MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Health
  • కొబ్బరి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా?

కొబ్బరి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా?

మన చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచడానికి సహజ కొబ్బరి నూనెకు మించిన మంచి పరిష్కారం లేనేలేదు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 02 2023, 02:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

నేడు ప్రపంచ కొబ్బరి దినోత్సవం. ఈ రోజును ఆసియా పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ జరుపుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా కొబ్బరి రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే ఈ దినోత్సవం లక్ష్యం. కొబ్బరి ప్రయోజనాలను అర్థం తెలుసుకోవడానికి, దీనిపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతదేశంలో కొబ్బరిని తమిళనాడు, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఎక్కువగా పండిస్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
coconut

coconut

కొబ్బరి వల్ల కలిగే ప్రయోజనాలు

కొబ్బరిలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరంలో విటమిన్ డి,  విటమిన్ ఇ, విటమిన్ ఎ , విటమిన్  కె వంటి కొవ్వులో కరిగే విటమిన్లను గ్రహించడానికి సహాయపడుతుంది. కొబ్బరి నుంచి ఉత్పత్తి చేయబడిన కొబ్బరి నూనె వైద్యం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో సంతృప్త కొవ్వులు కూడా ఉంటాయి.
 

38

కొబ్బరి నూనెలో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడటమే కాకుండా మన జీవక్రియను కూడా బాగా పెంచుతుంది. ఇది కడుపులోని భాగాలలో పేరుకుపోయే అవకాశం ఉన్న కొవ్వులను శక్తిగా మారుస్తుంది.
 

48

కొబ్బరి రుచిగా మాత్రమే కాదు మన శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అన్నీ కొబ్బరిలో పుష్కలంగా ఉంటాయి. మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి ఎలక్ట్రోలైట్లను ఖచ్చితంగా తీసుకోవాలి. ఏ ఇతర రకాల పానీయాలతో పోల్చినా కొబ్బరి నీరు అందించేన్ని ఎలక్ట్రోలైట్లను ఏదీ అందించదని నిపుణులు చెబుతున్నారు. 
 

58
Image: Freepik

Image: Freepik

మన చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచడానికి సహజ కొబ్బరి నూనెను మించిన మంచి పరిష్కారం లేదు. అవును దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది అకాల వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది.
 

68
Image: Getty

Image: Getty

ఇది మన ఇమ్యూనిటీని పెంచడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి కొబ్బరి నూనెను వంట నూనెగా కూడా ఉపయోగించొచ్చు. అలాగే కొబ్బరినీళ్లు తాగడం, కొబ్బరికాయలు తినడం ఇవన్నీ ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
 

78
Image: Getty

Image: Getty

కొబ్బరిలో లారిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది శరీరంలోకి శోషించబడినప్పుడు మోనోలౌరిన్ అనే పదార్థం ఏర్పడుతుంది. ఈ పదార్థాలు శిలీంధ్రాలు, వైరస్లు, బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పనిచేస్తాయి.
 

88
Coconut

Coconut

కొబ్బరిలో ఉండే పోషకాలు ఎముకల అభివృద్ధికి అవసరమైన మాంగనీస్, కాల్షియంను గ్రహించే మీ శరీర సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి కొబ్బరి కొంతవరకు సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved