- Home
- Life
- Health
- Kids: చిన్నపిల్లలు పగలు పడుకుంటారు, రాత్రుళ్లు ఏడుస్తుంటారు.. దీనికి అసలు కారణం ఏంటో తెలుసా?
Kids: చిన్నపిల్లలు పగలు పడుకుంటారు, రాత్రుళ్లు ఏడుస్తుంటారు.. దీనికి అసలు కారణం ఏంటో తెలుసా?
అప్పుడే పుట్టిన పిల్లల జీవన విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. తొమ్మిది నెలల పాటు తల్లి గర్భంలో ఉండి బయట ప్రపంచంలోకి వచ్చిన చిన్నారి పూర్తిగా కొత్త ప్రపంచంలోకి వస్తుంది. నవజాత శిశువుల్లో వచ్చే ప్రధాన సమస్యల్లో రాత్రుళ్లు ఏడవడం ఒకటి. ఉదయమంతా హాయిగా పడుకొని రాత్రంతా ఏడుస్తుంటారు. అయితే దీనివెనకాల అసలు కారణం ఏంటో తెలుసా.?

నవజాత శిశువులు ఉదయం ఎక్కువసేపు పడుకొని రాత్రుళ్లు ఏడుస్తుంటారు. ఒకవేళ ఏడవకపోయినా రాత్రంతా ఆడుతుంటారు. దీంతో పేరెంట్స్ నైట్ అంతా చిన్నారులతో జాగారం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. రాత్రుళ్లు తరచూ ఆకలి వేయడం, డైపర్ లాంటివి మార్చడం లాంటి వాటితో సరిగ్గా నిద్రపోరు. అయితే ఇలా చిన్నారులు రాత్రుళ్లు ఎందుకు పడుకోరన్నదాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా.? అసలు దీనివెకాల కారణం ఏంటంటే.
గర్భంలో ఉన్న సమయంలో పిల్లలు ఎక్కువ సమయంలో నిద్రలోనే ఉంటారు. ప్రసవం తర్వాత గర్భం నుంచి బయటకు వచ్చిన శిశువుకు కొన్ని నెలల వరకు సరైన నిద్రా విధానం ఏర్పడదు. దీంతో చిన్నారికి పగలు, రాత్రి మధ్య తేడా తెలియదు. అయితే, పిల్లవాడు పెరిగే కొద్దీ, అతను నిద్రపోయే విధానాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. అలాగే చిన్నారి నిద్ర అవసరాలు మారుతాయి. ఈ కారణంగానే నవజాత శిశువు పగటిపూట ఎక్కువ నిద్రపోతుంది. రాత్రిపూట తరచుగా మేల్కొని ఉంటుంది.
మరికొన్ని కారణాలు..
రాత్రుళ్లు తరచూ పాల కోసం నిద్రలేవడం కూడా దీనికి ఒక కారణంగా చెప్పొచ్చు. అలాగే తరచూ ముద్ర విసర్జన చేయడం కూడా నవజాత శిశువుల్లో నిద్రబంగానికి మరో కారణం. రాత్రిపూట చలి, వేడి, చీకటి భయం లాంటివి నిద్రకు ఆటంకం కలిగించవచ్చు. సరిపడ గాలి అందకపోయినా నిద్రకు ఆటంకం కలుగుతుంది. రాత్రుళ్లు దోమలు కూడా చిన్నారుల నిద్రను దూరం చేస్తాయి.
New Born Kidnap Delhi
నిద్ర చాలా ముఖ్యం.
నవజాత శిశువుకు నిద్ర చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు అభివృద్ధిలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ ప్రకారం నవజాత శిశువు నుండి 12 నెలల వయస్సు గల బిడ్డకు సగటున రోజుకు 12 నుంచి 16 గంటల నిద్ర అవసరం. నిద్రలో పిల్లల నాడీ వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. అయితే, పిల్లవాడికి ఒకటి నుండి రెండు సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు అతని నిద్ర విధానం మారుతుంది, ఆ సమయంలో అతనికి రోజుకు 11 నుంచి 14 గంటల నిద్ర అవసరం.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్య సంబంధిత సందేహాల కోసం వైద్యులను సంప్రదించడమే మంచిది.