MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • తలనొప్పిని ఫాస్ట్ గా తగ్గించే డ్రింక్ ఇది

తలనొప్పిని ఫాస్ట్ గా తగ్గించే డ్రింక్ ఇది

తలనొప్పి ఎన్నో కారణాల వల్ల వస్తుంది. అయితే శరీరంలో సోడియం తక్కువగా ఉంటే కూడా తలనొప్పి తరచుగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని చిటికెల్ తగ్గించడానికి ఒక డ్రింక్ బాగా సహాయపడుతుంది. అదేంటంటే?   

2 Min read
Author : Shivaleela Rajamoni
| Updated : Sep 10 2024, 04:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

తలనొప్పి రావడం సర్వ సాధారణం. ఒత్తిడికి గురైనా, పని ఎక్కువైనా, సరైన ఆహారం తీసుకోకపోయినా తలనొప్పి వస్తుంది. ఇవే కాదు ఇతర కారణాల వల్ల కూడా తలనొప్పి వస్తుంది. అయితే చాలా మంది ఈ తలనొప్పిని తగ్గించుకోవడానికి పెయిన్ కిల్లర్స్ ను తీసుకుంటుంటారు. 

కానీ తరచుగా ట్యాబ్లెట్లను వాడటం మంచిది కాదు. అయితే కొంతమందికి తలనొప్పి ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. ఇలా మీకు కూడా అయితే మీ శరీరంలో సోడియం లోపం ఉన్నట్టేనంటున్నారు నిపుణులు., అవును..  శరీరంలో సోడియం లెవెల్స్ తక్కువగా ఉన్నా తలనొప్పి ఎప్పుడూ వస్తుంటుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

ఈ తలనొప్పిని తగ్గించడానికి సోడియం ఎలా సహాయపడుతుంది? దీనిని నయం చేయడానికి శరీరంలో సోడియంను సమతుల్యం చేయడానికి ఏమేమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

35


సోడియం లోపం తలనొప్పికి కారణమవుతుంది

మన శరీరంలో సోడియం చాలా ముఖ్యమైంది. అయితే దీన్ని మరీ ఎక్కువగా తీసుకున్నా.. తీసుకోవాల్సిన దానికన్నా తక్కువగా తీసుకున్నా ఎన్నో సమస్యలు వస్తాయి. మన శరీరంలో నీటి సమతుల్యతను కాపాడటం దీని పని. అయితే మన శరీరంలో సోడియం లోపం ఉంటే శరీర ద్రవ సమతుల్యత దెబ్బతింటుంది. 

ఈ లోపం వల్ల కణాలు అదనపు ద్రవాన్ని గ్రహించడం స్టార్ట్ చేస్తాయి. ఇది కణాలలో వాపునకు కారణమవుతుంది. మెదడు కణాల వాపు వల్ల తలనొప్పి మొదలవుతుంది. అంతేకాదు శరీరంలో సోడియం తగ్గడం వల్ల లో బీపీ సమస్య వస్తుంది. ఇది తలనొప్పి, మైకం వంటి సమస్యలను కలిగిస్తుంది. అలాగే సోడియం లోపం వల్ల నాడీ వ్యవస్థ కూడా సరిగా పనిచేయదు. 
 

45

ఈ డ్రింక్ తలనొప్పిని వెంటనే తగ్గిస్తుంది

తలనొప్పి తగ్గడానికి మీరు క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ బాగా సహాయపడుతుంది. క్యారెట్లు, బీట్ రూట్ లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మీ శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతుంది. ఇవి శరీరంలో ఉన్న మొత్తం ఎలక్ట్రోలైట్లను సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

ఇందుకోసం రెండు క్యారెట్లు, ఒక బీట్ రూట్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. దీన్ని  బ్లెండర్ లో వేసి జ్యూస్ చేయండి. వడగట్టి పైన బ్లాక్ సాల్ట్ మిక్స్ చేసి తాగితే తలనొప్పి చిటికెలో తగ్గిపోతుంది. 
 

55


తలనొప్పిని తగ్గించే చిట్కాలు

అల్లం.. అల్లంతో కూడా తలనొప్పిని చాలా తొందరగా తగ్గించుకోవచ్చు. అల్లం మన తలలోని రక్తనాళాల వాపును తగ్గిస్తుంది. దీంతో తలనొప్పి తగ్గిపోతుంది. అల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఇది  మైగ్రేన్ వల్ల వచ్చే వికార సమస్యను కూడా తగ్గిస్తుంది. మీరు అల్లం టీని తాగితే తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది. 

పుదీనా నూనె.. పుదీనా వాసన తలనొప్పిని తగ్గించి మీకు రీఫ్రెష్ అనుభూతిని కలిగిస్తుంది. ఇది తలనొప్పికి కారణమయ్యే రక్త నాళాలను విస్తరించేలా చేస్తుంది. పుదీనాలో ఉండే మెంథాల్ శరీరంలో రక్త ప్రసరణను నియంత్రిస్తుంది. తలనొప్పిగా అనిపించినప్పుడు చీకటి గదిలో కూర్చొని దీనివాసన చూడండి. దీని నూనెను తలకు రాసినా మంచి ఫలితం ఉంటుంది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangoes: అతిగా మామిడి పండ్లు తింటే లావవుతారా?
Recommended image2
Mangoes: మామిడి పండ్లు తింటే ఒంట్లో వేడి చేస్తుందా? ఎక్కువ తింటే ఏమవుతుంది?
Recommended image3
Sugar: శరీరంలో చక్కెర మోతాదు పెరిగితే పేగుల్లో జరిగేది ఇదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved