MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • టూత్ బ్రష్ ను ఎన్ని రోజులకు మార్చాలో తెలుసా?

టూత్ బ్రష్ ను ఎన్ని రోజులకు మార్చాలో తెలుసా?

రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకుంటే మన ఆయుష్షు పెరుగుతుందని,  ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తరచుగా చెప్పడం వినే ఉంటారు. మీరు పళ్లు తోముకోవడం వల్ల ప్రయోజనాలను పొందాలంటే మాత్రం టూత్ బ్రష్ ను తరచుగా మారుస్తూ ఉండాలి. అసలు టూత్ బ్రష్ ను ఎన్ని రోజులకోసారి మార్చాలో తెలుసా? 

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : May 24 2024, 11:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మనలో చాలా మంది టూత్ బ్రష్ విరిగిపోయినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు మాత్రమే మారుస్తుంటారు. కానీ ఈ అలవాటు అస్సలు మంచిది కాదంటారు ఆరోగ్య నిపుణులు. అవును టూత్ బ్రష్ ను నెలల తరబడి మార్చడం వల్ల మీరు లేని పోని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు టూత్ బ్రష్ ను ఏయే సందర్భాల్లో మార్చాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

25
Toothbrush

Toothbrush

బ్రిస్టిల్స్

చాలా మంది టూత్ బ్రష్ బ్రిస్టిల్స్ వంగిపోయినా అలాగే వాడుతుంటారు. కానీ ఇలా అస్సలు వాడకూడదు. మంచి టూత్ బ్రష్ బ్రిస్టిల్స్ నిటారుగా ఉంటాయి. మీరు వాడే టూత్ బ్రష్ బ్రిస్టిల్స్ నిటారుగా కాకుండా కిందకు వంగి ఉంటే వెంటనే మీ బ్రష్ ను మార్చండి. 
 

35
tooth brush

tooth brush

అస్వస్థతకు గురైతే..

మీరు ఈ మధ్యాకాలంలో అనారోగ్యానికి గురై మళ్లీ కోలుకున్నట్టైతే కూడా మీరు మీ టూత్ బ్రష్ ను ఖచ్చితంగా మార్చాలి. ఎందుకంటే టూత్ బ్రష్ వ్యాధికారక క్రిములతో వ్యాప్తి చెందుతుంది. అందుకే మీరు మళ్లీ దాన్నే ఉపయోగిస్తే మళ్లీ అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. 
 

45

దుర్వాసన 

కొంతమంది టూత్ బ్రష్ నుంచి దుర్వాసన వస్తున్నా కూడా అలాగే వాడుతుంటారు. కానీ మీ టూత్ బ్రష్ నుంచి చెడు వాసన వస్తున్నట్టైతే దానిలో బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి టూత్ బ్రష్ ను పొరపాటున కూడా వాడకూడదు. 
 

55


హాస్పటల్ నుంచి ఇంటికి

మీరు ఏదైనా అనారోగ్య సమస్యతో హాస్పటల్ కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తే కూడా టూత్ బ్రష్ ను ఉపయోగించకండి. ఎందుకంటే వీటివల్ల మీకు మళ్లీ వ్యాధులొచ్చే ప్రమాదం ఉంది. అలాగే గడువు తీరిన టూత్ బ్రష్ లను కూడా ఉపయోగించకూడదు.సాధారణంగా టూత్ బ్రష్ ను 2 నుంచి 3 నెలలు ఉపయోగించిన తర్వాత వాడకూడదు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Walking: 20 రోజులపాటు రోజుకు 10 నిమిషాలు వాకింగ్ చేస్తే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!
Recommended image2
Orange Benefits: రోజుకో ఆరెంజ్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image3
Cumin Water: పరగడుపున కాదు.. రాత్రి పడుకునే ముందు జీలకర్ర నీరు తాగితే కలిగే 5 లాభాలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved