Modi Trump Bromance : బాబోయ్ ... ఇదేందయ్యా ఇది
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు. కొన్ని విషయాల్లో మోదీతో అస్సలు పోటీ పడలేమని స్వయంగా ట్రంప్ కామెంట్స్ చేసారు. ఆ విషయాలేమిటో కూడా ట్రంప్ బైటపెట్టారు.

Modi Trump Bromance
Modi Trump Bromance : ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ మొదటిసారి చేపట్టిన ఈ యూఎస్ పర్యటనను యావత్ భారతదేశం ఆసక్తిగా గమనించింది. ట్రంప్ చాలా దూకుడుగా పాలన సాగిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అమెరికాలో స్థిరపడిన ఇండియన్స్, ఇకపై ఆ దేశానికి వెళ్ళాలని అనుకుంటూ కలలు కంటున్నవారు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమయంలో ట్రంప్ తో మోదీ భేటీ ఆసక్తికరంగా మారింది.
అయితే అందరూ అనుకున్నట్లే అమెరికాలో అక్రమ వలసలపై ట్రంప్, మోదీ మధ్య చర్చ జరిగింది. అలాగే రక్షణ, వాణిజ్య పరమైన అంశాలపైనా ఇరు దేశాధినేతలు చర్చించుకున్నారు. అలాగే ఇరుదేశాల మధ్య స్నేహాన్ని మరింత పెంచేలా ట్రంప్, మోదీ మధ్య మాటలు సాగాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే చైనాను టార్గెట్ చేసిన నేపథ్యంలో వ్యూహాత్మకంగా భారత్ తో సత్సంబంధాలు కోరుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మోదీకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు ట్రంప్. అందుకే ఆయన అధ్యక్ష పగ్గాలు చేపట్టి ఇంకా నెలరోజులు కూడా అప్పుడే మోదీతో భేటీ అయ్యారు.
Modi Trump
ఆ విషయంలో మోదీ నాకంటే స్మార్ట్ :
రెండురోజుల పర్యటన కోసం అమెరికాకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశాక్షుడు ట్రంప్ ఆత్మీయ ఆతిథ్యం అందించారు. అధ్యక్ష భవనం వైట్ హౌస్ కు చేరుకున్న మోదీకి స్వయంగా ట్రంప్ స్వాగతం పలికారు. ఇద్దరు నేతలు ఆప్యాయంగా ఒకరినొకరు హత్తుకుని స్నేహపూర్వకంగా కరచాలనం చేసుకున్నారు.
ఇలా స్నేహపూర్వక మాటామంతి తర్వాత మోదీ, ట్రంప్ అసలు చర్చలు ప్రారంభించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షక సంబంధాలపై చర్చించారు. అమెరికాలో అక్రమ వలసదారుల ఏరివేతకోసం ట్రంప్ చేపట్టిన చర్యలు, దీనివల్ల అక్కడ స్థిరపడ్డ భారత ప్రజలకు ఎదురవుతున్న సమస్యలపై ఇరునేతలు చర్చించుకున్నారు. అయితే తాము కేవలం అక్రమ వలసదారులతోనే కఠినంగా వ్యవహరిస్తున్నాం... అధికారికంగా తమ దేశంలో వుంటున్న భారతీయులకే కాదు ఏ దేశీయులకు ఎలాంటి ఇబ్బంది వుండదని ట్రంప్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఇరుదేశాల వాణిజ్యపరమైన అంశాలపైనా ట్రంప్,మోదీ చర్చించారు. భారత్ లో అధిక పన్ను విధానం గురించి ట్రంప్ ప్రస్తావించారు. మీ టారీఫ్ విధానాల్లో మార్పులు అవసరమైని ప్రధానికి సూచించినట్లు తెలుస్తోంది. తమతో ఏ దేశం ఎలా వ్యవహరిస్తుందో తాముకూడా అలాగే వ్యవహరిస్తామని... భారత్ అధిక పన్నులు విధిస్తే తాము కూడా అలాగే విధిస్తామని ట్రంప్ స్పష్టం చేసాడు. ఈ అధిక పన్నులవల్లే ఎక్కువగా భారత్ తో వ్యాపారం సులభంగా చేయలేకపోతున్నామని ట్రంప్ వెల్లడించారు.
ఇక పెట్టుబడులు,వాణిజ్య ఒప్పందాల విషయంలో తనకంటే నరేంద్ర మోదీ చాలా స్మార్ట్ అని ట్రంప్ పేర్కొన్నారు. మోదీ చాలాబాగా బేరసారాలు ఆడగలరు... ఆయనలా చర్చలు జరపడం తనవల్ల కాదన్నారు. మోదీ మంచి నెగోషియేటర్ గా ట్రంప్ అభివర్ణించారు.
Modi Trump
అక్రమ వలసలపై ట్రంప్ చర్యలకు మోదీ రియాక్షన్ :
అమెరికాలోని హైటెక్ జీవితం చాలా దేశాల యువతను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీంతో డాలర్స్ డ్రీమ్ తో కొందరు అధికారికంగా ఆ దేశంలో అడుగుపెడితే మరికొందరు అక్రమంగా ఆ దేశానికి చేరుకుంటున్నారు. ఇలా ప్రస్తుతం అమెరికాలో లక్షలాదిమంది అక్రమంగా నివసిస్తున్నారు... ఇందులో భారతీయులు భారీ సంఖ్యలో ఉన్నారు.
ఈ అక్రమ వలసలతో అమెరికన్లు నష్టపోతున్నారు... దీంతో 'అమెరికా ఫస్ట్' అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ ఈ అక్రమ వలసలపై చాలా సీరియస్ గా వున్నారు. ఆయన రెండోసారి అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులను దేశంనుండి పంపించే పెద్దపని పెట్టుకున్నారు.
ఇలా అన్ని దేశాలతో పాటు ఇండియన్స్ పై కూడా ట్రంప్ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఇలా ఇప్పటికే కొందరికి చేతులు కాళ్ళు బంధించి మరి అమెరికా నుండి ఇండియాకు పంపించారు. ఈ విషయంపై తాజాగా ట్రంప్ ఎదుటే ప్రధాని మోదీ స్పందించారు.
అక్రమ వలసలు ఏ దేశానికైనా ప్రమాదకరమే... అందుకే ఏ దేశమైనా ఈ విషయంలో కఠినంగా వుంటుందని మోదీ స్పష్టం చేసారు. అక్రమ వలసదారుల విషయంలో ట్రంప్ చర్యలు సరైనవేనని మోదీ పేర్కొన్నారు. ఇది అంతర్జాతీయ సమస్య... వలసల నియంత్రణకు అన్నిదేశాలు కలిసి ఓ విధానాన్ని తీసుకురావాలని అనేలా ప్రధాని మోదీ కామెంట్స్ చేసారు. అమెరికాలో అక్రమంగా నివాసముంటున్న భారతీయుల తరలింపులో ట్రంప్ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేసారు.