MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • రాత్రిపూట టైంకి పడుకొని.. ఉదయం 5 గంటలకు నిద్రలేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

రాత్రిపూట టైంకి పడుకొని.. ఉదయం 5 గంటలకు నిద్రలేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ప్రస్తుత లైఫ్ స్టైల్, పని వేళలు ఇతర కారణాలతో మనలో చాలామంది రాత్రిపూట లేటుగా పడుకొని ఉదయం లేటుగా నిద్ర లేస్తుంటారు. కానీ ఈ అలవాటు అస్సలు మంచిది కాదు. రాత్రిపూట టైంకి పడుకొని, ఉదయం 5 గంటలకు నిద్రలేస్తే.. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు తెలుసా?   

1 Min read
Author : Kavitha G
Published : Aug 25 2025, 07:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
త్వరగా పడుకోవడం, నిద్రలేవడం వల్ల కలిగే లాభాలు
Image Credit : Getty

త్వరగా పడుకోవడం, నిద్రలేవడం వల్ల కలిగే లాభాలు

రాత్రిపూట లేటుగా నిద్రపోవడం, ఉదయం లేటుగా నిద్రలేవడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. గంటల కొద్దీ ఫోన్లు, టీవీలు చూడటం.. ఏ రాత్రికో నిద్రపోవడం వల్ల చాలామంది అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. కానీ రాత్రిపూట టైంకి నిద్రపోయి.. వేకువజామున నిద్రలేస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే.. ఇంకెప్పుడు లేటుగా నిద్రపోరు. సమయానికి నిద్ర పోవడం వల్ల కలిగే లాభాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

24
ఆరోగ్యానికి మంచిది
Image Credit : Getty

ఆరోగ్యానికి మంచిది

రాత్రిపూట శరీరం తగినంత విశ్రాంతి తీసుకుంటే.. కార్టిసాల్, గ్రోత్ హార్మోన్ల వంటివి సమతుల్యంగా ఉత్పత్తి అవుతాయి. ఉదయం త్వరగా నిద్ర లేవడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. రోజు మొత్తం ఉత్సాహంగా ఉండడానికి అవకాశం ఉంటుంది.

మానసిక ప్రశాంతత

ఉదయం తొందరగా నిద్రలేవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కాబట్టి.. ఆ సమయంలో ధ్యానం, యోగా, పఠనం వంటివి చేయడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి.

Related Articles

Related image1
ఎప్పుడూ హ్యాపీగా, హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
Related image2
Life Skills: ప్రతి ఒక్కరికీ అవసరమైన టాప్ 10 లైఫ్ స్కిల్స్ ఏంటో తెలుసా?
34
ఉత్పాదకత పెరుగుతుంది
Image Credit : Getty

ఉత్పాదకత పెరుగుతుంది

ఉదయం వేళలో మెదడు చాలా చురుకుగా ఉంటుంది. ఆ సమయంలో చదవడం, పని చేయడం వల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయి. ఒక ప్రణాళిక ప్రకారం చేయడం వల్ల సమయం కూడా వృథా కాకుండా ఉంటుంది.

మెరుగైన నిద్ర  

సమయానికి నిద్రపోవడం, సమయానికి నిద్ర లేవడం వల్ల జీవ గడియారం సరిగ్గా పనిచేస్తుంది. దీనివల్ల నిద్ర సమస్యలు దూరం అవుతాయి. అలసట తగ్గుతుంది. ప్రతి రోజు ఒకే సమయానికి పడుకునే అలవాటు వల్ల నిద్ర నాణ్యత మెరుగవుతుంది.

44
ఆహారాన్ని సమయానికి తీసుకునే అవకాశం
Image Credit : Freepik

ఆహారాన్ని సమయానికి తీసుకునే అవకాశం

వేళకు నిద్ర లేచినవారికి ఎక్కువ సమయం ఉంటుంది. నిదానంగా, సమయానికి బ్రేక్‌ఫాస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. టైంకి ఫుడ్ తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.

రాత్రిపూట త్వరగా నిద్రపోయి.. తెల్లవారుజామున లేచే మంచి అలవాటు మన జీవితాన్ని ఆరోగ్యంగా, సంతోషంగా మారుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఆరోగ్యం
చిట్కాలు మరియు ఉపాయాలు
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Black Coffee: మీ డే బ్లాక్ కాఫీతో మొదలవుతుందా? అయితే ఈ విషయం మీకు తెలుసా?
Recommended image2
Cancer Symptoms: క్యాన్సర్ విషయంలో 5 లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
Recommended image3
Spinach: రోజూ పాలకూర తింటే ఏమవుతుంది?
Related Stories
Recommended image1
ఎప్పుడూ హ్యాపీగా, హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
Recommended image2
Life Skills: ప్రతి ఒక్కరికీ అవసరమైన టాప్ 10 లైఫ్ స్కిల్స్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved