MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • International
  • Jaahnavi Kandula: తెలుగు విద్యార్థిని కుటుంబానికి అమెరికా రూ. 262 కోట్ల ప‌రిహారం.. అస‌లేం జ‌రిగిందంటే?

Jaahnavi Kandula: తెలుగు విద్యార్థిని కుటుంబానికి అమెరికా రూ. 262 కోట్ల ప‌రిహారం.. అస‌లేం జ‌రిగిందంటే?

Jaahnavi Kandula: అమెరికాలో రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన తెలుగు విద్యార్థిని జాహ్న‌వి కందుల మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె కుటుంబానికి రూ. 262 కోట్ల ప‌రిహారం ఇచ్చేందుకు సియాటెల్ న‌గ‌ర పాల‌క సంస్థ ఒప్పుకుంది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. 

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 12 2026, 11:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సియాటెల్ నగరంతో 29 మిలియన్ డాలర్ల సెటిల్మెంట్
Image Credit : Asianet News

సియాటెల్ నగరంతో 29 మిలియన్ డాలర్ల సెటిల్మెంట్

జాహ్నవి మృతి కేసులో ఆమె కుటుంబం దాఖలు చేసిన సివిల్ దావాపై సియాటెల్ సిటీ రాజీకి వచ్చింది. 29 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. మ‌న క‌రెన్సీలో చెప్పాలంటే రూ. 262 కోట్లు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఈ నిర్ణయం వెల్లడైంది. సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ విడుదల చేసిన ప్రకటనలో, “జాహ్నవి మరణం హృదయ విదారకం. ఈ సెటిల్మెంట్ ఆమె కుటుంబానికి కొంత ఉపశమనం ఇవ్వాలని ఆశిస్తున్నాం” అని పేర్కొన్నారు. గతవారం ఇరుపక్షాలు కోర్టులో రాజీ ఒప్పందానికి సంబంధించిన పత్రాలు సమర్పించినట్లు సమాచారం. అయితే, ఈ నిర్ణయంపై జాహ్నవి కుటుంబం తరఫున న్యాయవాది నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కర్నూలు నుంచి అమెరికా వరకు జాహ్నవి ప్రయాణం
Image Credit : X-Indian Tech & Infra

కర్నూలు నుంచి అమెరికా వరకు జాహ్నవి ప్రయాణం

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి కందుల (23) ఉన్నత విద్యపై పెద్ద కలలతో 2021లో అమెరికాకు వెళ్లింది. సియాటెల్‌లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్స్ కోసం చేరింది. కోటి ఆశ‌ల‌తో అమెరికాకు వెళ్లిన జాహ్న‌వి జీవితం ఒక్క దుర్ఘటనతో ఒక్క‌సారిగా త‌ల‌కిందులు అయ్యింది.

35
ప్రమాదం ఎలా జరిగింది?
Image Credit : Asianet News

ప్రమాదం ఎలా జరిగింది?

2023 జనవరి 23 రాత్రి సౌత్‌లేక్ యూనియన్ ప్రాంతంలో జాహ్నవి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. అధికారిక సమాచారం ప్రకారం, ప్రమాదం జరిగిన ప్రాంతం గంటకు 40 కిలోమీటర్ల పరిమితి ఉన్న జోన్. అయితే వాహనం నడిపిన పోలీసు అధికారి కెవిన్ డవే దాదాపు 119 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఢీకొట్టిన ప్రభావంతో జాహ్నవి సుమారు 100 అడుగుల దూరం ఎగిరిపడింది. అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. ఈ వేగం, నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం తీవ్ర రూపం దాల్చినట్లు కేసు దర్యాప్తు వివరాలు సూచించాయి.

45
వివాదానికి కారణమైన బాడీ కెమెరా వ్యాఖ్యలు
Image Credit : Twitter

వివాదానికి కారణమైన బాడీ కెమెరా వ్యాఖ్యలు

ప్రమాదం తర్వాత మరో పోలీసు అధికారి డేనియల్ ఆడరర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున విమర్శలకు దారితీశాయి. బాడీ కెమెరాలో రికార్డైన ఆడియోలో జాహ్నవి మరణాన్ని తేలికగా తీసుకుంటూ, “ఆమె సాధారణ వ్యక్తి మాత్రమే” అన్నట్లు వ్యాఖ్యానించినట్టు బయటపడింది. ఈ వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున‌ ఆగ్రహం వ్యక్తమైంది. అమెరికాలో కూడా పౌరహక్కుల సంఘాలు పోలీసుల ప్రవర్తనపై ప్రశ్నలు లేవనెత్తాయి. విమర్శల నేపథ్యంలో సంబంధిత అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారం కేసుకు అంతర్జాతీయ ప్రాధాన్యం తెచ్చింది.

55
చట్టపరమైన పోరాటం – ఇప్పుడు పరిహార ఒప్పందం
Image Credit : X

చట్టపరమైన పోరాటం – ఇప్పుడు పరిహార ఒప్పందం

జాహ్నవి కుటుంబం న్యాయం కోసం సివిల్ కేసు దాఖలు చేసింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వాదించింది. రెండేళ్లపాటు సాగిన న్యాయ ప్రక్రియ తర్వాత సియాటెల్ సిటీ రాజీకి రావడం గమనార్హం. 29 మిలియన్ డాలర్ల పరిహారం అమెరికా చరిత్రలో ఇలాంటి కేసుల్లో గణనీయమైన మొత్తంగా భావిస్తున్నారు. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు; పోలీసు వ్యవస్థలో బాధ్యత, పారదర్శకతపై చర్చకు దారి తీసిన కేసుగా నిలిచింది. జాహ్నవి మృతి ఒక కుటుంబాన్ని మాత్రమే కాదు, విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల భద్రతపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది. ఈ సెటిల్మెంట్ ఆ బాధను పూర్తిగా తీర్చలేకపోయినా, న్యాయ ప్రక్రియలో ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Trump Tariffs: రష్యా ఆయిల్ కొంటే భారత్‌పై 100% టారిఫ్? ట్రంప్ చేతికి డెడ్లీ వెపన్ ఇచ్చిన అమెరికా పార్లమెంట్
Recommended image2
అమెరికాను వ‌ణించిన 9/11 అటాక్‌.. అస‌లా రోజు ఏం జ‌రిగింది? టైమ్ టూ టైమ్ పూర్తి వివ‌రాలు
Recommended image3
Nepal Floods: చుట్టూ సర్వనాశనం.. ఆ పచ్చని ఇల్లు మాత్రం ఎలా నిలబడింది? నేపాల్ వరదల్లో మిరాకిల్!
Related Stories
Recommended image1
IRCTC: బిజీ లైఫ్‌కి కాస్త బ్రేక్ ఇవ్వండి బాస్‌.. త‌క్కువ ధ‌ర‌లో థాయ్‌లాండ్ టూర్‌, లైఫ్ టైమ్ మెమోరీస్ ఖాయం
Recommended image2
ఎయిర్ పోర్టులో అనుమానంగా క‌నిపించిన ప్ర‌యాణికుడు.. డ్రాయ‌ర్ విప్పి చూసిన అధికారుల ఫ్యూజులు అవుట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved