Independence Day: మనకంటే ఒక రోజు ముందు పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే సంబరాలు.. అసలు కారణం ఏంటంటే?
Independence Day: స్వతంత్రం సంపాదించి 75 సంవత్సరాలు నిండాయి. అయినా మనలో చాలామందికి ఎందుకు పాకిస్తాన్ మన కన్నా ఒక రోజు ముందు ఇండిపెండెన్స్ డే జరుపుకుంటుందో తెలియదు. మరీ ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
1947వ సంవత్సరం ఆగస్టు 15న భారతదేశ బ్రిటిష్ పాలన నుంచి పూర్తిగా విముక్తి పొందింది అందుకే ఆగస్టు 15న మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. స్వతంత్రం వచ్చే సమయానికి రెండు దేశాలు కలిసే ఉన్నాయి కదా అలాంటిది పాకిస్తాన్ మన కంటే ఒక రోజు ముందు వేడుకలు ఎందుకు నిర్వహిస్తుందో అని చాలామందికి తెలియదు.
దాని వెనుక ఉన్న కారణం ఇప్పుడు చూద్దాం. భారత కాలమానం పాకిస్తాన్ కాలమానం కంటే 30 నిమిషాల ముందు ఉంటుంది ఇండియా 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకి స్వతంత్ర దేశంగా అవతరించింది కాలమానం ప్రకారం చూస్తే పాకిస్తాన్లో అప్పుడు కాలమానం ప్రకారం ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి 11:30 నిమిషాలు అయింది.
a
అది కాకుండా ఆరోజు అర్ధరాత్రి రంజాన్ 27వ రోజుతో సమానంగా ఉందని అక్కడి ముస్లింలు వాదించారు ఇది పవిత్ర మాసంలో పవిత్రమైన రోజుగా వారు భావిస్తారు. అందుకే పాకిస్తాన్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఆగస్టు 14న జరుపుకుంటారు. మరో కథనం ప్రకారం బ్రిటిష్.. భారత చివరి వైస్రాయ్ భారత దేశ మొదటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ మౌంట్ బాటన్ పాకిస్తాన్ పరిపాలన అధికారాన్ని మహమ్మదాలీ జిన్నాకి ఆగస్టు 14, 1947న కరాచీలో బదిలీ చేశారు.
ఇండియా పాకిస్తాన్ స్వతంత్ర దేశాలుగా మారే తేదీ ఆగస్టు 15 కాగా తనకు ఆగస్టు 14న అధికార మార్పిడి జరిగిన రోజు.పాకిస్తాన్ ఆ రోజునే స్వతంత్ర దినోత్సవం గా స్వీకరించింది. అంతేకాకుండా 1948 జూన్ లో పాకిస్తాన్ మొదటి ప్రధాని.. లియాకత్ అలీ ఖాన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో భారతదేశానికంటే ముందే పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించారు అప్పటినుంచి పాకిస్తాన్ ఆగస్టు 14న వేడుకలు జరుపుకుంటుంది.