Green Peas: షుగర్ పేషెంట్లు పచ్చి బఠానీలు తింటే ఏమవుతుందో తెలుసా?
పచ్చి బఠానీల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయినా సరే వీటిని కొంతమంది తినడం మంచిది కాదట. ఎవరు తినద్దు? ఎందుకు తినద్దో ఒకసారి తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us

పచ్చి బఠానీలు చాలా టేస్టీగా ఉంటాయి. వీటిలో పోషకాలు కూడా ఎక్కువే. సాధారణంగా మనం వీటిని పలావ్, కూర, కూర్మ ఇతర వంటల్లో వాడుతుంటాం. కానీ పచ్చి బఠానీలను కొందరు తినకూడదంట తెలుసా? ఎందుకు? బఠానీ తింటే ఏమవుతుందని అనుకుంటున్నారా? ఒకసారి తెలుసుకోండి.
గ్యాస్, ఉబ్బరం:
గ్యాస్, ఉబ్బరం సమస్యలున్నవారు పచ్చి బఠానీలు తినకూడదట. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియకు ఇబ్బంది అవుతుంది.
జాయింట్ పెయిన్:
జాయింట్ పెయిన్ లేదా యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు కూడా పచ్చి బఠానీలు తినకూడదు. ప్యూరిన్లు ఎక్కువగా ఉండటం వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుంది.
కిడ్నీలో రాళ్లు:
కిడ్నీలో రాళ్లు ఉన్నవారు పచ్చి బఠానీలు అస్సలు తినకూడదు. ప్యూరిన్లు కిడ్నీలో రాళ్లను పెంచుతాయి.
షుగర్ పేషెంట్స్:
షుగర్ ఉన్నవారు పచ్చి బఠానీలు తినకూడదు. షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే తినాలి.
పచ్చి బఠానీల ప్రయోజనాలు:
- ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియకు మంచిది.
- మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.
- గుండె ఆరోగ్యానికి మంచిది.
- బ్లడ్ ప్రెజర్ నియంత్రణలో ఉంచుతుంది.
- రక్తహీనతను తగ్గిస్తుంది.