Aliens: 2026లో గ్రహాంతరవాసులు భూమిపైకి రానున్నారా.? వైరల్ అవుతోన్న వార్తలు
Aliens: గ్రహాంతరవాసులు.. ఈ పేరు వినగానే ఎక్కడలేని ఆసక్తి వస్తుంది. ఈ విశ్వంలో మనం ఒంటరి వాళ్లం కాదని, ఏదో గ్రహంపై జీవం ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. 2026లో తొలిసారి ఏలియన్ మనల్ని పలకరించబోతున్నారన్న వార్తలు జోరందుకున్నాయి.

2026పై బాబా వంగా భవిష్యవాణులు మళ్లీ వైరల్
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జ్యోతిష్కురాలు బాబా వంగా చేసిన భవిష్యవాణులు మరోసారి చర్చకు వచ్చాయి. ముఖ్యంగా 2026లో భూమిపై ఎలియన్లు కనిపిస్తారా? UFOలు ప్రత్యక్షమవుతాయా? అనే అంశాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ధూమకేతువులకు సంబంధించిన వార్తలు కూడా ప్రజల్లో ఆసక్తితో పాటు భయాన్ని కూడా పెంచుతున్నాయి.
ఎలియన్లపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందా?
ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద ప్రెడిక్షన్ మార్కెట్‌గా పేరున్న పాలీమార్కెట్ ఒక అంచనా వేసింది. 2026లో ఎలియన్ల ఉనికిపై అధికారికంగా అంగీకారం వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. అయితే దీని సంభావ్యత కేవలం 12 శాతమేనని తెలిపింది. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇప్పటికే UFOలు, ఎలియన్లపై సమాచారం ఇచ్చారని, త్వరలోనే దీనికి సంబంధించిన ఫైళ్లు, రిపోర్టులు బహిర్గతం కావచ్చని కూడా ప్రచారం జరుగుతోంది.
UFO డాక్యుమెంట్లపై పెరిగిన నమ్మకం
ఇంటర్నెట్‌లో లభ్యమవుతున్న సమాచారం ప్రకారం, డిసెంబర్ 7న ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో UFOలకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందన్న అంచనాతో ప్రజల్లో నమ్మకం ఒక్కసారిగా పెరిగింది. మొదట ఈ విషయం నిజమయ్యే అవకాశం సింగిల్ డిజిట్‌లో ఉండగా, కొద్దిసేపట్లోనే అది 70 శాతం దాటింది. ప్రభుత్వం క్లాసిఫై చేసిన UFO డాక్యుమెంట్లు, వీడియోలు లేదా రిపోర్టులు అధికారికంగా విడుదల చేస్తేనే ఈ అంచనాను సరైనదిగా పరిగణిస్తారు. పుకార్లు లేదా లీకులు ఇందులో లెక్కలోకి రావు.
3I/ATLAS ధూమకేతువు…
2025 మధ్యలో ఎలియన్లు, UFOలపై చర్చలు మరింత ఊపందుకున్నాయి. ముఖ్యంగా జూలై నెలలో 3I/ATLAS అనే అంతరిక్ష వస్తువును గుర్తించిన తర్వాత ఈ చర్చలు పెరిగాయి. కొందరు దీన్ని ఎలియన్ మదర్‌షిప్‌గా భావించారు. భూమిపై ప్రోబ్స్ పంపే అంతరిక్ష నౌక అని ఊహించారు. కానీ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహా ఇతర ఖగోళ శాస్త్రవేత్తలు ఇది సాధారణ ధూమకేతువే అని స్పష్టం చేశారు.
నవంబర్ 2026లో భారీ స్పేస్‌క్రాఫ్ట్ కనిపిస్తుందా?
బాబా వంగా భవిస్య వాణిలో గ్రహాంతరవాసులకు సంబంధించి కీలక ప్రకటన చేసినట్లు చెబుతారు. 2026 నవంబర్‌లో భూమిపై ఒక భారీ స్పేస్‌క్రాఫ్ట్ కనిపిస్తుందని, అది ఎలియన్లు–మనుషుల మధ్య మొదటి అధికారిక కలయికగా మారుతుందని వారు విశ్వసిస్తున్నారు. దీంతో పాటు 2026లో ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు, భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు కూడా చోటుచేసుకోవచ్చని బాబా వంగా హెచ్చరించినట్లు ప్రచారం సాగుతోంది.

