పసుపుతో వచ్చే సమస్యలు ఇవే
మనం ప్రతి ఒక్క కూరలో పసుపును ఖచ్చితంగా వేస్తాం. పసుపు మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడం నుంచి ఎన్నో జబ్బులకు దూరంగా ఉంచుతుంది. కానీ దీన్ని ఎక్కువగా తింటే మాత్రం మీరు లేనిపోని అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది.
పసుపుతో మనకు కలిగే ప్రయోజనాలు తెలిసిందే. ఎందుకంటే పసుపులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని గాయాలకు పెడితే తొందరగా మానుతాయి. అలాగే ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలకు మనల్ని దూరంగా ఉంచుతుంది. కానీ కొన్ని సమస్యలు ఉన్నవారు పసుపును తినకూడదు. అలాగే పసుపును ఎక్కువగా తింటే మనం ఎన్నో సమస్యల బారిన పడాల్సి వస్తుంది.
Turmeric Powder
పసుపును ఒక్క వంటలకే కాదు పెళ్లిళ్లకు, శుభకార్యాలకు కూడా ఉపయోగిస్తారు. అంతేకాదు పసుపును పవిత్రంగా కూడా భావిస్తారు. పసుపును కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా ఉపయోగించొచ్చు. పసుపును తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో వ్యాధులతో పోరాడే సామర్థ్యం అందుతుంది.
అంతేకాకుండా ఇది శరీరం మంటను తగ్గించడానికి సహాయపడుతుంది.పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ పసుపును తీసుకోవడం వల్ల మనకు బోలెడు లాభాలు కలుగుతాయి.
మనలో ప్రతి ఒక్కరికీ పసుపు ప్రయోజనాల గురించి అంతో ఇంతో తెలిసే ఉంటుంది. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే? పసుపు కూడా హాని చేస్తుంది. అవును పసుపు కూడా మనల్ని కొన్ని జబ్బుల బారిన పడేస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పసుపు చేసే నష్టాలు ఇవే
మీకు తెలుసా? పసుపును మోతాదుకు మించి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఒకవేళ పసుపును ఎక్కువగా తీసుకుంటే కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది. దీంతో గ్యాస్, అపానవాయువు, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే విరేచనాల సమస్య కూడా వస్తుంది. అందుకే పసుపును ఎక్కువగా తీసుకోవడం మానేయండి.
పసుపు మన రక్తాన్ని పలుచగా చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే మీరు ఇప్పటికే రక్తం పలుచగా అయ్యే మందులు వాడుతున్నట్టైతే పసుపును ఎక్కువగా అస్సలు తీసుకోకండి. ఇది చాలా డేంజర్. ఇకపోతే పసుపులో వేడి చేసే గుణం ఉంటుంది. అలాగే కొంతమందికి పసుపు అలెర్జీ ఉంటుంది. దీనివల్ల పసుపును తీసుకుంటే చర్మం వాపు, దద్దుర్లు, ఎర్రగా మారడం వంటి సమస్యలు వస్తాయి.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పసుపును ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. అంతేకాదు ఎక్కువ పసుపు తలనొప్పిని కూడా కలిగిస్తుందట. కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవారు పసుపును మోతాదుకు మించి తీసుకోకూడదు. ఎందుకంటే ఎక్కువ పసుపు మీ సమస్యలను మరింత పెంచుతుంది.
turmeric
గర్భంతో ఉన్నవారు కూడా పసుపును ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే పసుపు గర్భాశయ కండరాలను ఉత్తేజపరుస్తుంది. ఇకపోతే షుగర్ ఉన్నవారు కూడా పసుపును ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే వీరి రక్తం చాలా మందంగా ఉంటుంది. దీన్ని పలుచగా చేయడానికి వీళ్లు మందులను వాడల్సి వస్తుంది. అయితే పసుపు రక్తాన్ని పలుచగా కూడా చేస్తుంది. పసుపు వల్ల రక్తం మరింత పల్చగా అవుతుంది. ఇది మంచిది కాదు. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు పసుపును ఎక్కువగా తినకూడదు.
turmeric
పసుపు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
పసుపు వాపును, నొప్పిని తగ్గిస్తుంది.
ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది.
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
క్యాన్సర్ నివారణగా పనిచేస్తుంది.