బ్లీడింగ్ ఎక్కువయ్యే వారికి ప్యాడ్లు, టాంపోన్లలో ఏవి బెస్ట్ అంటే?
కొంతమందికి పీరియడ్స్ సమయంలో విపరీతమైన బ్లీడింగ్ అవుతుంటుంది. ఇలాంటి వారు ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సమస్య ఉన్నవారు ఎలాంటి శానీటరీ ఉత్పత్తులను వాడాలంటే?
శానిటరీ ప్యాడ్స్, టాంపోన్లు, మెన్స్ట్రువల్ కప్పులు అంటే ఆడవారికి ఎన్నో రకాల పీరియడ్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కరూ ఈ ఉత్పత్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైన వాటినే ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్లీడింగ్ ఎక్కువగా అయ్యేవారు.. లీకేజీ కాకుండా సరైన ఉత్పత్తులను వాడాల్సి ఉంటుంది.
2023 ఆగస్టు లో బీఎంజె లైంగిక & పునరుత్పత్తి ఆరోగ్యం జర్నల్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. ఎక్కువ బ్లీడింగ్ ను ఎదుర్కోవటానికి శానిటరీ ప్యాడ్లు లేదా టాంపోన్ల కంటే మెన్స్ట్రువల్ డిస్క్ లు మంచివి వెల్లడించింది. ఈ అధ్యయనం ప్రకారం.. సగటున మెన్స్ట్రువల్ డిస్క్ లో 61 మి.లీ రక్తాన్ని నింపుకోగలుగుతాయి. ప్యాడ్లు, టాంపోన్లు, మెన్స్ట్రువల్ కప్పుల విషయానికొస్తే ఇవి 20 నుంచి 50 మి.లీ వరకే నింపుకుంటాయి.
హెవీ బ్లీడింగ్ కు ఎన్నోకారణాలు ఉన్నాయి. హార్మోన్ల అసమతుల్యత, గర్భాశయ ఫైబ్రాయిడ్లు, మందులు వంటి వివిధ కారకాల వల్ల రక్తస్రావం ఎక్కువగా అవుతుంది. అయితే హార్మోన్ల అసమతుల్యత, ముఖ్యంగా ప్రొజెస్టెరాన్తో పోలిస్తే ఈస్ట్రోజెన్ ఎక్కువగా ఉండటం, మందపాటి గర్భాశయ పొర అధిక రక్తస్రావానికి దారితీస్తుంది.
అధిక రక్త్రస్రావం కోసం రుతుక్రమ ఉత్పత్తులు
బ్లీడింగ్ ఎక్కువయ్యే వారికి ఏది బెస్టో చెప్పడం కష్టం. ఎందుకంటే ఇది వ్యక్తిగత ప్రాధాన్యత, సౌకర్యంపై ఆధారపడి ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలు మీకోసం:
1. బ్లీడింగ్ ఎక్కువయ్యే వారు ప్రతి నాలుగైదు గంటలకొకసారి ప్యాడ్స్ ను ఖచ్చితంగా మార్చాలి.
2. టాంపోన్లు కొంతమందికి అనుకూలంగా ఉంటాయి. కానీ తగిన శోషణ స్థాయి ఉన్న టాంపోన్ ను వాడటం అవసరం.
3. మెన్స్ట్రువల్ కప్పులు రక్తాన్ని ఎక్కువగా నిలుపుకోవడానికి ఉపయోగపడతాయి. ఇవి టాంపోన్ల కంటే ఎక్కువ రక్తాన్ని నిల్వచేస్తాయి. అందులోనూ వీటిని క్లీన్ చేసి మళ్లీ ఉపయోగించొచ్చు. అలాగే పర్యావరణ అనుకూలమైనవి కూడా.
4. అయితే సాంప్రదాయ పీరియడ్స్ ఉత్పత్తులకు మెన్స్ట్రువల్ డిస్క్ లు మంచి ప్రత్యామ్నాయం అంటున్నారు నిపుణులు. పైన పేర్కొన్న అధ్యయనం ప్రకారం.. ఇవి అధిక రక్తస్రావం కోసం బెస్ట్ ప్రొడక్స్. కానీ దీనివల్ల కొన్ని లాభాలను, నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మెన్స్ట్రువల్ డిస్క్ లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు
1. మెన్స్ట్రువల్ డిస్క్ లు టాంపోన్లు లేదా శానిటరీ ప్యాడ్ల కంటే ఎక్కువ రక్తాన్ని పట్టి ఉంచగలవు. అందుకే ఇవి హెవీ బ్లీడింగ్ అయ్యే వారికి అనుకూలంగా ఉంటాయి.
2. డిస్క్ ను సరిగ్గా చొప్పిస్తేఇది టాంపోన్ లు లేదా ప్యాడ్ ల కంటే సౌకర్యవంతం ఉంటాయి. ఇవి మీలో ఉన్నట్టుగా కూడా మీకు ఎక్కువగా గుర్తురాదు.
3. అయితే ఈ మెన్స్ట్రువల్ డిస్క్ లను కూడా తిరిగి ఉపయోగించొచ్చు. అంటే తక్కువ వృథా అవుతుంది.
మెన్స్ట్రువల్ డిస్క్ లను ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు
1. పీరియడ్స్ డిస్క్ లను చొప్పించడం, తొలగించడం కొంతమంది మహిళలకు ఇబ్బందిగా ఉంటుంది.
2. టాంపోన్ లేదా ప్యాడ్ మార్చడం కంటే ఈ డిస్క్ ను ఖాళీ చేయడం మంచిది.
3. ఈ డిస్క్ లు కొంతమంది మహిళలకు అసౌకర్యంగా ఉండొచ్చు.
అధిక రక్తస్రావం అయ్యే వారు పీరియడ్స్ ఉత్పత్తులను తరచుగా మారుస్తూ ఉండాలి. అయితే పీరియడ్స్ ఉత్సత్తులు.. ఫ్రీక్వెన్సీ ఉత్పత్తి రకం, శోషణ, వ్యక్తిగత ప్రవాహాన్ని బట్టి మారుతుందని నిపుణులు అంటున్నారు. టాంపోన్లు, ప్యాడ్లు లీకేజీ కాకుండా, సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రతి నాలుగు గంటలకు లేదా అవి నిండినప్పుడు ఖచ్చితంగా మార్చాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మెన్స్ట్రువల్ కప్పులు, డిస్క్ లను ఖాళీ చేయడానికి ముందు సాధారణంగా 12 గంటల వరకు ఉపయోగించొచ్చు. కానీ ఇది మీ ప్రవాహాన్ని బట్టి మారొచ్చు.