ఫాస్ట్ గా బరువు తగ్గడానికి ఈ వ్యాధులు కూడా కారణమే తెలుసా?
చాలా మంది బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా బరువు తగ్గరు. కానీ కొంతమంది మాత్రం ఎలాంటి ప్రయత్నం చేయకుండానే ఫాస్ట్ గా బరువు తగ్గిపోతూ ఉంటారు. దీనికి కొన్ని వ్యాధులే కారణమంటున్నారు నిపుణులు. అవేంటంటే..
ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. పేలవమైన జీవనశైలే దీనికి ప్రధాన కారణం. ఇక పెరిగిన బరువును తగ్గించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటారు చాలా మంది. అయినా బరువు తగ్గని వారు చాలా మందే ఉన్నారు. దీనికి కొన్ని కారణాలుంటాయి. అయితే కొంతమందికి ఎలాంటి ప్రయత్నం చేయకుండా చాలా వేగంగా బరువు తగ్గిపోతూ ఉంటారు. దీనివల్ల చాలా మంది ఆనందపడిపోతుంటారు. కానీ ఇది మీరు ఆనందించాల్సిన విషయం కాదు. ఎందుకంటే ఎలాంటి ప్రయత్నం చేయకుండా అకస్మత్తుగా బరువు తగ్గడానికి కొన్ని వ్యాధులే కారణమంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం పదండి.
డయాబెటిస్
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీకు డయాబెటిస్ ఉన్నట్టైతే కూడా మీరు అకస్మత్తుగా బరువు తగ్గుతారు. మీరు ఎలాంటి ప్రయత్నం చేయకుండా బరువు తగ్గుతున్నట్టు అయితే వెంటనే హాస్పటల్ కు చూపించుకోండి. ప్రస్తుత కాలంలో చాలా మందికి డయాబెటీస్ వస్తోంది.
థైరాయిడ్
థైరాయిడ్ సమస్య ఉంటే కూడా అకస్మాత్తుగా బరువు తగ్గుతారు. థైరాయిడ్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి హైపోథైరాయిడిజం, రెండు హైపర్ థైరాయిడిజం. హైపర్ థైరాయిడిజం వల్ల గ్రంథి అతి చురుకుగా ఉంటుంది. దీనివల్ల చాలా ఫాస్ట్ గా బరువు తగ్గుతుంటారు.
డిప్రెషన్
ప్రస్తుత కాలంలో చాలా మంది డిప్రెషన్ బారిన పడుతున్నారు. ఈ డిప్రెషన్ అనుకున్నంత చిన్న సమస్యేం కాదు. అయితే మీరు కూడా అకస్మత్తుగా బరువు తగ్గుతున్నట్టైతే.. అది డిప్రెషన్ వల్ల కూడా కావొచ్చంటున్నారు నిపుణులు. దీనిని ఒక రకమైన మూడ్ డిజార్డర్ అని కూడా అంటారు.
బరువు తగ్గడానికి ఇతర కారణాలు
ఒత్తిడికి ఎక్కువగా గురికావడం, చిరాకుగా అనిపించడం వల్ల ఆకలి, దప్పిక చచ్చిపోవడం మొదలవుతుంది. దీనివల్ల కూడా వేగంగా బరువు తగ్గుతారు.
టీబీ
క్షయవ్యాధి ఉంటే కూడా ఎలాంటి ప్రయత్నం చేయకుండా వేగంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ వ్యాధి ఊపిరితిత్తులపై చెడు ప్రభావాన్ని చూపి ఆకలిని తగ్గిస్తుంది. దీంతో బరువు తగ్గడం మొదలవుతుంది.
weight loss
క్యాన్సర్
క్యాన్సర్ ప్రభావం మన రోగనిరోధక శక్తిపై ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మీ రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. అలాగే బరువు కూడా వేగంగా తగ్గడం ప్రారంభమవుతుంది.