తిన్న వెంటనే నిద్ర మత్తుగా అనిపిస్తోందా?
చాలా మందికి తిన్న వెంటనే నిద్రమత్తుగా అనిపిస్తుంది. బద్దకంగా ఉంటుంది. ఇది మీరు తినే ఆహారానికి సంబంధించిందని నిపుణులు చెబుతున్నారు.
భోజనం చేసిన వెంటనే చాలా మందికి నిద్రముచ్చుకొస్తుంది. ఇలాంటి వారు కొద్దిసేపైనా చిన్న కునుకు తీస్తారు. అయితే పని ఎక్కువ సేపు చేయడం వల్ల శరీరం బాగా అలసిపోతుంది. దీనివల్ల చేస్తున్న పనిపై ఇంట్రెస్ట్ పెట్టలేక బద్దకంగా మారిపోతారు. అయితే తిన్న తర్వాత అనిపించే బద్దకం మనం తినే ఆహారం, మనస్సు రెండింటికీ సంబంధించినదని నిపుణులు అంటున్నారు. తిన్న తర్వాత నిద్రమత్తుగా అనిపించడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
lazy
తిన్న తర్వాత శరీరంలో సెరోటోనిన్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. ఇది మీ మెదడుపై ప్రభావం చూపుతుంది. ఇది మీ మానసిక స్థితి, నిద్ర రెండింటినీ ప్రభావితం చేస్తుంది. నిజానికి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ట్రిప్టోఫాన్ పెరుగుతుంది. దీనివల్ల తిన్న వెంటనే మీకు నిద్రమత్తుగా అనిపిస్తుంది.
నిద్ర అలవాట్లు
ఆఫీసు పనులు ఇతర కారణాల వల్ల లేట్ గా నిద్రపోయేవారు కూడా ఉన్నారు. దీనివల్ల వీళ్లకు నిద్రసరిపోతు. ఇది వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మీరు కంటినిండా నిద్రపోనప్పుడు.. ఈ ప్రభావం మీ ఆరోగ్యంతో పాటుగా మీరు చేసే పనిపై కూడా పడుతుంది. అందుకే మీరు రాత్రిపూట తొందరగా పడుకుని ఉదయం తొందరగా లేవాలి. సమయం ప్రకారం ఈ పనులు చేస్తే ఇలాంటి సమస్య రాదు.
ఆహారం
కొన్ని రకాల ఆహారాలను తినడం వల్ల కూడా బద్దకంగా, నిద్ర మత్తుగా అనిపిస్తుంది. నిజానికి ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం గుడ్లు, జున్ను, మాంసం, చేపలు, సోయా బీన్స్ లో ఉంటుంది. ఇది మీ శరీరంలో సెరోటోనిన్ హార్మోన్ ను రిలీజ్ చేస్తుంది. ఇది నిద్రను కలిగిస్తుంది.
అతిగా తినడం
అతిగా తినడం వల్ల కూడా బద్దకంగా, నిద్రమత్తుగా ఉంటుంది. ఎక్కువ ఆహారం జీర్ణం కావడానికి జీర్ణవ్యవస్థకు రక్త సరఫరా పెరుగుతుంది. ఇది మెదడును ప్రభావితం చేస్తుంది. అలాగే దీనివల్ల మీరు అలసిపోయినట్టుగా అనిపిస్తుంది.
శారీరక శ్రమ లేకపోవడం
మన ఆరోగ్యానికి శారీరక శ్రమ చాలా చాలా అవసరం. మీరు రోజులో కొద్దిసేపు కూడా శారీరక శ్రమ చేయకపోతే మీరు బద్దకం, సోమరిగా మారిపోతారు. దీనివల్ల మీరు సకాలంలో మీ పనులను పూర్తి చేయలేరు.
ఈ సమస్య నుంచి బయటపడే మార్గాలు
ఆహారాన్ని చిన్న భాగాలుగా విభజించండి
ఒకేసారి ఎక్కువగా తినడానికి బదులుగా మధ్యాహ్నం కొద్ది కొద్దిగా తినండి. ఇది మీ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అలాగే తరచుగా ఆకలి అయ్యే అవకాశం కూడా తగ్గుతుంది. ఇది మీకు మధ్యాహ్నం పూట నిద్రరాకుండా చేస్తాయి.
వ్యాయామం
సైక్లింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ తో పాటుగా వ్యాయామం లేదా యోగా ను రోజూ చేయండి. వ్యాయాకమం మీ శరీరాన్ని చురుగ్గా, శక్తివంతంగా ఉంచుతుంది. బద్దకం, సోమరితనం కూడా పోతుంది. దీనివల్ల మీరు మీ పనిని ఎంతో ఉత్సాహంగా చేస్తారు కూడా.
ఆరోగ్యకరమైన ఆహారం
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే సీజనల్ కూరగాయలు, పండ్లను మీ రోజువారి ఆహారంలో ఖచ్చితంగా చేర్చాలి. ముఖ్యంగా ఫ్రై చేసిన, కారంగా ఉండే ఆహారాలను తినకూడదు. ఎందుకంటే ఈ ఆహారాలు మీ శక్తి స్థాయిలను తగ్గిస్తాయి.
walking
తిన్న వెంటనే కూర్చోవడం
తిన్న వెంటనే కూర్చుంటే ఊబకాయం, సోమరితనం సమస్యలు వస్తాయి. ఈ సమస్యల బారిన మీరు పడకూడదంటే తిన్న తర్వాత కాసేపు నడకండి. అలాగే స్టాండింగ్ డెస్క్ మీద పనిచేయండి. ఇది మిమ్మల్ని చురుగ్గా ఉంచుతుంది. నిద్ర రాకుండా చేస్తుంది.