MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Health
  • దోమల వల్ల ఎన్ని వ్యాధులొస్తాయో తెలుసా?

దోమల వల్ల ఎన్ని వ్యాధులొస్తాయో తెలుసా?

వానాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. దోమలు కుట్టడం వల్ల ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అనారోగ్య సమస్యలొచ్చే ప్రమాదం ఉంది తెలుసా? అందుకే దోమలు  ఇంట్లోకి రాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. 

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Aug 20 2023, 10:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

దోమల వల్ల కలిగే ప్రమాదాలు, దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా ఆగస్టు 20న ప్రపంచ దోమల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మలేరియా, డెంగ్యూలతో పాటుగా దోమలు ఎన్నో ఇతర వ్యాధుల బారిన కూడా పడేస్తాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేస్తున్నాయి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Malaria

Malaria

మలేరియా

ఏటా లక్షలాది మందిని ప్రభావితం చేసే.. దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల్లో మలేరియా ఒకటి. ఇది ప్లాస్మోడియం జాతికి చెందిన ఏకకణ పరాన్నజీవి వల్ల వస్తుంది. ఈ పరాన్నజీవి సాధారణంగా దోమ కాటు ద్వారా మానవులకు వ్యాపిస్తుంది. జ్వరం, చలి, తలనొప్పి, కండరాల నొప్పులు, ఫ్లూ లు మలేరియా లక్షణాలు. కొన్ని సందర్భాల్లో ఇది శ్వాసకోశ సమస్యలు,అవయవ వైఫల్యం వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. దీనికి చికిత్స చేయకపోతే ప్రాణాలు కూడా పోవచ్చు. దీనిని నివారించడానికి బెడ్ నెట్స్, ఇండోర్ స్ప్రేయింగ్, యాంటీ మలేరియా మందులను ఉపయోగించాలి. 
 

38
Image: Freepik

Image: Freepik

డెంగ్యూ

డెంగ్యూను ఈడిస్ దోమ కాటు వల్ల వస్తుంది. ఈ దోమ ఎక్కువగా నిర్మాణ ప్రదేశాలు, నీటి ట్యాంకులు, స్విమ్మింగ్ పూల్స్, మొక్కలు, చాలా కాలంగా క్లీన్ చేయకుండా వదిలేసిన చెత్తలో,  వాడకుండా ఉన్న నీటి వనరుల్లో సంతానోత్పత్తి చేస్తుంది. ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులు విపరీతమైన జ్వరం, తీవ్రమైన కండరాల నొప్పి, కళ్లలో అసౌకర్యం, కొన్ని సందర్భాల్లో రక్తస్రావం, జ్వరం లేదా షాక్ సిండ్రోమ్ లు డెంగ్యూ లక్షణాలు. డెంగ్యూ బారిన పడిన వారికి మళ్లీ  తీవ్రమైన డెంగ్యూ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది ప్రాణాంతకం కావొచ్చు.

48
Image: Freepik

Image: Freepik

చికున్ గున్యా

చికున్ గున్యా వైరస్ ను ఈడిస్ ఈజిప్టి దోమలు మనకు వ్యాపింపజేస్తాయి. జ్వరం, కీళ్ల అసౌకర్యం, వాపు, కండరాల నొప్పి, తలనొప్పి, దద్దుర్లు చికున్ గున్యా లక్షణాలు. చికెన్ గున్యా సోకిన వ్యక్తి వారం రోజుల్లోనే కోలుకుంటారని, కానీ అరుదుగా ప్రాణాంతకంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. కీళ్ల అసౌకర్యం నెలలు లేదా సంవత్సరాలు కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 
 

58

జికా వైరస్

ఈడిస్ దోమల ద్వారా వ్యాప్తి చెందే జికా వైరస్ పుట్టుకతో వచ్చే లోపాలు, నాడీ సంబంధిత రుగ్మతలు వంటి దుష్ప్రభావాలను కలిగిస్తుంది. కాబట్టి గర్భిణులు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.  ఇది జ్వరం, తలనొప్పి, దద్దుర్లు, కీళ్ల నొప్పులు, ఎర్రని కళ్లు వంటి డెంగ్యూ మాదిరిగానే లక్షణాలను కలిగిస్తుంది. దీనిని నివారించడానికి కీటక వికర్షకాలను ఉపయోగించాలి. నిండుగా దుస్తులను వేసుకోవాలి. దోమలు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. 

68
Yellow fever

Yellow fever

ఎల్లో ఫీవర్

ఎల్లో ఫీవర్ అనేది ఈడిస్ దోమ ద్వారా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్. తేలికపాటి జ్వరం, చలి, ఆకలి లేకపోవడం, వికారం, వెన్నునొప్పి, తలనొప్పి, అలసట నుంచి తీవ్రమైన కామెర్లు, అంతర్గత రక్తస్రావం వంటివి ఎల్లో ఫీవర్ లక్షణాలు. ఎల్లో ఫీవర్ ఉన్న రోగుల పరిస్థితి సాధారణంగా ఐదు రోజుల్లో మెరుగుపడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 30,000 మంది ప్రాణాలను తీస్తోంది. కానీ ఎల్లో ఫీవర్ ఇండియాలో రాదు.

78
West Nile Virus

West Nile Virus

వెస్ట్ నైల్ వైరస్

సోకిన క్యూలెక్స్ దోమల కాటు ద్వారా వ్యాపించే వెస్ట్ నైల్ వైరస్ తేలికపాటి జ్వరం నుంచి తీవ్రమైన నాడీ సమస్యల వరకు అనేక రకాల లక్షణాలను కలిగిస్తుంది. చాలా కేసులు తేలికపాటివి. అయితే వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులకు తీవ్రమైన సమస్యలు వస్తాయి. 

88
japanese encephalitis

japanese encephalitis

జపనీస్ ఎన్సెఫాలిటిస్

జపనీస్ ఎన్సెఫాలిటిస్ అనేది వైరల్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్. ఇది క్యూలెక్స్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. చాలా కేసులు తేలికపాటివి లేదా లక్షణాలు లేనివిగా ఉంటాయి. అయితే తీవ్రమైన కేసులు మెదడు వాపునకు దారితీస్తాయి. కోమా లేదా మరణం కూడా రావొచ్చు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved