MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Health
  • తేనెలో ఖర్జూరాలను నానబెట్టి తింటే ఏమౌతుందో తెలుసా?

తేనెలో ఖర్జూరాలను నానబెట్టి తింటే ఏమౌతుందో తెలుసా?

ఖర్జూరాల్లో నేచురల్ షుగర్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని ఎన్నో తీపి వంకాలను తయారుచేయడానికి కూడా చాలా మంది ఉపయోగిస్తారు. కొంతమంది అలాగే తింటుంటారు. అయితే ఈ ఖర్జూరాలను మీరు అలాగే కాకుండా తేనెలో నానబెట్టి తింటే ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Sep 15 2024, 12:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

తేనె మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, క్రిమినాశక లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే  ఖర్జూరాల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి.

అయితే ఈ రెండింటిని మనం కలిపి తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందుతామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు తేనెలో ఖర్జూరాలను నానబెట్టి తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మెరుగైన జీర్ణక్రియ 

ఖర్జూరాల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువును తగ్గించడం నుంచి జీర్ణ సమస్యలను తగ్గించడం వరకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది.

అయితే ఎవరికైతే జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుందో.. వారికి ఈ కాంబినేషన్ ప్రయోజనకరంగా ఉంటుంది. అవును ఖర్జూరాలను తేనెలో నానబెట్టి తింటే జీర్ణశక్తిని మెరుగుపడుతుంది. 

మలబద్ధకం

చెప్పుకోరు కానీ చాలా మంది మలబద్దకం సమస్య ఉంటుంది. కానీ ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల అర్షమొలల నుంచి ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్య ఉన్నవారు తేనెలో ఖర్జూరాలను నానబెట్టి తింటే ప్రయోజనకరంగా ఉంటుంది.

నిజానికి ఫైబర్ లోపం వల్లే మలబద్దకం సమస్య వస్తుంది. కాబట్టి దీన్ని తింటే ఫైబర్ లోపం తగ్గుతుంది. అలాగే మీ జీవక్రియ కూడా పెరుగుతుంది. తేనెలో ఖర్జూరాలను నానబెట్టి తింటే తింటే  మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. 
 

35

బలమైన రోగనిరోధక 

కొంతమందికి ఇమ్యూనిటీ పవర్ చాలా బలహీనంగా ఉంటుంది. ఇలాంటి వారు ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతుంటారు. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే దగ్గు, జలుబు, జ్వరంతో పాటుగా ఎన్నో సమస్యలు తరచుగా వస్తూనే ఉంటాయి.

అయితే మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి తేనె, ఖర్జూరాలు బాగా సహాయపడతాయి. ఈ రెండింటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వీటిలో ఐరన్ తో పాటుగా జింక్, రకరకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. 

దగ్గు, జలుబు నుంచి ఉపశమనం

కొంతమందికి సీజన్లతో సంబంధం లేకుండా దగ్గు, జలుబు సమస్యలు వస్తుంటాయి. కానీ ఈ సమస్యలు అంత తొందరగా తగ్గవు. ఇలాంటి వారికి తేనె, ఖర్జూరాలు ఎంతగానో సహాయపడతాయి.

తేనెలో నానబెట్టిన ఖర్జూరాలను తింటే జలుబు,  దగ్గు తొందరగా తగ్గిపోతాయిని నిపుణులు చెబుతున్నారు. వాతావరణం మారినప్పుడు తేనెలో నానబెట్టిన ఖర్జూరాలను  ఖచ్చితంగా తినండి. దగ్గు, జలుబు రావు. 
 

45

కండరాల పెరుగుదల

కండరాలు పెంచాలనుకునే వారికి తేనె, ఖర్జూరాలు బాగా సహాయపడతాయి. అవును తేనెలో నానబెట్టిన ఖర్జూరాలను రోజూ తింటే కండరాలు వేగంగా పెరుగుతాయి.

తేనెలో, ఖర్జూరాల్లో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ కాంబినేషన్ మీరు కండరాలను పెంచడానికి బాగా సహాయపడుతుంది.
 

55


చర్మానికి మేలు 

తేనె, ఖర్జూరాలు రెండూ మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. తేనెలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అంటే ఇది మన చర్మాన్ని లోపలి నుంచి మృదువుగా, అందంగా చేస్తుంది. ఖర్జూరాలను తింటే మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. 

వాపును తగ్గిస్తుంది

తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అయితే మీరు తేనెలో నానబెట్టిన ఖర్జూరాలను తింటే శరీరంలో వాపు తగ్గుతుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image2
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Recommended image3
Street Food: రోడ్డు మీద సమోసాలు, బజ్జీలు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? నూనె బాగుందో లేదో 10 సెకన్లలో ఎలా గుర్తించాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved