MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • International
  • ప్రపంచంలో ప్రాస్టిట్యూషన్ అనుమతి ఉన్న దేశాలేవో తెలుసా.? భారతదేశంలో పరిస్థితి ఏంటి.?

ప్రపంచంలో ప్రాస్టిట్యూషన్ అనుమతి ఉన్న దేశాలేవో తెలుసా.? భారతదేశంలో పరిస్థితి ఏంటి.?

Laws: ప్రాస్టిట్యూషన్ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తూనే ఉంటుంది. కొన్ని దేశాలు దీనిని చట్టబద్ధమైన వృత్తిగా గుర్తించగా, మరికొన్ని దేశాలు పూర్తిగా నిషేధించాయి. భారత్‌లో కూడా ఈ అంశంపై తరచుగా చర్చ జరుగుతుంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 06 2026, 06:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భారత్‌లో ప్రాస్టిట్యూషన్ వర్క్‌పై చట్టం ఏమి చెబుతోంది?
Image Credit : Gemini AI

భారత్‌లో ప్రాస్టిట్యూషన్ వర్క్‌పై చట్టం ఏమి చెబుతోంది?

భారత్‌లో ఇద్దరు పెద్దవాళ్లు పరస్పర అంగీకారంతో చేసే ప్రాస్టిట్యూషన్ నేరంగా పరిగణించరు. అయితే దీనికి సంబంధించిన కొన్ని కార్యకలాపాలు మాత్రం చట్ట విరుద్ధంగా ఉంటాయి. ప్రత్యేకంగా ప్రాస్టిట్యూషన్ గృహాలు (బ్రోతెల్స్) నిర్వహించడం, ప్రాస్టిట్యూషన్ కోసం మధ్యవర్తిత్వం చేయడం, ఎవరినైనా బలవంతంగా ఈ వృత్తిలోకి నెట్టడం, మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) వంటి చర్యలు చట్టపరంగా నేరాలు. భారత సుప్రీంకోర్టు కూడా ప్రాస్టిట్యూషన్ వర్కర్లకు ఇతర పౌరుల మాదిరిగానే రాజ్యాంగం కల్పించిన జీవన హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రాస్టిట్యూషన్ ను చట్టబద్ధంగా గుర్తించిన దేశాలు
Image Credit : FREEPIK

ప్రాస్టిట్యూషన్ ను చట్టబద్ధంగా గుర్తించిన దేశాలు

ప్రపంచంలోని కొన్ని దేశాలు ప్రాస్టిట్యూషన్ వర్క్‌ను నియంత్రిత పద్ధతిలో అనుమతిస్తున్నాయి. 

*  నెద‌ర్లాండ్స్‌లో ప్రాస్టిట్యూషన్ చట్టబద్ధం. అక్కడ లైసెన్స్ పొందిన ప్రాస్టిట్యూషన్ గృహాలు నిర్వహించేందుకు అనుమతి ఉంటుంది. ప్రాస్టిట్యూషన్ వర్కర్లు పన్నులు చెల్లిస్తూ కొన్ని కార్మిక హక్కులను కూడా పొందగలరు. 

*  జ‌ర్మ‌నీలో కూడా ప్రాస్టిట్యూషన్ ను చట్టబద్ధమైన వృత్తిగా గుర్తించారు. అక్కడ ఉద్యోగ ఒప్పందాలు చేసుకునే అవకాశం, ఆరోగ్య సేవలు, సామాజిక భద్రత పథకాల ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.

*  స్విట్జ‌ర్లాండ్‌లో ప్రాస్టిట్యూషన్ వర్క్ చట్టబద్ధమే. అక్కడ పనిచేసే వారు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని కార్మిక హక్కులు కూడా వారికి లభిస్తాయి.

*  బెల్జియం ఇటీవల ప్రాస్టిట్యూషన్ వర్కర్ల హక్కులను బలోపేతం చేసే చర్యలు చేపట్టింది. ఉద్యోగ భద్రత, భీమా, సామాజిక రక్షణ వంటి అంశాల్లో వారికి మద్ధతు ఇస్తోంది.

35
నేరంగా పరిగణించకపోయినా ప్రత్యేక విధానాలు ఉన్న దేశాలు
Image Credit : google

నేరంగా పరిగణించకపోయినా ప్రత్యేక విధానాలు ఉన్న దేశాలు

* న్యూజిలాండ్‌ 2003లో చట్టాల్లో మార్పులు చేసింది. అప్పటి నుంచి పరస్పర అంగీకారంతో జరిగే ప్రాస్టిట్యూషన్ వర్క్‌ను నేరాల జాబితా నుంచి తొలగించారు.

* ఆస్ట్రేలియాలో జాతీయ స్థాయిలో ఒకే విధమైన చట్టం లేదు. ప్రతి రాష్ట్రానికి వేర్వేరు నిబంధనలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇది చట్టబద్ధం కాగా, మరికొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక పరిమితులు అమలులో ఉన్నాయి.

* స్వీడ‌న్‌లో ప్రత్యేక విధానం అమలులో ఉంది. అక్కడ ప్రాస్టిట్యూషన్ వర్కర్‌ను నేరస్థుడిగా పరిగణించరు. కానీ సేవలను కొనుగోలు చేసే వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

45
ఆసియా దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది?
Image Credit : google

ఆసియా దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది?

*  థాయ్‌లాండ్‌లో ప్రాస్టిట్యూషన్ వర్క్ సాంకేతికంగా చట్ట విరుద్ధమే. అయినప్పటికీ కొన్ని నగరాల్లో ఇది బహిరంగంగా కనిపించే వాస్తవ పరిస్థితి ఉంది.

*  జ‌పాన్‌లో డబ్బు తీసుకుని నేరుగా ప్రాస్టిట్యూషన్ సేవలు అందించడం నిషేధితమే. అయితే అనేక రకాల అడల్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ సేవలకు చట్టబద్ధ అనుమతులు ఉన్నాయి. దీంతో చట్టం, ఆచరణ మధ్య తేడా కనిపిస్తుంది.

* సింగ‌పూర్‌లో కొన్ని నియంత్రిత ప్రాంతాల్లో, ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రాస్టిట్యూషన్ వర్క్‌కు అనుమతి ఉంది. అనుమతి లేని కార్యకలాపాలపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటారు.

55
WHO, UNAIDS అభిప్రాయం ఏమిటి?
Image Credit : our own

WHO, UNAIDS అభిప్రాయం ఏమిటి?

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO), UNAIDS వంటి అంతర్జాతీయ సంస్థలు ప్రాస్టిట్యూషన్ వర్క్‌ను పూర్తిగా నేరంగా పరిగణించడం వల్ల ఆరోగ్య సేవలకు చేరుకోవడంలో ఇబ్బందులు తలెత్తవచ్చని చెబుతున్నాయి. వారి అభిప్రాయం ప్రకారం, ప్రాస్టిట్యూషన్ వర్కర్లు చట్టపరమైన భయం లేకుండా ఉంటే ఆరోగ్య పరీక్షలు, వైద్య సేవలు, HIV నివారణ కార్యక్రమాలు, న్యాయ సహాయం వంటి సేవలను మరింత సులభంగా పొందగలుగుతారు. అందువల్ల ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా భిన్నమైన చట్టాలు, విధానాలు అమలులో ఉన్నాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ప్రపంచం
న్యాయ స‌ల‌హాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Recommended image2
అమెరికాలో ఇళ్ల బయట జనం ఎందుకు కనిపించరు.? ఇంతకీ వాళ్లేం చేస్తుంటారు.?
Recommended image3
Trump Tariffs: రష్యా ఆయిల్ కొంటే భారత్‌పై 100% టారిఫ్? ట్రంప్ చేతికి డెడ్లీ వెపన్ ఇచ్చిన అమెరికా పార్లమెంట్
Related Stories
Recommended image1
రైలులో బ్యాగ్ మ‌ర్చిపోతే ఇక అంతే సంగ‌తులా.? అస్స‌లు కాదు, తిరిగిపొందే మార్గం ఉందని తెలుసా?
Recommended image2
Foot Massager: మ‌సాజ్ కోసం ఎక్క‌డికి వెళ్లాల్సిన ప‌నిలేదు.. జ‌స్ట్ రూ. 4 వేల‌తో ఇంట్లోనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved