నానబెట్టిన మామిడిపండ్లతో అందానికి మెరుగులు.. ఇలా..
వేసవి అమృతఫలం మామిడిని ఇష్టపడని వారు ఉండరు. అయితే మామిడి పండ్లు రోజూ తింటే వేడి చేస్తుందనో, లావెక్కుతారనో, మొహం మీద వేడికురుపులు, మొటిమలు వస్తాయన్న భయంతో చాలామంది వీటికి దూరంగా ఉంటుంటారు.

నిజానికి కొంతమందిలో మామిడి పండు మొటిమలు రావడానికి కారణమవుతుంది. దీనికి కారణం దీంట్లో పుష్కలంగా ఉండే ఫైటిక్ ఆమ్లమే. ఇది ఇనుము, జింక్ మరియు కాల్షియంను బలహీనపరిచి, ఖనిజ లోపాలను ప్రోత్సహిస్తుంది. మరెలా.. మామిడిపండు తినడం ఎలా.. అంటే దీంట్లోని ఎక్కువ వేడిని తగ్గించాలి. దీనికోసం తినడానికి అరగంట ముందు మామిడిపండ్లను నీటిలో నానబెట్టాలి.

మన అమ్మమ్మలు, అమ్మలు చేసే సింపుల్ చిట్కా ఇది. కానీ దీంతో ఎన్నో ప్రయోజనాలుంటాయి. దీనివల్ల ఫైటిక్ ఆమ్లం ప్రభావం తగ్గిపోతుంది. పండు వేడి లక్షణం తగ్గుతుంది.

మామిడిపండులోని విటమిన్లు చర్మ సౌందర్యానికి కూడా బాగా పనిచేస్తాయి. దీంట్లోని యాంటీఆక్సిడెంట్లు ముఖానికి సహజమైన కాంతిని తెస్తాయి.
అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా, మచ్చలు లేకుండా ఉండేలా చేస్తాయి.

మామిడిపండ్లను తినడం లేదా ప్యాక్ వేయడం వల్ల చర్మానికి చాలా ప్రయోజనాలున్నాయి. అంతేకాదు మామిడిలోని విటమిన్లు, ఖనిజాలు ఎలా పనిచేస్తాయంటే..

విటమిన్ ఎ - డార్క్ పాచెస్, ఫైన్ లైన్స్ ను రానివ్వదు
విటమిన్ సి - హానికరమైన యువి కిరణాల నుండి ముఖాన్నికాపాడుతుంది, మెరుపునిస్తుంది.
విటమిన్ బి 6 - జిడ్డు లేని చర్మం కోసం
మెగ్నీషియం - మొటిమలు, రోసేసియా నుండి విముక్తికి
పొటాషియం - చర్మాన్ని హైడ్రేట్, తేమగా ఉంచుతుంది
బీటా కెరోటిన్ - చర్మాన్ని బ్యాక్టీరియా, టాక్సిన్స్ లేకుండా కాపాడుతుంది
రాగి - ముఖంమీద ముడతలు, వృద్ధాప్యఛాయలు రాకుండా చేస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది
విటమిన్ కె - స్ట్రెచ్ మార్క్స్ ను తగ్గిస్తుంది

ఆరోగ్యకరమైన చర్మంకోసం మామిడితో చేసే కొన్ని ప్యాక్ లు, చిట్కాలు

మామిడిపండు గుజ్జును మొటిమల మీద 15-20 నిమిషాల పాటు అప్లై చేసి తరువాత గోరు వెచ్చటి నీటితో కడిగేస్తే... చర్మం పింపుల్ ఫ్రీ అవుతుంది.

మామిడి పండు గుజ్జు, 1 టీస్పూన్ తేనె, 2 టీస్పూన్ల మైదాలను బాగా కలిపి.. స్ర్కబ్ తయారు చేసుకోవాలి. ఈ స్క్రబ్‌తో మీ ముఖం మీద వృత్తాకారంగా 20 నిమిషాల పాటు రాయాలి. ఆ తరువాత చల్లటి నీటితో కడగాలి. దీంతో చర్మం తేమ కోల్పోకుండా ఉంటుంది.

ముఖం మీది మచ్చలు పోవాలంటే.. 3 టీస్పూన్ల కలబంద గుజ్జు, 2 టేబుల్ స్పూన్ల పాలపొడి, పావు కప్పు ఎండిన మామిడి కాయల పొడి, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి పేస్టులా తయారు చేసి మొహానికి అప్లై చేయాలి. పది నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగి, మెత్తటి బట్టతో తుడిచేస్తే అద్భుతంగా పనిచేస్తుంది.

టానింగ్ పోగొట్టడానికి కూడా మామిడిపండు బాగా పనిచేస్తుంది. 2 టీస్పూన్ల మామిడి పండు గుజ్జు, 1 టీస్పూన్ పెరుగు, 2 టీస్పూన్ల కలబంద గుజ్జు, 1 టీస్పూన్ తేనె కలిపి మీ స్వంత సన్‌స్క్రీన్ లోషన్ ను తయారుచేసుకోండి.

దీన్ని గాలి చొరబడని కంటైనర్‌లో వేసి, ఫ్రిజ్ లో భద్రపరచండి. దీన్ని బైటికి వెళ్లేప్పుడు చర్మానికి రాసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది.

చివరగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. ఏదైనా మితంగా తిన్నంతవరకు సమస్య ఉండదు. అతిగా తింటే ఎంత మంచిదైనా విషంగా మారుతుంది.