Health Tips: నానబెట్టిన బాదం తింటే కలిగే ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
Health Tips: బాదం మనకి ఆరోగ్యపరంగా ఎంత ఉపయోగపడుతుందో అందరికీ తెలిసిందే. బాదం పప్పుని చాలామంది నానబెట్టుకొని తింటారు. అలా ఎందుకు తింటారు, దాని వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
డ్రై ఫ్రూట్స్ లో బాదంపప్పు ది కీలకపాత్ర అని చెప్పవచ్చు. వీటిలో ముఖ్య పోషక పదార్థాలైన ప్రోటీన్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ లు , ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్ లు, విటమిన్ ఈ, క్యాల్షియం, జింక్,ఫాస్ఫరస్ వంటి ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి. వీటిని నిత్యం తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు అదుపులో ఉంటాయి.
అయితే చాలామంది నానబెట్టిన బాదంపప్పుని తింటూ ఉంటారు. దానివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలుసు కానీ అవి ఏంటో తెలీదు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. రాత్రంతా నానబెట్టిన బాదంపప్పులలో తొక్కుపై ఉన్న విషపదార్థాలను తొలగించి..
ఫైటిక్ యాసిడ్ ని విడుదల చేస్తుంది. ఇది గ్లూటెన్ పదార్థాలను విచ్ఛిన్నం చేస్తుంది. నానబెట్టిన బాదంపప్పులో ప్రోటీన్, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండడంవల్ల గుండె ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలని అదుపులో ఉంచుతుంది.
గుండె జబ్బుల నుంచి మనల్ని కాపాడతాయి. నానబెట్టిన బాదం పప్పులని తినటం వల్ల జీర్ణ క్రియ సులభం అవుతుంది అలాగే నానబెట్టిన తర్వాత పై తొక్కు తీసి తినటం వలన సులువుగా పోషకాలు మొత్తం అందుతాయి. పచ్చి బాదం గోధుమ చర్మంతో పొరలుగా ఉంటుంది.
దీనిలో టానిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది పోషకాలను తీసుకోవడానికి ఆటంకం కలిగిస్తుంది. నానబెట్టిన బాదం తొక్కను తీయడం వల్ల పోషకాలను సులభంగా విడుదల చేస్తుంది. గర్భిణీ స్త్రీలు నిత్యం బాదంపప్పు తినటం అలవాటు చేసుకుంటే తల్లితోపాటు కడుపులో ఉన్న బిడ్డకి కూడా మంచి పోషకాలు అందుతాయి.
వీటిలోని పోలికి ఆసిడ్ పుట్టుకతో వచ్చే లోపాలని నివారించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంతేకాదు నానబెట్టిన బాదంపప్పులో లైపర్స్ అనే ఎంజాయ్ ఉంటుంది. ఇది కొవ్వుని కరిగించడంలో సహాయపడుతుంది. అలాగే నానబెట్టిన బాదంని తొక్కు తీసి తినటం వల్ల తేలికగా జీర్ణం అవుతుంది.