టీ తాగే ముందు నీళ్లు ఎందుకు తాగాలి? తాగకపోతే ఏమవుతుందో తెలుసా?
Health Tips: మనలో చాలామందికి ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఖాళీ కడుపుతో టీ తాగడం మంచిదేనా? టీ తాగే ముందు నీళ్లు ఎందుకు తాగాలి? తాగకపోతే ఏమవుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

పరగడుపున టీ తాగితే ఏమవుతుంది?
టీ ని చాలామంది ఇష్టంగా తాగుతారు. రోజుకు నాలుగైదు సార్లు టీ తాగేవాళ్లు కూడా లేకపోలేదు. కొందరికి ఉదయం లేవగానే టీ తాగకపోతే ఏమి తోచదు. కానీ పరగడుపున టీ తాగడం మంచిదేనా? దానివల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? టీ తాగేముందు వాటర్ ఎందుకు తాగాలి? తాగకపోవడం వల్ల కలిగే ఇబ్బందులేంటి? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.
టీ తాగేముందు వాటర్ ఎందుకు తాగాలి?
ఉదయం లేవగానే పళ్లు తోముకున్న తర్వాత మొదట చేయాల్సిన పని నీళ్లు తాగడం. నీళ్లు తాగిన తర్వాతే టీ తాగాలి. పరగడుపున టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. అసిడిటి సహా అనేక సమస్యలు వస్తాయి. టీలోని కెఫిన్, టానిన్ వంటి ఆమ్లాలు కడుపులో ఆమ్లత్వాన్ని పెంచుతాయి. కాబట్టి రోజూ ఉదయం టీ తాగే ముందు తప్పకుండా నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
కొబ్బరి నీళ్లు..
టీ తాగేముందు కొబ్బరి నీళ్లు కూడా తాగొచ్చు. ఇది కడుపులోని యాసిడ్‌ను పలుచన చేస్తుంది. దానివల్ల టీ లోని కెఫిన్ ప్రభావం తగ్గుతుంది. కడుపులో మంట ఉండదు. అయితే కొబ్బరి నీళ్లు తాగి టీ తాగడం వల్ల అసిడిటీ పూర్తిగా తగ్గుతుందని చెప్పలేం. కానీ ఆ సమస్యను చాలా వరకు తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గోరువెచ్చని నీళ్లు
టీ తాగే ముందు గోరువెచ్చని నీళ్లు కూడా తాగవచ్చు. దీనివల్ల కడుపులో యాసిడ్-బేస్ బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుంది. పరగడుపున టీ తాగకుండా, తేలికపాటి అల్పాహారం లేదా కొన్ని పండ్లు తినవచ్చు. ఉదయం టిఫిన్ చేశాక టీ తాగొచ్చు. కొందరికి ఇవన్నీ చేసినా అసిడిటీ సమస్య ఉండవచ్చు. వారు పాల టీకి బదులుగా హెర్బల్ టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ తాగవచ్చు. పాలలోని లాక్టిక్ యాసిడ్.. అసిడిటీ సమస్యను పెంచవచ్చు. అయితే అసిడిటీని నివారించడానికి టీ తాగే ముందు నీళ్లు మాత్రమే తాగితే సరిపోదు. నూనె పదార్థాలు, కారం లేదా జంక్ ఫుడ్స్ తినడం కూడా తగ్గించడం మంచిది.