ఎయిడ్స్ వచ్చిందని ఎలా తెలుస్తుంది?
World AIDS Day 2023: ప్రతి ఏడాది డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజును జరుపుకోవడానికి ముఖ్య కారణం.. ఎయిడ్స్ గురించి ప్రజలకు సరైన అవగాహన కల్పించడం. దీని బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం.
World AIDS Day 2023: లైంగిక సంక్రమణ వ్యాధి అయిన ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున ఎయిడ్స్ రాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేసే ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించడానికి చేయబడిన అంతర్జాతీయ కార్యక్రమం, 1988న డిసెంబర్ 1న మొట్టమొదటి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ రోజును జరుపుకుంటున్నారు.
ఎయిడ్స్ అంటే ఏంటి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. హ్యూమన్ ఇమ్యూనో డెఫీషియెన్సీ వైరస్ అనేది శరీరం రోగనిరోధక వ్యవస్థపై దాడి చేసే సంక్రమణ. అక్వైర్డ్ ఇమ్యూనో డెఫీషియెన్సీ సిండ్రోమ్ వ్యాధి అత్యంత అధునాతన దశ. హెచ్ఐవీ శరీరం తెల్ల రక్తకణాలనే లక్ష్యంగా చేసుకుని వాటిపై దాడిచేస్తుంది. దీంతో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో క్షయ, కొన్ని రకాల క్యాన్సర్లు, ఇన్ఫెక్షన్లు వంటి వ్యాధుల బారిన పడతారు.
హెచ్ఐవీ ఎయిడ్స్ ఎలా వ్యాపిస్తుంది?
హెచ్ఐవీ సోకిన వ్యక్తి శరీర ద్రవాల నుంచి ఇది వ్యాపిస్తుంది. అంటే రక్తం, వీర్యం, తల్లిపాలు, యోని ద్రవాల ద్వారా ఇది వ్యాపిస్తుంది. అయితే మనలో చాలా మంది ముద్దు పెట్టుకున్నా.. ముట్టుకున్నా ఇది వ్యాపిస్తుందని అనుకుంటూ ఉంటారు. కానీ దీనిలో ఇంతకూడా నిజం లేదు. ఎయిడ్స్ ముద్దులు పెట్టుకుంటే.. కౌగిలించుకుంటే.. లేదా ఫుడ్ ను పంచుకుంటే వ్యాపించదు.
హెచ్ఐవీ లక్షణాలు
వెబ్ఎండీ ప్రకారం.. చాలా మందికి హెచ్ఐవీ సోకినప్పుడే తెలియదు. కానీ వీళ్లకు వైరస్ సోకిన 2 నుంచి 4 వారాల్లో లక్షణాలు కనిస్తాయి. రోగనిరోధక వ్యవస్థ ఈ వైరస్ తో పోరాడటం వల్ల ఈ లక్షణాలు కనిస్తాయి. దీనిని అక్యూట్ రెట్రోవైరల్ సిండ్రోమ్ లేదా ప్రాథమిక హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ అంటారు. తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట, గొంతునొప్పి, దురద లేని ఎర్రని దద్దుర్లు, వాపు శోషరస కణుపులు జ్వరం, నోరు, అన్నవాహిక, మెడపై, పాయువు లేదా జననేంద్రియాల్లో పుండ్లు హెచ్ఐవీ ప్రారంభ సంకేతాలు లేదా లక్షణాలు.