మంకీ పాక్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో హెచ్చరిక..!
మంకీపాక్స్ కోసం మశూచి వ్యాక్సిన్‌ను ఉపయోగించడం మంచిదేనని ఆమె చెప్పారు.. అయితే మరిన్ని ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ మంకీ పాక్స్ తొలుత స్వలింగ సంపర్కుల్లో బయటపడిందని చెప్పారు.

ప్రపంచ దేశాలను వణికిస్తున్న మరో వైరస్ మంకీ పాక్స్. కరోనా తర్వాత ప్రపంచ దేశాలను మళ్లీ భయబ్రాంతులకు గురిచేస్తున్న వైరస్ ఇది. కాగా.. ఈ మహమ్మారి.. ప్రపంచ దేశాలకు ఓ మేల్కొలుపు లాంటిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. తాజాగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కు చెందిన ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామి నాథన్ దీని గురించి మాట్లాడారు.
ఈ మంకీపాక్స్ మనకు ఒక మేల్కొలుపు లాంటిదని.. ఈ ప్రాణాంతక మహమ్మారి వ్యాప్తి చెందకుండా మనల్ని మనం ఇప్పటికిప్పుడు సిద్దం చేసుకోవాలని ఆమె చెప్పారు.
మంకీపాక్స్ అనేది ఆర్థోపాక్స్ వైరస్ జాతికి చెందిన మంకీపాక్స్ వైరస్ వల్ల వస్తుంది. దీని క్లినికల్ ప్రెజెంటేషన్ మశూచిని పోలి ఉంటుంది, ఇది సంబంధిత ఆర్థోపాక్స్ వైరస్ ఇన్ఫెక్షన్ 1980లో ప్రపంచవ్యాప్తంగా నిర్మూలించబడినట్లు ప్రకటించారని ఆమె అన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్‌సైట్ మశూచి నిర్మూలన కార్యక్రమంలో ఉపయోగించే టీకాలు కోతుల నుండి రక్షణను కూడా అందిస్తాయని ఆమె చెప్పారు. కానీ కొత్త వ్యాక్సిన్‌లు అభివృద్ధి చేయబడ్డాయని.. వీటిలో ఒకటి కోతుల వ్యాధి నివారణకు ఆమోదించారని చెప్పారు.
మంకీపాక్స్ కోసం మశూచి వ్యాక్సిన్‌ను ఉపయోగించడం మంచిదేనని ఆమె చెప్పారు.. అయితే మరిన్ని ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ మంకీ పాక్స్ తొలుత స్వలింగ సంపర్కుల్లో బయటపడిందని చెప్పారు. అయితే.. వారి నుంచి వారి కుటుంబసభ్యులకు కూడా వ్యాపించడం మొదలౌతోందని చెప్పడం గమనార్హం.
కరోనా మహమ్మారితో ఈ మంకీ పాక్స్ ని పోల్చలేమని ఆమె చెప్పారు. ప్రస్తుతం అయితే.. దీని తీవ్రత కాస్త తక్కువగానే ఉందని.. అయితే... దీని గురించి సమాచారం కూడా తక్కువగానే ఉందని ఆమె చెప్పారు. వైరస్ లో వచ్చే మార్పలు, దాని ప్రభావం గురించి మరిన్ని ప్రయోగాలు చేయాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.