- Home
- Districts News
- Hyderabad
- Hyderabad: లక్కీ ఛాన్స్ అంటే ఇదే.. కేవలం రూ. 99కే.. హైదరాబాద్ టు విజయవాడ..
Hyderabad: లక్కీ ఛాన్స్ అంటే ఇదే.. కేవలం రూ. 99కే.. హైదరాబాద్ టు విజయవాడ..
హైదరాబాద్ నుంచి విజయవాడకు బస్సులో ప్రయాణించాలంటే కనీసం రూ. 500 అయినా చెల్లించాల్సిందే అదే ప్రైవేట్ బస్సు అయితే రూ. 100 కామన్. కానీ కేవలం రూ. 99కే విజయవాడ వెళ్తే ఎలా ఉంటుంది.? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇంతకీ ఈ సేవలు పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
- FB
- TW
- Linkdin
Follow Us
)
Hyderab to vijayawad with rs 99 ticket
ఫ్లిక్స్ అనే అంతర్జాతీయ బస్సు సేవల సంస్థ ప్రస్తుతం భారత్‌లో తన సేవలను ప్రారంభించింది. ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురాగా తాజాగా తెలంగాణలోనూ బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఎలక్ట్రిక్ బస్సు సేవలను అందించే ఈ సంస్థ గురువారం సేవలను తెలంగాణలో ప్రారంభించింది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ప్రారంభించారు.
ఫ్లిక్స్ బస్సు సంస్థ ప్రతినిధులతో మంత్రి పొన్మం ప్రభాకర్
తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇక ఈ బస్సుల విషయానికొస్తే ఇందులో 49 మంది ప్రయాణించే సదుపాయం ఉంటుంది. అన్ని రకాల అధునాతన ఫీచర్లు, భద్రతా ఏర్పాట్లు ఈ బస్సు సొంతం. ఈ బస్సులో కేవలం 5 గంటల్లోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లొచ్చని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రస్తుతం కేవలం సీటింగ్ మాత్రమే అందుబాటులో ఉండగా త్వరలోనే స్లీపర్ కోచ్ బస్సులను కూడా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కాగా తెలంగాణ ప్రభుత్వం ప్రయాణికులకు అందిస్తున్న రాయితీలు తమ బస్సుల్లో వర్తిస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. మరి కళ్యాణ లక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుందా అన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడకు సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్న సంస్థ త్వరగానే విజయవాడ-విశాఖ మధ్య బస్సుల్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Flix company
రూ. 99కే..
ఇదిలా ఉంటే లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ఫ్లిక్స్ కంపెనీ ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్‌ను అందిస్తోంది. పూర్తి స్థాయిలో సేవలు ప్రారంభమైన తర్వాత నాలుగు వారాల పాటు కేవలం రూ. 99కే హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణించే అవకాశం కల్పించనున్నారు. అయితే కేవలం నెల రోజుల పాటు మాత్రమే ఈ అవకాశం ఉండనుంది. ఆ తర్వాత సాధారణ ఛార్జీలు ఎంత ఉంటాయన్నది ప్రకటిస్తారు.
ఫ్లిక్స్ బస్ గురించి..
జర్మనీకి చెందిన ఫ్లిక్స్‌బస్ అంతర్జాతీయ బస్సు రవాణా సంస్థ. ఇది యూరప్, అమెరికా వంటి ఖండాల్లో విస్తృతంగా సేవలను అందిస్తోంది. ఇటీవల భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సంస్థ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌తో పాటు ఉత్తరాన పలు మెట్రో నగరాల్లో సర్వీసులను ప్రారంభించింది. ఫ్లిక్స్ బస్సుల్లో విశాలమైన సీట్లతో పాటు, ఉచిత వై-ఫై, పవర్ అవుట్‌లెట్ వంటి సౌకర్యాలను అందిస్తుంది. పర్యావరహిత ప్రయాణ సాధనంగా ఈ బస్సులను తీసుకొచ్చారు. భారతదేశంలో ఫ్లిక్స్‌బస్ తన సేవలను విస్తరించేందుకు స్థానిక భాగస్వాములతో కలిసి పనిచేస్తోంది. ఈ బస్సు టికెట్లను ఫ్లిక్స్ సంస్థ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.