MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • International
  • Parasite Outbreak: అమెరికాను వణికిస్తున్న పారాసైట్.. అసలేంటి ఈ సైక్లోస్పోరా? ఇది ఎలా వ్యాపిస్తుంది?

Parasite Outbreak: అమెరికాను వణికిస్తున్న పారాసైట్.. అసలేంటి ఈ సైక్లోస్పోరా? ఇది ఎలా వ్యాపిస్తుంది?

Cyclospora Parasite Infection: అమెరికాను సైక్లోస్పోరా పరాన్నజీవి భయపెడుతోంది. కంటికి కనిపించని ఈ ఇన్ఫెక్షన్ తో వేల మంది బాధపడుతున్నారు. సైక్లోస్పోరియాసిస్ లక్షణాలు, అది వ్యాపించే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 15 2026, 09:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అసలేంటి ఈ సైక్లోస్పోరా పారాసైట్?
Image Credit : Getty

అసలేంటి ఈ సైక్లోస్పోరా పారాసైట్?

అమెరికాలో ఒక పారాసైట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు పెంచుతోంది. ఇప్పటికే దీని కారణంగా వేల మంది తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. దాని పేరే సైక్లోస్పోరా కీటానెన్సిస్. ఇది ఒక సింగిల్ సెల్డ్, గుండ్రంగా ఉండే పారాసైట్. ఇది ఎంత చిన్నగా ఉంటుందంటే, మైక్రోస్కోప్ పెట్టి చూస్తే తప్ప అస్సలు కనిపించదు. మనుషుల్లో ఈ ఇన్ఫెక్షన్‌ను ఫస్ట్ టైమ్ 1994లో గుర్తించారు.

ప్రస్తుతానికి అమెరికాలోని దాదాపు 34 రాష్ట్రాల్లో 7,000 మందికి పైగా ఈ ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మిచిగాన్, న్యూయార్క్ వంటి ప్రాంతాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది బాడీలోకి వెళ్తే ‘సైక్లోస్పోరియాసిస్’ అనే ప్రేగు ఇన్ఫెక్షన్ వస్తుంది. దీనివల్ల ‘ఎక్స్‌ప్లోజివ్ డయేరియా’ అంటే కంట్రోల్ కాని తీవ్రమైన నీళ్ల విరేచనాలు అవుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బాడీలోకి వెళ్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి?
Image Credit : others

బాడీలోకి వెళ్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి?

ఈ పారాసైట్ ఉన్న కలుషిత ఆహారం తిన్న తర్వాత, బాడీలో లక్షణాలు బయటపడటానికి వారం రోజులు లేదా రెండు రోజుల నుండి రెండు వారాల వరకు టైమ్ పడుతుంది. ప్రధాన లక్షణం విపరీతమైన మోషన్స్ అవ్వడం. దీనితో పాటు కడుపునొప్పి, గ్యాస్, వికారం, నీరసం, ఆకలి చచ్చిపోవడం వంటి సమస్యలు వారాల తరబడి వేధిస్తాయి.

హెల్తీగా ఉన్నవాళ్లు దీని నుండి త్వరగానే కోలుకుంటారు కానీ, చిన్న పిల్లలు, ముసలివాళ్లు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్లకు మాత్రం ఇది వస్తే పరిస్థితి చాలా సీరియస్‌గా మారుతుంది. దీని కోసం ఎలాంటి వ్యాక్సిన్లు లేవు. ట్రీట్‌మెంట్ కోసం డాక్టర్లు ‘ట్రిమెథోప్రిమ్-సల్ఫామెథోక్సాజోల్’ అనే నార్మల్ జనరిక్ యాంటీబయాటిక్ వాడుతుంటారు.

35
అసలు ఇది ఎలా వ్యాపిస్తుంది?
Image Credit : Getty

అసలు ఇది ఎలా వ్యాపిస్తుంది?

ఈ సైక్లోస్పోరా ఒక మనిషి నుండి ఇంకో మనిషికి డైరెక్ట్‌గా స్ప్రెడ్ అవ్వదు. కానీ, కలుషితమైన ఫుడ్ లేదా నీటి ద్వారానే ఇది మన పొట్టలోకి వెళ్తుంది. పంట పొలాల్లో వాడే నీటిలో హ్యూమన్ వేస్ట్ కలవడం వల్ల ఈ జెర్మ్స్ పండ్లు, కూరగాయలకు అంటుకుంటాయి. డ్రైనేజీ సిస్టమ్స్ లీక్ అవ్వడం, వర్షాల వల్ల మురుగునీరు పంట కాలువల్లో కలవడం వల్ల ఇలా జరుగుతుంది.

ఈ పారాసైట్ గుడ్లు చాలా మొండివి. ఇవి మట్టిలో లేదా నీటిలో నెలల తరబడి బతుకుతాయి. రైతులు నార్మల్‌గా వాడే క్లోరిన్ వాటర్ వేసినా ఇవి చావవు. వీటిని క్లీన్ చేయాలంటే అల్ట్రావైయొలెట్ లైట్ లేదా ఓజోన్ ట్రీట్‌మెంట్ లాంటి కాస్ట్లీ మెథడ్స్ వాడాలి.

45
ట్రాక్ చేయడం ఎందుకు కష్టంగా మారింది?
Image Credit : Getty

ట్రాక్ చేయడం ఎందుకు కష్టంగా మారింది?

ఫుడ్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం, ఈ పారాసైట్‌ను ట్రాక్ చేయడం చాలా కష్టమైన పని. ఎందుకంటే నార్మల్ ల్యాబ్ టెస్టుల్లో ఇది దొరకదు, డాక్టర్లు స్పెషల్‌గా టెస్ట్ ఆర్డర్ చేయాలి. ఇన్ఫెక్షన్ వచ్చిన చాలా రోజులకు లక్షణాలు రావడం వల్ల, పేషెంట్లు తాము రెండు వారాల క్రితం ఏం తిన్నారో కరెక్ట్‌గా గుర్తుంచుకోలేరు. పైగా రీసెంట్‌గా అమెరికా హెల్త్ డిపార్ట్‌మెంట్లలో బడ్జెట్, స్టాఫ్ కట్స్ జరగడం వల్ల ఫుడ్‌నెట్ లాంటి నిఘా వ్యవస్థలు డేటాను సరిగ్గా ట్రాక్ చేయలేకపోతున్నాయి.

అధికారులు ఎఫెక్ట్ అయిన పేషెంట్లను ఇంటర్వ్యూ చేసి, వాళ్లు తిన్న ఫుడ్ లింక్స్ వెతికేసరికే చాలా టైమ్ పడుతోంది. ప్రస్తుతం రస్ప్‌బెర్రీస్ పండ్లు, సలాడ్స్ కోసం వాడే లెట్యూస్ ఆకులు, కొత్తిమీర, బాసిల్ వంటి ఆకుకూరల వల్లే ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

55
మనం సేఫ్‌గా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
Image Credit : META AI

మనం సేఫ్‌గా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?

ఈ పారాసైట్ పండ్లు, ఆకుకూరల ఔటర్ లేయర్‌కు గట్టిగా అంటుకుని ఉంటుంది కాబట్టి నార్మల్‌గా నీళ్లు చల్లి కడిగితే అస్సలు పోదు. దీని నుండి తప్పించుకోవడానికి నిపుణులు చెప్పిన కొన్ని బెస్ట్ టిప్స్ గమనిస్తే..

• రెడీమేడ్ సలాడ్స్ వద్దు: మార్కెట్లో దొరికే ప్రీ వాష్డ్, బ్యాగ్డ్ సలాడ్ కిట్స్ కంటే నార్మల్ హోల్ లెట్యూస్ తెచ్చుకోవడం మంచిది. దాని పైనున్న రెండు మూడు లేయర్ల ఆకులను పారేసి, లోపలి ఆకులను రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద బాగా కడగాలి.

• వెనిగర్ సొల్యూషన్: రస్ప్‌బెర్రీస్ వంటి పండ్లను కనీసం ఒక నిమిషం పాటు కడగాలి. ఒక భాగం వైట్ వెనిగర్, మూడు భాగాల ట్యాప్ వాటర్ కలిపిన సొల్యూషన్‌లో పండ్లను, ఆకుకూరలను ముంచి కడిగితే ఇంకా బాగా క్లీన్ అవుతాయి.

• బాగా ఉడికించడం: కూరగాయలను కనీసం 158°F ఇంటర్నల్ టెంపరేచర్ వచ్చేలా బాగా ఉడికించి తింటే ఈ పారాసైట్ పూర్తిగా చచ్చిపోతుంది. ఇదే అన్నిటికంటే పక్కా సేఫ్ మెథడ్. ఒకవేళ ఎవరికైనా ఈ ఇన్ఫెక్షన్ వస్తే, హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు కరెక్ట్ వివరాలు ఇచ్చి కోఆపరేట్ చేయాలని నిపుణులు సూచిస్తేన్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
అమెరికాను వ‌ణించిన 9/11 అటాక్‌.. అస‌లా రోజు ఏం జ‌రిగింది? టైమ్ టూ టైమ్ పూర్తి వివ‌రాలు
Recommended image2
Nepal Floods: చుట్టూ సర్వనాశనం.. ఆ పచ్చని ఇల్లు మాత్రం ఎలా నిలబడింది? నేపాల్ వరదల్లో మిరాకిల్!
Recommended image3
Nepal Flash Floods: నేపాల్‌లో ఘోర ప్రళయం.. 903కు పెరిగిన మృతుల సంఖ్య, 4,200 మందికి పైగా గల్లంతు
Related Stories
Recommended image1
Top 5 Low Calorie Beers in India: ఇండియాలో దొరికే టాప్ 5 లో-క్యాలరీ బీర్లు ఏవో తెలుసా? సూపర్ టేస్ట్ !
Recommended image2
Telangana Niagara: తెలంగాణలో నయాగరా జలపాతం.. వీకెండ్ ట్రిప్ కోసం బెస్ట్ ప్లేస్.. రూట్ మ్యాప్, ఫుల్ డీటెయిల్స్ ఇవే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved