Health tips: మగవాళ్లు తక్కువ నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?
ఆరోగ్యమైన శరీరానికి వాటర్ చాలా అవసరం. సరిపడా నీళ్లు తాగితే చాలు సగం రోగాలు తగ్గిపోతాయి. కానీ ఆడవాళ్ల కంటే మగవాళ్లు ఎక్కువ వాటర్ తాగాలట. ఈ విషయం మీకు తెలుసా? మరి ఎందుకు మగవాళ్లు ఎక్కువ వాటర్ తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మనం ఆరోగ్యంగా ఉండాలంటే నీళ్లు తాగడం చాలా ముఖ్యం. ఇది శరీరంలోని ప్రతి అవయవం సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సరిపడా నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఆడవాళ్ల కంటే మగవారు ఎక్కువ నీరు తాగాలని చెబుతున్నారు నిపుణులు. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.
తగినంత నీరు తాగితే?
ప్రతిరోజూ తగినంత నీరు తాగడం వల్ల శరీరానికి అవసరమైన ఆక్సిజన్ లభిస్తుంది. అంతేకాకుండా, అవసరమైన పోషకాలు శరీరంలోని ప్రతి భాగానికి సరిగ్గా అందుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. నీరు తాగడం వల్ల కీళ్ల నొప్పులను కూడా తగ్గించుకోవచ్చు.
ఎందుకు ఎక్కువ నీరు తాగాలి?
ఒక అధ్యయనం ప్రకారం, మగవారు రోజుకు 3.7 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి నీరు మాత్రమే తాగాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా నీటిశాతం అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తినవచ్చు.
నిపుణుల ప్రకారం, రోజూ అవసరమైనంత నీరు తాగడం ద్వారా పురుషుల శరీర ఉష్ణోగ్రత సరిగ్గా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. డీహైడ్రేషన్ లాంటి సమస్యలను తగ్గిస్తుంది.
నిపుణుల ప్రకారం
నిపుణుల ప్రకారం ఆడవాళ్ల కంటే మగవారు ఎక్కువ నీరు తాగాలి. పురుషులకు ఎక్కువ శరీర ద్రవ్యరాశి ఉంటుంది. స్త్రీలకు కొవ్వు ఎక్కువగా ఉంటుంది. కండరాలు కొవ్వు కంటే ఎక్కువ నీటిని నిల్వ చేస్తాయి. అందుకే పురుషులకు ఎక్కువ నీరు అవసరం. అంతేకాకుండా, పురుషులు స్త్రీల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటారు. అందుకే పురుషులు స్త్రీల కంటే ఎక్కువ నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
భిన్న శరీరతత్వం:
నిజానికి స్త్రీ, పురుషుల శరీరం భిన్నంగా ఉంటుంది. అంటే, స్త్రీల శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలు పెరిగినప్పుడు, ప్లాస్మా స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది. కానీ పురుషులకు ఈ పరిస్థితి ఉండదు. వారు తమ ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవడానికి తప్పనిసరిగా నీరు తాగాలి.