MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Health
  • బీపీ ఎక్కువ ఉన్నవాళ్లు బ్రేక్ ఫాస్ట్ లో వీటిని అస్సలు తినొద్దు

బీపీ ఎక్కువ ఉన్నవాళ్లు బ్రేక్ ఫాస్ట్ లో వీటిని అస్సలు తినొద్దు

హైబీపీ పేషెంట్లు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని రకాల ఆహారాలు రక్తపోటును అమాంతం పెంచేస్తాయి. ముఖ్యంగా వీళ్లు ఉదయం కొన్ని ఆహారాలను తినకూడదని డాక్టర్లు చెప్తున్నారు. అవేంటంటే? 

2 Min read
Author : Shivaleela Rajamoni
| Updated : Sep 08 2024, 02:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రతి ఒక్కరూ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ ను ఖచ్చితంగా తింటారు. ఇదే మన డే  మొదటి భోజనం. అందుకే ఇది మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అందుకే బ్రేక్ ఫాస్ట్ లో ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలి. అయితే సాధారణంగా చాలా మంది బ్రేక్ ఫాస్ట్ తింటున్నామా? లేదా? అనేదే చూస్తారు

కానీ.. ఇవి ఆరోగ్యానికి మంచి చేస్తాయా? చెడు చేస్తాయా? అని చూడరు. కానీ బీపీ పేషెంట్లు మాత్రం ఖచ్చితంగా చూడాలి. అవును బీపీ పేషెంట్లు ఉదయాన్నే కొన్ని ఆహారాలను తినకూడదు. ఎందుకంటే ఇవి వారి బీపీని మారింత పెంచుతాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఉదయం బ్రేక్ ఫాస్ట్ హెల్తీగా లేకపోతే మీ ఆరోగ్యం దెబ్బతినడంతో పాటుగా మీ రక్తపోటు కూడా పెరుగుతుంది. ఈ అధిక రక్తపోటు కాలక్రమేణా గుండె జబ్బులు,  స్ట్రోక్ వంటి వివిధ ప్రమాదకరమైన ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

అందుకే మీరు మీ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే హైబీపీ పేషెంట్లు బ్రేక్ ఫాస్ట్ లో అస్సలు తినకూడని కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

36


అధిక సోడియం తృణధాన్యాలు

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో చాలా మంది తృణధాన్యాలను తింటుంటారు. కానీ బీపీ ఎక్కువగా ఉన్నవారు బ్రేక్ ఫాస్ట్ లో ఎట్టిపరిస్థితిలో సోడియం ఎక్కువగా ఉండే తృణధాన్యాలను తినకూడదు. ఈ రోజుల్లో రెడీ టూ ఈట్ తృణధాన్యాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. 

కానీ టేస్ట్ కోసం వీటిలో ఉప్పును ఎక్కువగా కలుపుతారు. సోడియం ఎక్కువగా ఉండటం వల్ల బీపీ పేషెంట్లు వీటిని తినడం మంచిది కాదు. అందుకే మీరు తృణధాన్యాలను తినాలనుకుంటే తక్కువ సోడియం లేదా తియ్యని సెరల్స్ నే ఎంచుకోండి. 

46

వేయించిన ఆహారాలు

రక్తపోటు ఎక్కువగా ఉన్నవారు బ్రేక్ ఫాస్ట్ లో ఎట్టిపరిస్థితిలో డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్ ను పొరపాటున కూడా తినకూడదు. ఎందుకంటే వేయించిన ఆహారాల్లో అనారోగ్యకరమైన కొవ్వు పదార్ధం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి మీరు వీటిని తింటే మీ బరువు మరింత పెరుగుతుంది. అలాగే మీ రక్తపోటును కూడా పెంచుతుంది. 

56

వైట్ బ్రెడ్, పేస్ట్రీలు

అధిక రక్తపోటు పేషెంట్లు వైట్ బ్రెడ్, పేస్ట్రీలు వంటి శుద్ధి చేసిన పిండితో తయారు చేసిన  ఫుడ్ ఐటమ్స్ కు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ ఆహార పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అంతే కాదు ఇవి మీ బరువును కూడా పెంచుతాయి. అలాగే మీ రక్తపోటు సమస్యను మరింత ఎక్కువ చేస్తాయి. 
 

66
Blood Pressure

Blood Pressure


అధిక కొవ్వు పాల ఉత్పత్తులు

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో పాలను చాలా మంది తాగుతుంటారు. పెరుగును తింటుంటారు. ఇది సర్వసాధారణ విషయం. కానీ మీకు హై బీపీ సమస్య ఉంటే మాత్రం ఫుల్ ఫ్యాట్ మిల్క్, ఫుల్ ఫ్యాట్ చీజ్ వంటి అధిక కొవ్వు పాల ఉత్పత్తులను తీసుకోకూడదు. ఎందుకంటే ఈ రకమైన పాల ఉత్పత్తుల్లో సంతృప్త కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉంటుంది.

అందుకే వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే బీపీ సమస్య కూడా పెరుగుతుంది. మీరు పాల ఉత్పత్తులను తినాలనుకుంటే అధిక కొవ్వు పాల ఉత్పత్తులకు బదులుగా స్కిమ్డ్ మిల్క్ మొదలైన వాటిని తీసుకోండి. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved