30 ఏండ్లు దాటిన తర్వాత ఆడవాళ్లు ఖచ్చితంగా తినాల్సిన ఆహారాలు ఇవి
ఆడవారి శరీరం ప్రతి దశలో ఎన్నో మార్పులకు లోనవుతుంది. వీరికి వయసు పెరుగుతున్న కొద్దీ ఎన్నో పోషకాలు అవసరమవుతాయి. సరిపడా పోషకాలను తీసుకోకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.

women health
30 ఏండ్లు దాటిన మన ఆరోగ్యం మెల్లమెల్లగా దెబ్బతింటూ ఉంటుంది. ఇలాంటి సమయంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 30 ఏండ్లు దాటిని మహిళలు. వయసు పెరిగే కొద్దీ మహిళల్లో ఎముకలు అరుగుదల వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి.
మనం మన జీవనశైలిని అంటే తినే ఆహారం, వ్యాయామం, నిద్ర, విశ్రాంతి, ఒత్తిడి వంటి ప్రాథమిక కారకాలను ఆరోగ్యంగా ఉంచుకుంటే మనం చాలా వరకు ఎన్నో వ్యాధుల నుంచి బయటపడొచ్చు. అయితే 30 ఏండ్ల తర్వాత మహిళల్లో కనిపించే ఎముకల నష్టాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఆకుకూరలు
ఆకుకూరలు తినడం వల్ల మన శరీరానికి క్యాల్షియం అందుతుంది. ఈ కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది. బచ్చలికూరలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ముల్లంగిని కూడా తినొచ్చు. వీటితో పాటు మెంతికూర, ఆవాల ఆకులను కూడా తినొచ్చు.
చిక్కుళ్లు
చిక్కుళ్లు 30 ఏండ్లున్న మహిళలు వారి ఆహారంలో చేర్చవలసిన మరొక పోషకాహారం చిక్కుళ్లు. శనగలు, పప్పు, పెసరపప్పు వంటి అన్ని రకాల పప్పులను తినొచ్చు. చిక్కుళ్లలో ప్రోటీన్లు, కాల్షియం, ఫైబర్, ఐరన్ వీటివి పుష్కలంగా ఉంటాయి.
గింజలు, విత్తనాలు
గింజలు, విత్తనాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. వాస్తవానికి ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడతాయి. ఇందుకోసం బాదం, అవిసె గింజలు, వాల్ నట్స్ వంటి అన్ని గింజలను, విత్తనాలను తినాలి. వీటిలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి.