వీళ్లకు ఆవుపాల కంటే బాదం పాలే మంచివి..
గట్ సమస్యలతో బాధపడేవారు ఎక్కువయ్యారు. అయితే గట్ సమస్యతో బాధపడుతున్నవారికి ఆవు పాల కంటే బాదం పాలే మంచివని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే..?

gut health
ఈ రోజుల్లో చాలా మంది గట్ సమస్యలతో బాధపడుతున్నారు. ప్రకోప ప్రేగు సిండ్రోమ్ నుంచి లాక్టోస్ అసహనం, గట్ సిండ్రోమ్ వంటి సమస్యలు చాలా మందికి వస్తున్నాయి. గట్ సమస్యలతో బాధపడేవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వీళ్లు ఆవుపాలను తాగకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీళ్లు ఆవుపాలకు బదులుగా బాదం పాలను తాగాలని చెబుతున్నారు. ఎందుకంటే..?
బాదం పాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పాలు క్రీమీగా కనిపిస్తాయి. ఈ పాలు సాధారణ పాల రుచి మాదిరిగానే ఉంటుంది. అందుకే కాశాహారులు వీటిని ఎక్కువగా తాగుతుంటారు. ఆవు పాలకు అలెర్జీ లేదా అసహనం ఉన్నవారికి కూడా ఈ పాలు ప్రయోజనకరంగా ఉంటాయి. గట్ సమస్యలున్నవారు ఆవు పాలకు బదులు బాదం పాలను ఎందుకు తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బాదం పాలు జంతు ఉత్పత్తి కాదు. శాకాహారి ఆహారాన్ని ఎంచుకున్న వ్యక్తులకు, లాక్టోస్ అసహనం లేదా పాలకు అలెర్జీ ఉన్నవారికి బాదం పాలు బాగా ఉపయోగపడతాయి. బాదం పాలలో పాడి పాలలో మాదిరిగా లాక్టోస్ ఉండదు. లాక్టోస్ అసహనంతో బాధపడుతున్నవారు బాదం పాలను ఎంచక్కా తాగొచ్చు. బాదం పాలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేటప్పుడు మలబద్ధకం, ఇతర పేగు రుగ్మతలు వంటి సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది.
చాలా మందికి పాల చక్కెర అంటే లాక్టోస్ అసహనం ఉంటుంది. ఇలాంటి వారు పాలను తాగితే అవి సరిగ్గా జీర్ణం కావు. జీర్ణంకాని లాక్టోస్ పెద్దప్రేగుకు వెళుతుంది. అక్కడ ఉండే బ్యాక్టీరియా దానిని పులియబెట్టుతుంది. దీనివల్ల వాయువు, ఉబ్బరం, విరేచనాలు, ఇతర సంబంధిత సమస్యలు వస్తాయి.
డయాబెటిస్ పేషెంట్లు పాలలో చక్కెర వేసుకోకుండానే తాగాలి. అయితే బాదం పాలలో పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అంతేకాదు ఈ కార్భోహైడ్రేట్లు శక్తిగా మారుతాయి. సాధారణ ఆవుపాలను తాగే బదులు బాదం పాలను తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఫైనల్ గా..
బాదం పాలు పోషకమైనవి. లాక్టోస్ అసహనం ఉన్నవారికి గొప్ప ఎంపిక. దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బాదం పాలలో కాల్షియం, విటమిన్ డి, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. అంటే బాదం పాలు ఆవు పాలకంటే తక్కువేం కాదు.