MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Life
  • Health
  • Warm Water: వంద రోగాలకు ఒకటే మందు..పరగడుపున గోరువెచ్చని నీరు తాగితే ఇన్ని లాభాలా!

Warm Water: వంద రోగాలకు ఒకటే మందు..పరగడుపున గోరువెచ్చని నీరు తాగితే ఇన్ని లాభాలా!

Warm Water: డైట్ పేరుతో కడపు మాడ్చుకునే అవసరం లేదు. అలాగే కేవలం డైట్తో ఆరోగ్యంగా ఉంటామనుకోవడం కూడా పొరపాటే. చిన్న మార్పులతో హెల్దీగా, యాక్టివ్‍గా ఉండొచ్చు. అయితే ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీళ్లు తాగితే ఎన్ని లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.  

2 Min read
Author : Nandini Arava
Published : Mar 23 2026, 03:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గోరువెచ్చని నీటి వల్ల శరీరానికి బోల్డెన్ని లాభాలు
Image Credit : Getty

గోరువెచ్చని నీటి వల్ల శరీరానికి బోల్డెన్ని లాభాలు

ఈ భూమ్మీద జీవించే ప్రతి జీవికి గాలి, నీరు, ఆహారం చాలా అవసరం. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా బతకడం కష్టం. అందులో చాలా ముఖ్యమైన భాగం. చాలా మందికి నీరు తాగడమంటే ఓ బద్ధకం. అంతేకాకుండా కొంతమంది చాలా అయిష్టంగా, నామూషీగా ఫీలవుతారు. నీళ్లు తాగితే వాష్ రూంకు వెళ్లాల్సి వస్తుందని అనుకుంటారు. నీరు తాగడం వల్లే మలమూత్రం రూపంలో శరీరంలోని వ్యర్థాలు బయటకెళ్లేది. నీరు తాగడం తగ్గిస్తే ముఖంపై మొటిమలు, డీహైడ్రేషన్, జుట్టు రాలిపోవడం, కళ్లు తిరిగిపడిపోవడం వంటివి జరుగుతుంటుంది. అయితే పరగడుపున తాగే నీటి వల్ల శరీరానికి బోల్డెన్ని లాభాలున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గోరువెచ్చని నీటితో వ్యాధులకు దూరం
Image Credit : Getty

గోరువెచ్చని నీటితో వ్యాధులకు దూరం

ఉదయం నిద్ర లేవగానే గోరువెచ్చని నీరు తాగి మీ రోజును ప్రారంభించాలి. ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నీరు తాగితే శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఒక్క నీరే అనేక వ్యాధుల నుండి కూడా కాపాడుతుంది. జీవితంలో అనేక చిన్న అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా, పెద్ద ప్రయోజనాలను పొందవచ్చు. కేవలం నీరు మాత్రమే ఎన్నో సమస్యలను క్షణాల్లో పరిష్కరిస్తుంది. అయితే నీళ్లు తాగే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. లేకపోతే అది మీ శరీరానికి మంచి బదులు చెడు జరిగే ప్రమాదం ఉంది. నీళ్లు మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉంచుకోవాలి. ఉదయం నిద్రలేవగానే బ్రష్ చేయడానికి ముందైనా, తర్వాతైనా నీళ్లు తాగవచ్చు.

Related Articles

Related image1
RO Water: ఫిల్టర్ నీళ్లు తాగితే కిడ్నీలు పాడ‌వుతాయా.?
Related image2
Water Fasting: వాటర్ ఫాస్టింగ్ అంటే ఏంటి? దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
35
ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
Image Credit : Getty

ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది

ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిని తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇది శరీరంలోని మలినాలను బయటకు పంపడం ద్వారా, లోపలి నుండి శరీరాన్ని శుభ్రపరచడానికి కూడా సహాయపడుతుంది. దీనివల్ల మీరు రోజంతా యాక్టివ్‍గా ఉంటారు.

జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది

చాలా మందికి జీర్ణ సమస్యలు ఉంటాయి. ప్రతిరోజూ గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మీ జీర్ణవ్యవస్థ బలపడి, ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి.

45
బరువు తగ్గడానికి డైట్ అవసరం లేదు..నీరు తాగితే చాలు
Image Credit : Getty

బరువు తగ్గడానికి డైట్ అవసరం లేదు..నీరు తాగితే చాలు

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగడం కూడా బరువు పెరగడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయం పూట నీరు తాగడం వల్ల జీవక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. కేలరీలు వేగంగా ఖర్చవుతాయి, ఆకలి తగ్గుతుంది, దీనివల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది.

మెరిసే చర్మం

ప్రకాశవంతమైన చర్మం కావాలంటే, ప్రతి ఉదయం గోరువెచ్చని నీటిని తాగాలి. ఇది మీ చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది మీ ముఖాన్ని మెరిసేలా కాకుండా, ముడతలు, మొటిమల వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.

55
రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
Image Credit : Getty

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది

ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటి వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, సరైన రక్త ప్రవాహం జరుగుతుంది. అంతేకాకుండా, ఇది శరీరంలోని అన్ని భాగాలకు తగినంత ఆక్సిజన్ సరఫరాను కూడా అందిస్తుంది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Related Stories
Recommended image1
RO Water: ఫిల్టర్ నీళ్లు తాగితే కిడ్నీలు పాడ‌వుతాయా.?
Recommended image2
Water Fasting: వాటర్ ఫాస్టింగ్ అంటే ఏంటి? దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved