అవగాహన లేకో, పెట్టుబడికి భయపడో ఆ నిర్ణయాన్ని విరమించుకుంటారు. కానీ పర్‌ఫెక్ట్ ప్లానింగ్ చేస్తే లక్షల ఆదాయం ఆర్జించే బిజినెస్‌లు కూడా ఉన్నాయి.

కొబ్బరి బోండాలే పెట్టుబడి
తాగిన కొబ్బరి బోండాలను చెత్త కుప్పలో పడేస్తుంటాం. సాధారణంగా దీనిని వేస్ట్‌గా భావిస్తుంటాం. అయితే దీంతో వెల్త్ సృష్టించవచ్చని మీకు తెలుసా. చెత్తలో పడేసిన బోండాలను సేకరించి ప్రాసెస్ చేస్తే కోకోపీట్, ఫైబర్, తాళ్లు, ఫర్నిచర్ ఫిల్లింగ్‌లకు ఉపయోగించే పదార్థాలు తయారు చేయొచ్చు. ఈ వ్యాపారాన్ని “కోకోపీట్ ప్రాసెసింగ్ బిజినెస్” అంటారు. ప్రస్తుతం మార్కెట్లో దీనికి పెద్ద డిమాండ్ ఉంది, ముఖ్యంగా గార్డెనింగ్, నర్సరీలు, ఫర్నిచర్, విగ్రహ తయారీ రంగాల్లో దీనిని ఉపయోగిస్తుంటారు.
కోకోపీట్ ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది.?
బోండాల సేకరణ: హోటళ్లు, జ్యూస్ సెంటర్లు, దేవాలయాలు, మార్కెట్లు, హాస్పిటల్స్ వంటి ప్రదేశాల నుంచి తాగి పడేసిన కొబ్బరి బోండాలను సేకరిస్తారు.
డ్రైయింగ్: బోండాలను ఎండబెట్టి నీరు పూర్తిగా తొలగిస్తారు.
పీలింగ్ & సిపరేషన్: కోకోపీట్ మేకింగ్ మెషిన్‌లో బోండాలను వేసి, అందులోంచి ఫైబర్ (తాడు కోసం), పీట్ (ఎరువుల కోసం) వేరుచేస్తారు.
ప్యాకింగ్: ఈ పీచ్‌ను చిన్న బ్లాక్స్‌గా లేదా పౌడర్ రూపంలో ప్యాక్ చేసి మార్కెట్లో అమ్మొచ్చు.
పెట్టుబడి వివరాలు
* కోకోపీట్ మేకింగ్ మెషిన్ ధర రూ. 1.5 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు (సామర్థ్యంపై ఆధారపడి) ఉంటుంది.
* ముడిసరుకు (బోండాలు): చాలా తక్కువ ఖర్చు — ఎక్కువగా చెత్త నుంచి ఉచితంగా లభిస్తాయి. అయితే వీటిని సేకరించే వ్యక్తులకు కొంత మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది.
* మిగతా ఖర్చులు: విద్యుత్, కార్మికులు, ట్రాన్స్‌పోర్ట్, ప్యాకేజింగ్ వంటి ఖర్చులు కలిపి నెలకు సుమారు రూ. 20,000– రూ. 30,000.
* ప్రాథమికంగా రూ. 2 నుంచి రూ. 3 లక్షల పెట్టుబడి ఉంటే చిన్న స్థాయిలో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
లాభాలు ఎలా ఉంటాయి.?
ఒక్క కిలో కోకోపీట్ ధర మార్కెట్లో రూ. 20 నుంచి రూ. 25 వరకు ఉంటుంది. ఒక టన్ను ప్రాసెస్ చేస్తే రూ. 20 నుంచి రూ. 25 వేలు లాభం పొందొచ్చు. పెద్ద ఎత్తున ప్రాసెసింగ్ చేస్తే నెలకు రూ. లక్ష వరకు సంపాదించవచ్చు. దీర్ఘకాలం నిల్వ ఉండే ఉత్పత్తి కావడంతో నష్టం తక్కువ, డిమాండ్ స్థిరంగా ఉంటుంది.
ఉపయోగాలు, మార్కెట్ డిమాండ్
* కోకోపీట్: గార్డెనింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, నర్సరీల్లో మట్టికి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు.
* ఫైబర్: తాళ్లు, మట్‌లు, కుషన్ ఫిల్లింగ్స్, సోఫా సీట్ ప్యాడింగ్ తయారీలో.
* విగ్రహాలు: పర్యావరణ హితమైన గణేశ విగ్రహాల తయారీలో.
* హోమ్ డెకర్: పూల కుండీలు, ఆర్ట్ ఐటమ్స్‌లో.
దేశంలో గార్డెనింగ్, ఎగుమతుల రంగాల్లో పెరుగుతున్న డిమాండ్‌తో కోకోపీట్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది.
వ్యాపారం ఎలా ప్రారంభించాలి.?
ముందుగా చిన్న స్థలంలో షెడ్ ఏర్పాటు చేయండి. తర్వాత కోకోపీట్ మేకింగ్ మెషిన్ కొనుగోలు చేయండి. స్థానిక మార్కెట్, ఆన్‌లైన్ సైట్లు (Amazon, IndiaMART, TradeIndia) ద్వారా ముడిసరుకు, కొనుగోలుదారులను కనుక్కోండి. సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్ చేయండి. స్థానిక వ్యవసాయ శాఖ, MSME రిజిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వ సబ్సిడీలను పొందండి. ఈ వ్యాపారంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు.