బెండకాయను ఎవరెవరు తినకూడదు?
బెండకాయ జిగటగా ఉన్నా ఇది మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కూరగాయను తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అయితే కొన్ని సమస్యలతో బాధపడేవారు మాత్రం బెండకాయను పొరపాటున కూడా తినకూడదు.
చాలా మంది బెండకాయ కూరను ఎంతో ఇష్టంగా తింటారు. దీనిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలుంటాయి. అయితే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం బెడకాయను తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు ఎవరు బెండకాయను తినకూడదు? తింటే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
okra
అలెర్జీలు ఉంటే
అలెర్జీలు ఉన్నవారు కొన్ని రకాలా ఆహారాలను అస్సలు తినకూడదు. ముఖ్యంగా బెండకాయ అలెర్జీ ఉన్నవారు దీనిని తినకపోవడమే మంచిది. ఒకవేళ తింటే చర్మ అలెర్జీలు లేదా జీర్ణశయాంతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
Okra
కిడ్నీ స్టోన్ సమస్య ఉంటే..
కిడ్నీ స్టోన్ సమస్యలు ఉన్నవారు ఏవి పడితే అవి తినకూడదు. ఎందుకంటే కొన్ని ఆహారాలు కిడ్నీ స్టోన్ సమస్యలను మరింత పెంచుతాయి. అలాగే బెండకాయను కూడా మూత్రపిండాల్లో రాళ్లున్న వారు అస్సలు తినకూడదు. అలాగే కిడ్నీకి సంబంధించి ఏదైనా సమస్య ఉన్నా కూడా బెండకాయకు దూరంగా ఉండాలి.
జీర్ణకోశ సమస్య ఉంటే..
జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు కూడా బెండకాయకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీళ్లు బెండకాయ కూరను తింటే జీర్ణ కోశ సమస్యలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉబ్బరం లేదా విరేచనాలు
ప్రస్తుత కాలంలో చాలా మంది తరచుగా గ్యాస్, విరేచనాలు లేదా కడుపు ఉబ్బరంతో బాధపడున్నారు. ఇలాంటి వారు బెండకాయకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇలాంటి వారు బెండకాయను తింటే గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం సమస్య మరింత పెరుగుతుంది.
Image: Getty Images
డయాబెటిక్ పేషెంట్లు తినకూడదు
డయాబెటిస్ సమస్యలు ఉన్నవారు కూడా బెండకాయను తినకుండా ఉండాలి. నిజానికి బెండకాయ మధుమేహులకు మంచిదే. కానీ దీన్ని మరీ ఎక్కువగా తినకుండా ఉండాలి. మరీ ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా తగ్గిపోతాయి.
okra
రక్తం గడ్డకట్టే సమస్య ఉంటే..
రక్తం గడ్డకట్టే సమస్య ఉన్నవారు చాలా ఆహారాలకు దూరంగా ఉండాలి. మీకు రక్తం గడ్డకట్టే సమస్య ఉన్నా, రక్తం సన్నబడటానికి మందులు తీసుకుంటున్నా డాక్టర్ ను అడగకుండా మాత్రం బెండకాయను తినకూడదు. ఎందుకంటే బెండకాయ రక్తం గడ్డకట్టేలా చేస్తుంది.
కడుపు నొప్పి
కొంతమంది తరచుగా కడుపు నొప్పితో బాధపడుతుంటారు. అయితే కడుపునొప్పి సమస్యలు ఉన్నవారు కూడా బెండకాయకు దూరంగా ఉండాలి. ఎందుకంటే బెండకాయ కడుపు నొప్పిని మరింత పెంచుతుంది.